బొగ్గు మంత్రిత్వ శాఖ
సుస్థిరాభివృద్ధి కృషిని వేగవంతం చేసిన బొగ్గు మంత్రిత్వశాఖ: సుస్థిరాభివృద్ధి విభాగం ఏర్పాటు
2030 నాటికి 15,000 కోట్ల రూపాయయల పెట్టుబడితో 5560 మెగావాట్ల అదనపు పునరుత్పాదక సామర్ధ్యాన్ని సాధించేందుకు బొగ్గు లిగ్నైన్ కంపెనీల ప్రణాళిక
2023-24 నాటికి బొగ్గు రంగంలో 13,000 కోట్ల రూపాయలతో 39 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల ఏర్పాటు
Posted On:
18 NOV 2021 3:48PM by PIB Hyderabad
పంచామృత్ వ్యూహం కింద కాప్ 26 లో ప్రధానమంత్రి ఇటీవల నూతన వాతావరణ పరిస్థితులకు సంబంధించిన లక్ష్యాలను ప్రకటించడంతో, ఇండియా పరిశుభ్ర ఇంధన రంగం దిశగా తన నిబద్ధతను చాటుకునేందుకు కీలక అడుగులు వేస్తోంది. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి కీలక ఇంధనంగా ప్రస్తుతం బొగ్గు ఉంటూ వస్తోంది. ప్రత్యామ్నాయ ఇంధనం మన డిమాండ్ కు అనుగుణంగా పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. బొగ్గు మంత్రిత్వశాఖ సమగ్ర సుస్థిర అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. దీనిని సత్వరం అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే ప్రారంభించింది. బొగ్గు గనుల రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు, ఇందుకు సంబంధించిన పర్యావరణ పరమైన, సామాజిక ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది.
మైనింగ్ కు సంబంధించిన ప్రతికూల ప్రభావాన్న తగ్గించేందుకు తగిన కార్యాచరణ, సలహాలు, మార్గనిర్దేశానిఇక బొగ్గు మంత్రిత్వశాఖలో పూర్తి స్థాయి సుస్థిరాభివృద్ధి సెల్ (ఎస్‌డిసి) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో ముందుకు వెళ్లడానిఇకి మార్గాన్ని సూచించడంతోపాటు, కార్యాచరణ అమలు, పర్యవేక్షణకు దేశంలోని బొగ్గు, లిగ్నయిట్ రంగాలలో పర్యావరణ ప్రభావాలను తగ్గించేందుకు ఎస్‌డిసి పాలసీ ఫ్రేమ్‌వర్క్కు రూపకల్పన చేస్తోంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), సింగరేణి కోల్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) తోపాటు దాని అనుబంధ సంస్థలు, ఎన్ ఎల్‌సి ఇండియా లిమిటెడ్ లు పెద్ద ఎత్తున కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటి ప్రభావం ఈ మైనింగ్ కంపెనీలలో కొన్నింటిలో చూడవచ్చు.
ఇప్పటి నుంచి 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను మన దేశం 1 బిలియన్ టన్నులు తగ్గించేందుకు చెప్పుకున్న సంకల్పానికి అనుగుణంగా గనుల తవ్వకానికి సంబంధించిన భూమి బయో రిక్లమేషన్ ను అన్ని బొగ్గు కంపెనీలు పెద్ద ఎత్తున చేడుతున్నాయి. విస్తృతస్థాయిలో మొక్కలు నాటడం ద్వారా దీనిని చేపడుతున్నాయి.రాగల 5 సంవత్సరాలలో 12000 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇది ఏటా కార్బన ఉద్గారాలను ఏటా లక్షటన్నులు తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాల అమలు పర్యవేక్షణను రిమోట్ సెన్సింగ్ ద్వారా చేపట్టడం జరుగుతోంది.
