కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఈఎస్ఐ డిస్పెన్సరీ మరియు బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రీమతి స్మృతి ఇరానీ


లబ్ధిదారులకు ఈఎస్ఐఈ కోవిడ్-19 రిలీఫ్ స్కీమ్, ఈ-శ్రమ్ కార్డ్ మరియు రాష్ట్ర విపత్తు సహాయ నిధి ఆమోద లేఖల పంపిణీ

Posted On: 27 NOV 2021 5:59PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కొత్తగా నిర్మించిన ఈఎస్ఐ డిస్పెన్సరీ మరియు బ్రాంచ్ కార్యాలయాన్ని   కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిశ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు ప్రారంభించారు. దీని వల్ల రాయ్‌బరేలీ ప్రాంతంలోని 60,000 మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. అదనంగాదాదాపు 15,000 మంది కార్మికులు ఈఎస్ఐఈ  బ్రాంచ్ ఆఫీస్ నుంచి  నగదు ప్రయోజనాలను కూడా పొందుతారు.  కేంద్ర కార్మిక మరియు ఉపాధి మరియు పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలిరాయ్‌బరేలీ మున్సిపాలిటీ చైర్‌పర్సన్  శ్రీమతి. పూర్ణిమ శ్రీవాస్తవఉత్తరప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు శ్రీ దినేష్ ప్రతాప్ సింగ్ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాయ్‌బరేలీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ 1978 నుంచి అద్దె భవనంలో పనిచేస్తోందని అన్నారు. సిపిడబ్యూ నిర్మించిన ఈ సముదాయాన్ని  ప్రజలకు అంకితం చేశారు.ఈ సందర్భంగా  కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన కుటుంబాలను ఆదుకోవడానికి  ఈఎస్ఐఈ ప్రవేశపెట్టిన  ‘కోవిడ్-19 రిలీఫ్ స్కీమ్’ కింద ఇరానీ నెలవారీ పెన్షన్ ఆమోద పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

 

 

  ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీ లోని  ప్రగతిపురం లో 933 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2.27 కోట్ల రూపాయల ఖర్చుతో  ఈఎస్ఐ   డిస్పెన్సరీ మరియు బ్రాంచ్ కార్యాలయాన్ని నిర్మించారు.  డిస్పెన్సరీ లో  వైద్యులుఫార్మసిస్ట్ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు సేవలు అందిస్తారు.  అత్యవసర సేవలుఒపీడీ సేవలు ఫార్మసీఆక్సిజన్ సిలిండర్టెస్టింగ్ మిషన్ మొదలైన సౌకర్యాలను  డిస్పెన్సరీ లో కల్పించారు

సమావేశంలో ప్రసంగించిన శ్రీ రామేశ్వర్ తేలి మాట్లాడుతూ కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రజలకు వైద్య సదుపాయాలు/సేవలు అందించడం ద్వారా ఈఎస్‌ఐ ఆసుపత్రులు దేశానికి సేవలందించాయన్నారు. ' కోవిడ్ -19 రిలీఫ్ స్కీమ్'ని  ఈఎస్ఐఈ ప్రారంభించింది. ఈ పథకంలోకోవిడ్ -19 మహమ్మారి కారణంగా దురదృష్టవశాత్తు మరణించిన సంస్థ సభ్యుడిపై  ఆధారపడిన వారికి సభ్యుని  సగటు జీతంలో 90%అందించడం జరుగుతుంది. 

 'అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజనద్వారా బీమా సౌకర్యం పొందిన అతడు /ఆమె ఉద్యోగం కోల్పోయిన సమయంలో  అతను/ఆమె గత నాలుగు నెలల కాలంలో పొందిన సగటు రోజువారీ సంపాదనలో 50% మొత్తాన్ని సహాయంగా పొందుతారు. జీవితకాలంలో ఒకసారి ప్రాతిపదికగా ఉపాధి లేని కాలానికి   గరిష్టంగా 90 రోజుల భృతి  చెల్లించబడుతుంది. క్లెయిమ్‌ను సమర్పించిన తర్వాత  ఈఎస్ఐఈ   బ్రాంచ్ ఆఫీస్ ద్వారా  బీమా చేయబడిన వ్యక్తుల   బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తం జమ అవుతుంది. 

పథకంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని శ్రీ తేలి తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సేకరించామని ఆయన చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఈ-శ్రమపోర్టల్ ఏర్పాటు అయ్యిందని అన్నారు. దీనిలో అర్హులైన వారందరూ తమ పేర్లను నమోదు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని మంత్రి కోరారు. పర్యటనలో భాగంగా మంత్రి ఈ-శ్రమ శిబిరాన్ని సందర్శించి 'ఈ-శ్రమకార్డులను పంపిణీ చేశారు. 

'ఈ-శ్రమపోర్టల్ లో పేర్లను ఉచితంగా సులువుగా నమోదు చేసుకోవచ్చు. పోర్టల్ లో నమోదు చేసుకున్న వ్యక్తి రెండు లక్షల రూపాయలకు బీమా పొందుతారు. ఇంతవరకు ఈ పోర్టల్ లో 9.5 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 

 ఉత్తరప్రదేశ్‌లో ఈఎస్ఐ     పథకం

 

ఈఎస్ఐ   పథకం రాష్ట్రంలోని 41 జిల్లాల్లో పూర్తిగా ఒక జిల్లాలో పాక్షికంగా  అమలు జరుగుతోంది . రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలనా నియంత్రణ కోసం కాన్పూర్‌లో ఒక ప్రాంతీయ కార్యాలయం, నోయిడాలక్నో మరియు వారణాసిలలో 3 ఉప-ప్రాంతీయ కార్యాలయాలు  పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈఎస్ఐఈ   36 బ్రాంచ్ కార్యాలయాలు మరియు రెండు డిస్పెన్సరీ-కమ్-బ్రాంచ్-ఆఫీసుల ద్వారా లబ్ధిదారులకు నగదు మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. 16 ఆసుపత్రులు (ఇఎస్‌ఐ పథకం కింద 10 మరియు ఇఎస్‌ఐసి కింద 6) మరియు 16 డిస్పెన్సరీలు (94 అల్లోపతి, 11 ఆయుర్వేద మరియు 11 హోమియోపతి డిస్పెన్సరీలతో సహా) తమ లబ్ధిదారులకు వైద్య సేవలను అందిస్తున్నాయి. వీటితో పాటు మెదులు మరియు 61 టై-అప్ ఆస్పత్రులు కూడా   లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నాయి. 

భారతదేశంలో ఈఎస్ఐ   పథకం

 

ఈఎస్ఐఈ    అనేది ఒక ప్రముఖ సామాజిక భద్రతా సంస్థ లబ్ధిదారులకు    వైద్య సంరక్షణ ఉపాధి గాయంఅనారోగ్యంమరణం వంటి అవసరమైన సమయాల్లో నగదు ప్రయోజనాల వంటి సమగ్ర సామాజిక భద్రతా ప్రయోజనాలను ఈఎస్ఐఈ అందిస్తోంది.  ఈ చట్టం పరిధిలో  12.36 లక్షల ఫ్యాక్టరీలు సంస్థలు ఉన్నాయి.  ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3.41 కోట్ల కార్మిక కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.  1952లో ప్రారంభమైన ఈఎస్ఐ   కార్పొరేషన్ ఇప్పటి వరకు 160 హాస్పిటల్స్, 6 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 1502/308 డిస్పెన్సరీలు/ఐ ఎస్ఎం  యూనిట్లు, 559/185 బ్రాంచ్/పే ఆఫీస్‌లు, 49 డిస్పెన్సరీలుమరియు బ్రాంచ్ కార్యాలయాలు స్థాపించింది. 64 ప్రాంతీయ మరియు ఉప ప్రాంతీయ కార్యాలయాలు సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి.

 

***


(Release ID: 1775836)
Read this release in: English , Urdu , Hindi