ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 మరియుప్రజల కు టీకామందు ను ఇప్పించడానికి సంబంధించిన స్థితి ని సమీక్షించడం కోసం జరిగినఒక విస్తృతమైన ఉన్నత స్థాయి  సమావేశాని కిఅధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి


రకం ‘ఓమైక్రోన్‌’ మరియు దానిలక్షణాలు.. అనేక దేశాల లో దాని ప్రభావం, ఇంకా భారతదేశంలో దీని ప్రభావాన్ని గురించిప్రధాన మంత్రి కి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది

కొత్త రకాన్ని దృష్టి లో పెట్టుకొని మనం అప్రమత్తం గా ఉండాలి: ప్రధాన మంత్రి

అధికకేసు లు ఉన్న ప్రాంతాల పట్ల ముమ్మర

నియంత్రణతో పాటు చురుకైన నిఘా ను కొనసాగించడం అవసరం: ప్రధాన మంత్రి

ప్రజలు అధికజాగ్రత ను కలిగి ఉండవలసినటువంటి అవసరం, మాస్క్ ధరించవలసిన అవసరం, అంతేకాక సామాజిక దూరాన్నిపాటించడం వంటి తగినంత సావధానులై మెలగవలసిన అవసరం ఉంది: ప్రధాన మంత్రి

ముందుకువస్తున్నటువంటి కొత్త సాక్ష్యాలను దృష్టి లో పెట్టుకొని అంతర్జాతీయ ప్రయాణ సంబంధి ఆంక్షల సడలింపు తాలూకు ప్రణాళిక ను అధికారులు సమీక్షించాలన్న ప్రధాన మంత్రి

రెండోమోతాదు పరిధి ని పెంచవలసిన అవసరం ఉంది: ప్రధాన మంత్రి

ఎవరికయితేఒకటో మోతాదు అందిందో వారికి రెండో మోతాదు ను సకాలం లో అందించేటట్టుగా చూడాలంటూరాష్ట్రాల ను అప్రమత్తం చేయాలి: ప్రధాన మంత్రి

Posted On: 27 NOV 2021 2:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉదయం పూట జరిగిన ఒక విస్తృత సమావేశాని కి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం సుమారు గా రెండు గంటల పాటు కొనసాగింది. కోవిడ్‌-19 నేపథ్యం లో సార్వజనిక స్వస్థత కు సంబంధించిన సన్నాహాలు, ప్రజల కు టీకామందు ను ఇప్పించడానికి సంబంధించిన స్థితి అనే అంశాల పై ఈ సమావేశం లో సమీక్ష ను నిర్వహించడమైంది.

 

కోవిడ్‌-19 వ్యాప్తి, కేసుల పై ప్రపంచ స్థితిగతుల ను గురించి ప్రధాన మంత్రి కి అధికారులు వివరించారు. మహమ్మారి పాదం మోపింది మొదలు వివిధ దేశాల లో కోవిడ్‌-19 కేసు లు విపరీతంగా పెరగడం పై ప్రపంచం అనుభవాలను వారు తెలియజేశారు. ఈ నేపథ్యం లో కోవిడ్‌-19 కేసులు, పరీక్షల లో పాజిటివిటీ రేటు కు సంబంధించిన దేశవ్యాప్త స్థితి గురించి కూడా ప్రధాన మంత్రి సమీక్ష ను నిర్వహించారు.

 

దేశం అంతటా ప్రజల కు టీకామందు ను ఇప్పించడంలో ప్రగతి తో పాటు ‘హర్ ఘర్ దస్తక్’ అభియాన్ లో భాగం గా సాగుతున్న కృషి ని ప్రధాన మంత్రి కి అధికారులు వివరించారు. దీనిపై ప్రధాన మంత్రి స్పందిస్తూ- రెండో మోతాదు టీకా విస్తృతం గా పెంచవలసిన అవసరం ఉందని, తొలి మోతాదు ను తీసుకున్న వారు అందరి కి రెండో మోతాదు సకాలం లో అందేలా చూడటం పై రాష్ట్రాల ను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. దేశం లో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న రోగనిరోధకత ప్రతిస్పందన పరీక్షలు, ప్రజారోగ్య స్పందనలో పరిణామాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.

 

వివిధ దేశాల లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌ కొత్తరకం ‘ఓమైక్రోన్’- దాని లక్షణాలు, ప్రభావం గురించి అధికారులు ప్రధానికి విశదీకరించారు. దీంతోపాటు భారతదేశంలో ప‌రిణామాల పైనా సమావేశం చర్చించింది. వైరస్ కొత్త రకం వ్యాప్తి నేపథ్యం లో అప్రమత్తం గా ఉండవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు చేశారు. కొత్త ముప్పు ముంచుకొస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తం కావాలని, మాస్క్‌ ను ధరించడం తో పాటు సామాజిక దూరాన్ని పాటించడం వంటి ముందు జాగ్రత్తలను విస్మరించరాదని ప్రధాన మంత్రి సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికుల రాక, మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి పరీక్షల నిర్వహణ అంశాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ముఖ్యం గా ‘అధిక ముప్పు’ గుర్తింపు గల దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. కొత్త కేసు లు వెలుగు చూస్తున్న నేపథ్యం లో అంతర్జాతీయ ప్రయాణ సంబంధి ఆంక్షల సడలింపు పై ప్రణాళికల ను సమీక్షించాలని అధికారులకు ప్రధాన మంత్రి సూచించారు.

