సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
1940, 1950 దశకాలలోని 8 అరుదైన హిందీ చిత్రాలను జోడించడం ద్వారా సేకరణను మెరుగుపరుచుకున్న - ఎన్.ఎఫ్.ఏ.ఐ.
Posted On:
27 NOV 2021 4:24PM by PIB Hyderabad
హిందీ సినిమా స్వర్ణయుగానికి చెందిన చలనచిత్రాల ప్రధాన కొనుగోలులో భాగంగా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎఫ్.ఏ.ఐ.) మరో 31 అరుదైన చలన చిత్రాలను సేకరించింది. వీటిలో ప్రముఖ హాస్య నటుడు మాస్టర్ భగవాన్ నటించిన 6 చిత్రాలను ప్రముఖంగా పేర్కొనవచ్చు. వీటిలో మాస్టర్ భగవాన్ దర్శకత్వం వహించి, నటించిన, లాలాచ్ (1948) మరియు బచ్కే రెహానా (1949) చిత్రాలతో ప్రారంభించి అనేక అరుదైన చలన చిత్రాలు ఉన్నాయి. ఈ జాబితాలో సింబాద్-ది-సెయిలర్ (1952); వజీర్-ఎ-ఆజం (1961); రాత్-కే-అంధేరే-మే (1969); గుండా (1969) వంటి కళాఖండాలు కూడా ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎన్.ఎఫ్.ఏ.ఐ. డైరెక్టర్, శ్రీ ప్రకాష్ మగ్దూమ్ మాట్లాడుతూ, “ఇది నిజమైన అన్వేషణ అని అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సముపార్జనలో కనీసం ఎనిమిది చిత్రాలు అత్యంత అరుదైనవి ఉన్నాయి. ఇవి. ఇవి ఎన్.ఎఫ్.ఏ.ఐ. సేకరణకు కొత్తవి. వీటిలో లాలాచ్ (1948), బచ్కే రెహానా (1949) అనే రెండు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను మాస్టర్ భవన్ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాల్లోనూ, బాబూరావ్ పెహెల్వాన్, మాస్టర్ భగవాన్, లీలా గుప్తే మొదలైనవారు నటించారు. కాగా, ఈ రెండు చిత్రాలకు సి రామచంద్ర సంగీత దర్శకత్వం వహించారు. అదేవిధంగా ఈ చిత్రాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లో, 16 ఎం.ఎం. ఫార్మాట్ లో ఉన్నాయి. 1940 మరియు 1950 దశకాలకు చెందిన సెల్యులాయిడ్ ఫిల్మ్ లు ఇప్పుడు కనుగొనబడ్డాయి, సంపాదించబడ్డాయి కాబట్టి ఈ సేకరణ, నిజంగా ఒక అరుదైన నిధి వంటిదే. ప్రాథమిక పరిశీలనలో, ఈ 8 చిత్రాలు మంచి స్థితిలో ఉన్నట్లు ధ్రువీకరించడం జరిగింది." అని తెలియజేశారు.
నానుభాయ్ వకీల్ దర్శకత్వంలో నిషి మరియు దల్జీత్ నటించిన మిస్-పంజాబ్-మెయిల్ (1958) అనే సినిమా ఈ సేకరణలో మరొక ఆసక్తికరమైన చిత్రం. యాదృచ్ఛికంగా, ఈ చిత్రం కైఫీ అజ్మీ రచించిన ప్రారంభ చిత్రాల్లో ఒకటి. అరేబియన్-నైట్స్ కథల ఆధారంగా నానాభాయ్ భట్ దర్శకత్వం వహించిన కల్పిత కథా చిత్రం సింద్ బాద్-ది-సెయిలర్ (1952) అనే సినిమాలో నసీమ్, నిరూపా రాయ్, మాస్టర్ భగవాన్, జయంత్, ప్రాణ్‌లతో పాటు ప్రముఖ దక్షిణ భారత చలనచిత్ర నటుడు రంజన్ ప్రధాన పాత్రలో నటించారు. హోమీ వాడియా మరియు నానాభాయ్ భట్ నిర్మించిన ఈ చిత్రంలో బాబూ భాయ్ మిస్త్రీ సృష్టించిన అద్భుతమైన ప్రత్యేకమైన హంగులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
ప్రముఖ హాస్య నటుడు మహమూద్ దర్శకత్వం వహించిన టార్జాన్-ఔర్-హెర్క్యులస్ (1966) అనే సినిమా ఈ సేకరణలో మరో అరుదైన చిత్రం. ఈ చిత్రంలో హబీబ్, హెర్క్యులస్, షకీలా బానో భూపాలీ మొదలైన వారు నటించారు. సుల్తాన్ దర్శకత్వం వహించిన ఒక కల్పిత కథా చిత్రం, ప్రొఫెసర్ అండ్ జాదూగర్ (1967) లో ఇందిర (బిల్లి), ఇంద్రజీత్‌లతో పాటు దళపత్, జిలానీ, మినూ ముంతాజ్, షమ్మీ మొదలైన వారు నటించారు. బాబూ భాయ్ మిస్త్రీ దర్శకత్వంలో షేక్ ముక్తార్, దారా సింగ్, హెర్క్యులస్, షకీలా బానో భోపాలీ మొదలైన వారు నటించిన, డాకు మాన్‌సింగ్ (1966) అనే సినిమా ఈ సేకరణలో మరో అరుదైన బ్లాక్-అండ్-వైట్ చిత్రం. దయ, నిజాయితీ గల వ్యక్తి పరిస్థితుల కారణంగా ఎలా దోపిడీ దొంగ గా మారాడనేదే ఈ చిత్రంలోని కధాంశం.
ప్రముఖ గాయకుడు మన్నా డే కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఆయన ముందుగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లో నాగ్ చంపా (1958) ఒకటి. వినోద్ దేశాయ్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో నిరుపా రాయ్, మన్హర్ దేశాయ్, లలితా పవార్ మొదలైన వారు నటించారు.
ఈ సేకరణలోని ఇతర కళాఖండాలలో - సురయ్య నటించిన దిల్లగి (1949); నళిని జయవంత్ నటించిన జాదూ (1951); కే.ఏ. అబ్బాస్ దర్శకత్వంలో దేవ్ ఆనంద్ మరియు నళిని జయవంత్ నటించిన రాహి (1952); శ్యామా మరియు తలత్ మెహమూద్ నటించిన దిల్-ఇ-నాదన్ (1953); రాజా పరాంజపే మరియు శశికళ నటించిన చాచా చౌదరి (1953); శాంతిలాల్ సోని దర్శకత్వంలో మహిపాల్ మరియు విజయ చౌదరి నటించిన నాగ మోహిని (1963) మొదలైన చిత్రాలు కూడా ఉన్నాయి.
*****
(Release ID: 1775728)
Visitor Counter : 181