శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లిథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ఫ్యాబ్రికేషన్ దేశీయీకరణ కు మద్దతు ఒప్పందం పై ఎఆర్ సిఐ సంతకం

Posted On: 27 NOV 2021 5:21PM by PIB Hyderabad

టెక్నాలజీని పెంచడం ,వాణిజ్యీకరించే ప్రయత్నంలో లి-అయాన్ బ్యాటరీల కోసం ఫ్యాబ్రికేషన్ ల్యాబ్ ను త్వరలో బెంగళూరులో ఏర్పాటు చేయనున్నారు.

 

ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఎఆర్ సిఐ), అటానమస్ ఆర్ అండ్ డి సెంటర్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్ టి), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ,న్సూర్ పవర్ సొల్యూషన్స్., బెంగళూరు కలసి నవంబర్ 25, 2021న లి-అయాన్ బ్యాటరీ ఫ్యాబ్రికేషన్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, సిబ్బంది శిక్షణ కోసం ఒప్పందంపై సంతకం చేశాయి.

 

‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' లేదా 'సెల్ఫ్ రిలయంట్ ఇండియా మిషన్'కు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధన పదార్థాలు,  వ్యవస్థలపై సాంకేతిక పరిశోధనా కేంద్రం కింద సెంటర్ ఫర్ ఆటోమోటివ్ ఎనర్జీ మెటీరియల్స్, ఎఆర్ సిఐ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లు ,సోలార్ స్ట్రీట్ ల్యాంపుల్లో లి-అయాన్ బ్యాటరీ ప్రక్రియను స్థాపించడంలో అభివృద్ధి చేసిన నైపుణ్యం ,దాని విజయవంతమైన ప్రదర్శన పై  సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఆధార పడివుంది.

 

వాతావరణ మార్పు కార్బన్ జాడ తో ముడిపడి ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి ఎఆర్ సిఐ ,న్సూర్ రిలయబుల్ పవర్ సొల్యూషన్స్ మధ్య భాగస్వామ్యం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఎఆర్ సిఐ పాలక మండలి ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్ అన్నారు. జీవనోపాధి కోసం స్వదేశీ సాంకేతిక అభివృద్ధి అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఉన్నత టిఆర్ఎల్ లకు సాంకేతికపరిజ్ఞానాన్ని తీసుకెళ్లడానికి ఆర్ అండ్ డి ల్యాబ్ లు ,పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సృజనాత్మక పర్యావరణ వ్యవస్థలో వాటాదారుల అనుబంధ వనరులను  సమన్వయ పరచడానికి సమర్థవంతమైన మానవ వనరులు, బహుళ ఫార్మాట్లు, టెక్నాలజీ అప్ స్కేలింగ్ ,వాణిజ్యీకరణకు ప్రభుత్వ మద్దతు అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.దేశంలో అటువంటి పర్యావరణ వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందన

డానికి ఎఆర్ సిఐ-న్సురే ఒప్పందం ఒక రోల్ మోడల్ గా ఉంటుందని ఆయన అన్నారు.

 

ఆర్ సిఐ వంటి ఆర్ డి ల్యాబ్ లు లిథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీని దాటి చూడాలని,  అలాగే ఇతర ప్రత్యామ్నాయ ఇంధన పదార్థాలతో కూడిన సాంకేతికపరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఈ అర్ సి ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ జి. సుందరరాజన్ నొక్కి చెప్పారు.

 

‘’ఎలక్ట్రోడ్ మెటీరియల్స్ ఖర్చు -లిబ్ ల మొత్తం ఖర్చుకు గణనీయంగా దోహదపడుతుంది, భారతదేశం ఈ పదార్థాల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతుంది.  దేశీయంగా ఒక సాంకేతికపరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ,లిబ్ టెక్నాలజీలో పారిశ్రామిక సంస్థలకు మద్దతు ఇవ్వడం అవసరం" అని ఎఆర్ సిఐ డైరెక్టర్ డాక్టర్ టాటా నరసింగరావు అభిప్రాయపడ్డారు.

 

ప్రత్యామ్నాయ ఇంధన పదార్థాలు మరియు వ్యవస్థలపై సాంకేతిక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో డిఎస్ టి ,ఎఆర్ సిఐ కృషి గురించి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల కు  శక్తి నిల్వ పరిష్కారాల కోసం లి-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ గురించి ఎఆర్ సిఐ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. గోపాలన్ వివరించారు ఈ సాంకేతిక పరిజ్ఞానం "ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్" దిశగా ఎఆర్ సిఐలో ఒక ప్రధాన మైలురాయి అని అన్నారు

 

సెంటర్ ఫర్ ఆటోమోటివ్ ఎనర్జీ మెటీరియల్స్ హెడ్ డాక్టర్ ఆర్. ప్రకాష్, లిథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ,ఎఆర్ సిఐ చెన్నై సెంటర్ లో సాధించిన పనిని వివరించారు.

 

న్సూర్ రిలయబుల్ పవర్ సొల్యూషన్స్ సిటిఒ డాక్టర్ జాన్ ఆల్బర్ట్, లి-అయాన్ సెల్ తయారీ టెక్నాలజీలో అంతర్జాతీయ , భారతీయ దృష్టాంతాల మధ్య విస్తృత అంతరాన్ని పూడ్చడానికి పరిశ్రమ-విద్యా సంబంధాల అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంలో, ఎఆర్సిఐ-న్సూర్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

 

డిఎస్ టి కి చెందిన డాక్టర్ ఎస్.కె. వర్శ్నే, డాక్టర్ ఆర్.కె. జోషి, ఎఆర్ సిఐ  టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ హెడ్ డాక్టర్ సంజయ్ భరద్వాజ్, డైరెక్టర్లు శ్రీ చంద్రకాంత్, శ్రీ సూర్యకాంత్, బిజినెస్ అడ్వైజర్ న్సూర్  విశ్వసనీయ పవర్ సొల్యూషన్స్ శ్రీ రామచంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1775725) Visitor Counter : 182


Read this release in: English , Hindi , Bengali , Tamil