 

దేశం లో వైరస్‌ జన్యుక్రమం రూపకల్పన కృషి తో పాటు దేశీయం గా వ్యాప్తి లో గల రకాల పై పరిశీలన సారాంశాన్ని అధికారులు ప్రధాన మంత్రి కి తెలియజేశారు. నిబంధనల కు తగినట్లు గా అంతర్జాతీయ ప్రయాణికులు, సమాజం నుంచి జన్యుక్రమం నిర్ధారణ కోసం నమూనాల ను సేకరించాలి అని ప్రధాన మంత్రి ఆదేశించారు. వీటిని ‘ఐఎన్ఎస్ఎసిఒజి’ ( ఇండియన్ సార్స్- కోవిడ్- 2 కన్ సార్టియమ్,, INSACOG ) ఆధ్వర్యం లో ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రయోగశాల ల నెట్‌వర్క్ సహా కోవిడ్-19 నిర్వహణ నిమిత్తం గుర్తించిన ముందస్తు హెచ్చరిక ఆనవాళ్ల ద్వారా పరీక్షించాలి అని సూచించారు. జన్యుక్రమం నిర్ధారణ కృషిని ముమ్మరం చేయడమే కాకుండా మరింత విస్తృతపరచవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

 

రాష్ట్ర, జిల్లా స్థాయిల లో సరైన అవగాహన దిశ గా రాష్ట్ర ప్రభుత్వాల తో కలసి పనిచేయాలి అని అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశించారు. అధిక కేసులు నమోదయ్యే ప్రాంతాల లో ముమ్మర నియంత్రణ ను, చురుకైన నిఘా ను కొనసాగించాలి అని ఆయన సూచించారు. ప్రస్తుతం కేసు లు ఎక్కు సంఖ్య లో నమోదు అవుతున్న రాష్ట్రాల కు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించాలి అని కూడా ఆయన ఆదేశించారు. అలాగే గాలి ద్వారా వ్యాపించే వైరస్ లక్షణం దృష్ట్యా ఇళ్లలో సరైన గాలి, వెలుతురు ఉండేవిధంగా అవగాహన కల్పించవలసిన అవసరం కూడా ఉంది అని ప్రధాన మంత్రి చెప్పారు.

 

కొత్త ఔషధ ఉత్పత్తుల విషయంలో తాము విధాన సౌలభ్యాన్ని పాటిస్తున్నామని ప్రధాన మంత్రి కి అధికారులు వివరించారు. దీనిపై ప్రధాన మంత్రి స్పందిస్తూ, వివిధ ఔషధాల ముందస్తు నిలవ లు తగినంత గా ఉండేటట్టు రాష్ట్రాల తో సమన్వయం చేసుకోవలసిలంది గా అధికారుల ను ఆదేశించారు. ఆయా రాష్ట్రాల లో పిల్లల వైద్య సౌకర్యాలు సహా మౌలిక వైద్య వ్యవస్థల పనితీరును అక్కడి ప్రభుత్వాలతో కలసి పరిశీలించాలని అధికారుల ను ప్రధాన మంత్రి కోరారు.

 

ప్రతి రాష్ట్రంలో పిఎస్‌ఎ ఆక్సిజన్‌ ప్లాంటు లు, వెంటిలేటర్ లు సవ్యంగా పనిచేసే విధం గా రాష్ట్ర ప్రభుత్వాల తో సమన్వయాన్ని ఏర్పరచుకోవాలి అని కూడా ప్రధాని సూచించారు.

 

సమావేశానికి హాజరు అయిన వారి లో మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా, నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్, హోం శాఖ కార్యదర్శి శ్రీ ఎ.కె. భల్లా, ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం శాఖ కార్యదర్శి, కార్యదర్శి (ఔషధ నిర్మాణం) శ్రీ రాజేశ్ భూషణ్, కార్యదర్శి (బయో టెక్నాలజీ) డాక్టర్ రాజేశ్ గోఖలే, ఐసిఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్‌ బలరామ్ భార్గవ, కార్యదర్శి (ఆయుష్) శ్రీ వైద్య రాజేశ్ కోటేచా, కార్యదర్శి (పట్టణాభి వృద్ధి) శ్రీ దుర్గా శంకర్ మిశ్రా; జాతీయ స్వాస్థ్య ప్రాధికరణ్ (ఎన్ హెచ్ ఎ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ ఆర్.ఎస్. శర్మ, భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞ‌ానిక సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ రాఘవన్ లు సహా ఇతర వరిష్ఠ అధికారులు ఉన్నారు.

 

 

***

 



(Release ID: 1775727) Visitor Counter : 203