శిలాజేతర ఇంధన సామర్ధ్యాన్ని 2030 నాటికి 500 జిడబ్ల్యుకి పెంపొందించాలన్న మన సంకల్పానికి అనుగుణంగా, బొగ్గు లగ్నయిట్ కంపెనీలు అదనంగా 5560 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సుమారు 15000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనుఉన్నాయి. ఇది మొత్తం స్థాపిత సామర్థ్యాన్ని 7 గిగావాట్లకు తీసుకువెళుతుంది. కోల్ ఇండియా ఒక్కటే 3 గిగావాట్ల సౌర విద్యుత్‌ను రాగల 5 సంవత్సరాలలో ఉత్పత్తి చేయనుంది. నికర జీరో టార్గెట్ సాధించేందుకు ఈ చర్యలు చేపట్టనుంది.
పర్యావరణ కాలుష్యాన్ని కనీస స్థాయికిఇ తగ్గించేందుకు బొగ్గు కంపెనీలు చేపట్టిన మరో ప్రధాన చర్య ఫస్ట్ మైల్ కనెక్టివిటి (ఎఫ్.ఎం.సి) . ఇందులో బొగ్గును కోల్ హో ల్డింగ్ ప్లాంట్ లనుంచి లోడింగ్‌కు కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపిస్తారు.ఈ పద్ధతి బొగ్గును రోడ్డు ద్వారా పంపాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఈ దిశగా భారీ ముందడుగు పడుతోంది. 2023-24 నాటికి 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 39 ఇలాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ. సిఐఎల్ తన మెకానికల్ లోడింగ్ బొగ్గు రవాణాను ప్రస్తుత స్థాయిలో ఉన్న 120 మిలియన్ టన్నుల నుంచి 2023-24 నాటికి 565 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లనుంది.. ఈ ఎఫ్ ఎం సి ప్రాజెక్టులు ఏటా 2,100 కోట్ల రూపాయల డీజిల్‌ను ఆదా చేస్తాయి.అలాగే గంటక 2770 ట్రక్కుల రాకపోకలను ఇది తగ్గిస్తుంది. ఇది కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది.
ఇలాగే, ఉపరితల బొగ్గు గాసిఫికేషన్ ప్రాజెక్టులు సిన్ గ్యాస్ ఉత్పత్తికి అనుగుణంగా ప్లాన్ చేయడం జరిగింది.దీనిని మిథనాల్, ఇథనాల్ ,యూరియా, పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి ఉపయోగించడానికి వీలు కలుగుతుది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు డ్రైఫ్యుయల్ గా గ్రీన్ కోల్ ఉపయోగానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సిఐఎల్ జెవి ప్రాజెక్టు 2.5 ఎంపిటిఎ సామర్ధ్యం తో ఒడిషాలోని తాల్చేర్ కోల్ ఫీల్డ్స్ లో ఇప్పటికే పనిచేస్తున్నది. ఇతర ఐదు ప్రాజెక్టులు సుమారు 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో సిఐఎల్ కు చెందిన వివిధ సబ్సిడరీల కింద రూపుదిద్దుకుంటున్నాయి.
మైనింగ్ రంగంలో, బొగ్గు రవాణాలో డీజిల్ కు బదులుగా ఎల్.ఎన్ .జిని పెద్ద ఎత్తున వినియోగానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును కోల్ కంపెనీలు ప్రారంభించాయి. తొలిదశలో కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు బొగ్గు రవాణా డంపర్లలో ఈ సాంకేతికతను ఉపయోగించనున్నారు.
సామాజికంగా చూసినట్టయితే, గనుల నీటిని సాగు అవసరాలకు ఉపయోగించడం, శుద్ధిచేసిన నీటిని మైనింగ్ సబ్సిడరీలు అయిన సిఐఎల్, ఎస్ సిసిఎల్, ఎన్ ఎల్ సి ఎల్ ల పొరుగున ఉన్న కమాండ్ ఏరియా ప్రాంతాలలో తాగునీటి అవసరాలకు వినియోగించడం వంటివి చేపట్టడం జరుగుతోంది. మైనింగ్ కార్యకలాపాల సమయంలో పెద్ద మొత్తంలో గనుల నీరు అంతర్గత వినియోగానికి పాక్షికంగా కాలనీలలో తాగునీటికి వినియోగించడం జరుగుతోంది. అలాగే దుమ్ము రేగకుండా నీటిని చల్లడానికి వినియోగిస్తారు. సిఐఎల్ కు చెందిన కొన్ని సబ్సిడరీలు గనుల నీటిని వ్యవసాయం, తాగునీటి కోసం పొరుగున ఉన్న గ్రామాలలో వినియోగిస్తున్నాయి. రాగల 5 సంవత్సరాలలో 4600 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని తాగు, సాగు అవసరాలకు పొరుగున ఉన్న గ్రామాలలో వాడాలన్నది లక్ష్యం. ఇది 16.5 లక్షల మందిగ్రామీణ ప్రజానీకానికి నీటిని అందిస్తుంది. అలాగే 3.4 లక్షల ఎకరాల గ్రామీణ భూములకు సాగునీటిని అందిస్తుంది.
