వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వైట్ గూడ్స్ పరిశ్రమకు డిపిఐఐటి ద్వారా పిఎమ్ పి పరిగణన- డిపిఐఐటి-ఫిక్కీ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశం లో డిపిఐఐటి సెక్రటరీ శ్రీ అనురాగ్ జైన్
ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు పొందడంలో పిఎల్ ఐ పెట్టుబడిదారులకు డిపిఐఐటి మద్దతు
దేశవ్యాప్తంగా 50 కి పైగా ప్రాంతాల్లో కాంపోనెంట్ ప్లాంట్ లు.
వైట్ గూడ్స్ పరిశ్రమ పిఎల్ఐకి విశేష స్పందన
Posted On:
26 NOV 2021 12:19PM by PIB Hyderabad
వైట్ గూడ్స్ పిఎల్ఐ పై ఉన్నత స్థాయి డిపిఐఐటి-ఫిక్కీ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశం లో డిపిఐఐటి కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ మాట్లాడుతూ, ఎ సి పరిశ్రమ దిగుమతులను నియంత్రించడానికి, స్థానికంగా విలువ ,ఉపాధిని పెంచడానికి దశలవారీ తయారీ (పిఎంపి) ప్రణాళిక పరిశీలనకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ఎసి పరిశ్రమ కోసం పిఎంపితో ముందుకు రావాలని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కొంతమంది సిఇఒలు చేసిన సూచనలకు ఆయన స్పందించారు.
వైట్ గూడ్స్ పిఎల్ఐ కింద వచ్చే పెట్టుబడులన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి వేగంగా అనుమతులు పొందేలా డిపిఐఐటి చూస్తుందని, తద్వారా పిఎల్ఐ కింద నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించవచ్చునని శ్రీజైన్ పేర్కొన్నారు.
సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కోసం ఉద్దేశించిన నేషనల్ సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ ను వేగవంతం చేసే ప్రక్రియలో ఉన్నామని, ఇక్కడ అన్ని అప్లికేషన్ లను ఆన్ లైన్ లో దాఖలు చేసి ట్రాక్ చేయవచ్చని శ్రీజైన్ తెలిపారు. ప్రెస్ నోట్ 3 కింద ప్రభుత్వం ఎఫ్ డిఐ దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తోందని కూడా ఆయన చెప్పారు.
భారతదేశం నాయకత్వం వహించగల రంగాలకు ప్రయోజనం చేకూర్చడానికి , అలాగే కొత్తగా వస్తున్న రంగాలకు ప్రయోజనం చేకూర్చడానికి ,వాటిని ప్రపంచ పోటీకి సిద్ధం చేయడానికి పిఎల్ఐ పథకాన్ని రూపొందించినట్లు శ్రీ జైన్ తెలిపారు.
డిపిఐఐటి అదనపు కార్యదర్శి శ్రీ అనిల్ అగ్రవాల్ మాట్లాడుతూ, ఎఫ్ ఐ సి సి ఐ ఎలక్ట్రానిక్స్ అండ్ వైట్ గూడ్స్ కమిటీ కృషిని ప్రశంసించారు. వైట్ గూడ్స్ కోసం పిఎల్ ఐ కి పరిశ్రమ స్పందన విశేషంగా ఉందని అన్నారు. ఈ పథకాన్ని రూపొందించినప్పుడు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని, అందువల్ల ఈ పథకం అమలుకు ఎలాంటి అడ్డంకులు రాలేదని ఆయన అన్నారు.
వైట్ గూడ్స్ కోసం పిఎల్ఐ ప్రస్థానాన్ని శ్రీ అగ్రవాల్ వివరిస్తూ, దాదాపు ఒక సంవత్సరంలో, విలువ గొలుసు (వాల్యూ చైన్) అంతటా పరిశ్రమ ఫీడ్ బ్యాక్ ,ఏకాభిప్రాయం ఆధారంగా ఈ పథకాన్ని రూపొందించి అమలు చేసేలా డిపిఐఐటి నిర్ధారించిందని చెప్పారు.
డిపిఐఐటి-ఫిక్కీ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ లో వైట్ గూడ్స్ పరిశ్రమకు చెందిన నూట యాభై మంది సిఇఒలు/సిఎక్స్ వోలు పిఎల్ఐలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. కాంపోనెంట్ వాల్యూ ఛైయిన్ లో ని ఈ పెట్టుబడిదారుల్లో చాలా మందివి చిన్న , మధ్యతరహా కొత్త వెంచర్లే. వారు ఇప్పుడు ఓఈఎమ్ లకు సరఫరా చేస్తారని, గ్లోబల్ వాల్యూ ఛైయిన్ లతో ఇంటిగ్రేట్ అవుతార ని శ్రీఅనిల్ అగ్రవాల్ పేర్కొన్నాడు.
భారతదేశం అంతటా 50 కి పైగా ప్రాంతాల్లో తయారీ యూనిట్లు వస్తున్నందున ఈ పథకం ప్రభావం ఎంతగానో ఉందని , ఎసి ,ఎల్ఈడి కాంపోనెంట్ ఛైయిన్ లో వైట్ గూడ్స్ పిఎల్ఐ పథకం నుండి ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు. ఈ యూనిట్లు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, హర్యానా రాజస్థాన్ ,పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయని శ్రీ అగ్రవాల్ తెలిపారు (దిగువ పట్టికచూడండి).
-------------------------------------------------------------
రాష్ట్రం ప్లాంట్ ల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ 5
గుజరాత్ 10
గోవా 1
హర్యానా 4
హిమాచల్ ప్రదేశ్. 1
కర్ణాటక. 2
మహారాష్ట్ర. 5
తమిళనాడు. 4
రాజస్థాన్. 4
ఉత్తరప్రదేశ్. 6
తెలంగాణ. 1
ఉత్తరాఖండ్. 6
పశ్చిమ బెంగాల్. 1
మొత్తం 50
------------------------------------------------------------------
ఫిక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ వైట్ గూడ్స్ తయారీ కమిటీ చైర్మన్ శ్రీ మనీష్ శర్మ మాట్లాడుతూ, అల్యూమినియం ,రాగి పరిశ్రమతో సహా వివిధ రకాల ఎ సి లు ఎల్ ఇ డి ల కోసం భారతీయ తయారీదారులు, ఎస్ ఎంఈలు ఎంఎన్ సిలలోని 40 కంటే ఎక్కువ సంస్థల నుండి 4500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో పరిశ్రమగా తమ విజయాలు అభినందనీయమని అన్నారు.
ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం , పరిశ్రమ కలిసి రావడం ప్రభుత్వం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ దార్శనికత లో వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వం కారణంగా సాధ్య మైన సహకారానికి గానూ ఆయా రంగాల అసోసియేషన్ లను ఆయన అభినందించారు. ఎగుమతి కోసం పోటీతత్వాన్ని పెంపొందించడానికి అనుమతించే స్కేల్‌తో వెనుకబడిన ఏకీకరణ యొక్క కొత్త శకానికి నాంది పలికే సానుకూల మనస్తత్వంతో కూడిన నిబద్ధతను పి ఎల్ ఐ తనతో తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు.ఎగుమతి కోసం పోటీతత్వాన్ని నిర్మించడానికి అనుమతించే కొలమానంతో సానుకూల మనస్తత్వంతో కూడిన నిబద్ధతను పి ఎల్ ఐ తెస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఫిక్కీ లోని కో-చైర్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కమిటీ శ్రీ జస్బీర్ సింగ్ మాట్లాడుతూ, "మా రంగంలో పిఎల్ఐ కోసం ప్రభుత్వ చొరవను ప్రశంసిస్తున్నాం. ఇది రాబోయే 4-5 సంవత్సరాలలో ప్రస్తుత స్థాయిల నుండి 25% నుండి 75% వరకు స్థానిక విలువ జోడింపును తీసుకునే మా రంగానికి కాంపోనెంట్ ల్యాండ్ స్కేప్ పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఇది మా పరిశ్రమలో కనిపించకుండా పోయిన అనుసంధానం. ఇంత తక్కువ వ్యవధిలో బాగా ఆలోచించిన వినూత్న పథకాన్ని రూపొందించినందుకు డిపిఐఐటికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం."అని అన్నారు.