ఇక పరిశుద్ద పర్యావరణం విషయంలో 12 కొత్త ఎకో పార్కులను మైనింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటిని సిఐఎల్, ఎస్ సిసిఎల్, ఎన్ ఎల్ సిఐఎల్ సబ్సిడరీలు చేపట్టి అమలు చేస్తున్నాయి. ఇవి ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాదినాటికి పూర్తికానున్నాయి. డబ్ల్యుసిఎల్ ఇప్పటికే నాగపూర్ సమీపంలో ని మైనింగ్ ఏరియాలో భారీ ఎకో పార్కును అభివృద్ధి చేసంది. ఇది ఎకో మైనింగ్ టూరిజం సర్కూట్‌ను నిర్వహిస్తోంది. ఎం.టి.డి.సి కొలాబరేషన్ తో దీనిని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఓపెన్ కాస్ట్, భూగర్భ గనులను సందర్శించవచ్చు. ఇదే విధంగా ఎకో మైన్ టూరిజం సర్కూల్‌ను త్వరలోనే వివిధ బొగ్గు కంపెనీలు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించనున్నాయిఇ. ఇవి బొగ్గు కంపెనీలు పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని తెలియజెప్పనున్నాయి. బొగ్గు రవాణా మార్గంలో వెదురు మొక్కలు నాటడం, గనుల చివరి ప్రాంతాలలో వెదురు నాటడం వల్ల దుమ్ము రేగకుండా కాలుష్యాన్ని నిలువరించడానికి వీలు కలుగుతుంది.
ఓవర్ బర్డన్ డంప్ (ఒబి)నుంచి ఇసుక తీయడం మరో ముఖ్యమైన విషయం. నిర్మాణ రంగంలో దీనిని ఉపయోగించవచ్చు. ఇది సుస్థిరా భివృద్ధికి ఉపకరిస్తుంది. ఇది పెద్ద ఎత్తున ఇళ్లనిర్మాణానికి తక్కువ ఖర్చుతో ఇసుక అందుబాటులో రావడానికి ఉపకరిస్తుంది. అలాగే ఒబి డంప్ భవిష్యత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రదేశాన్ని మిగులుస్తుంంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నం ఇప్పటికే డబ్ల్యు సిఎల్ ప్రారభించింది. భారీ ఇసుక ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా తయారైన ఇసుకను తక్కువ ఖర్చుతో చేపట్టే ఇళ్ల నిర్మాణానికి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవిఐ) ఇళ్ల నిర్మాణానికి,ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. రాగల 5 సంవత్సరాలలో 1.3 కోట్ల క్యూబిక్ మీటర్ల మేరకు అందించగల యూనిట్లను వివిధ బొగ్గు , లిగ్నయిట్ కంపెనీలు ఏర్పాటు చేయనున్నాయి. దీనికితోడు ఇంధన సామర్ధ్యానికి సంబంధించిన పలు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. పర్యావరణ హితకరమైన కొత్త మైనింగ్ పరికరాలను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వివిధ బొగ్గు కంపెనీలలో వీటిని ప్రవేశపెడుతున్నారు.ఈ చర్యలన్నీ రాగల ఐదు సంవత్సరాలలో మెరుగైన సుస్థిరాభివృద్ధి సాధనకు బొగ్గు పరిశ్రమ చేపడుతున్నది. కాప్ 26 లో ప్రకటించిన విధంగా బొగ్గు సంస్థలు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఆర్థిక, పర్యావరణ, సామాజిక పరంగా పలు చర్యలు తీసుకుంటున్నాయి.
***
(Release ID: 1776024)
Visitor Counter : 169