ఫిక్కీ డైరెక్టర్ జనరల్ శ్రీ అరుణ్ చావ్లా మాట్లాడుతూ, గత సంవత్సరంలో చూపించిన స్థితిస్థాపకత , చర్యలకు గానూ, ప్రభుత్వాన్ని పరిశ్రమను ప్రశంసించారు.
పరిశ్రమకు చెందిన రెండు డజన్లకు పైగా సిఇఒలతో వైట్ గూడ్స్ పిఎల్ఐ దరఖాస్తుదారులందరూ పాల్గొన్న ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ ను రామా, సిఇఎఎంఎ,, ఎల్ సినా ,ఎల్కోమా మొదలైన సెక్టోరల్ అసోసియేషన్ ల సహకారంతో డిపిఐఐటి ,ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించాయి.
పిఎల్ఐ పెట్టుబడిదారులపై ఇంటరాక్టివ్ సెషన్ కు రామా, సి ఇ ఎ ఎం ఎ,, ఎల్కోమా ఎల్సినా -సెక్టోరల్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు కూడా హాజరయ్యారు-
వైట్ గూడ్స్ పి ఎల్ ఐ గురించి.
‘ఆత్మనిర్భర్ భారత్ కింద తయారీ రంగాన్ని కేంద్ర బిందువు దశలోకి తీసుకురావాలని, భారతదేశాన్ని వృద్ధి పథం లో నడిపించడం లోనూ, ఉద్యోగాలను సృష్టించడంలోనూ దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలనే ప్రధాన మంత్రి పిలుపు మేరకు భారత ప్రభుత్వం 13 కీలక రంగాలకు ఉత్పత్తి తో ముడి పెట్టిన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకాన్ని రూ. 1,97,291 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) అన్ని పిఎల్ ఐ పథకాల అమలును సమన్వయపరుస్తోంది. 6,238 కోట్ల రూపాయల తో వైట్ గూడ్స్ - ఎయిర్ కండిషనర్స్ ,ఎల్ ఈడి లైట్ల రంగం కోసం పిఎల్ఐ పథకానికి డిపిఐఐటి కూడా నోడల్ విభాగంగా ఉంది.
ఎసిలు ,ఎల్ ఈడి లైట్ల యొక్క విడి భాగాలు సబ్- అసెంబ్లీల తయారీ కోసం వైట్ గూడ్స్ పిఎల్ఐ ఐ పథకం డిపిఐఐటి ప్రతిపాదనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ అధ్యక్షతన 7.04.2021 న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని ఏడు సంవత్సరాల కాలంలో, ఆర్థిక సంవత్సరం 2021-22 నుండి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 6,238 కోట్ల వ్యయంతో అమలు చేయాల్సి ఉంది .ఈ పథకాన్ని డిపిఐఐటి 16-04-2021 న నోటిఫై చేసింది.. పథకం మార్గదర్శకాలను 04.06.2021 న ప్రచురించారు. 16.08.2021 న పధకం మార్గదర్శకాలకు కొన్ని మార్పులు జారీ చేశారు. దరఖాస్తుదారులకు మార్చి 2022వరకు లేదా మార్చి 2023వరకు స్వీకరణ కాలాన్ని ఎంచుకునే వెసులుబాటు ఇచ్చారు.
ఈ పథకం కోసం దరఖాస్తులను 15.06.2021 నుండి 15.09.2021 వరకు ఆహ్వానించారు. మొత్తం 52 కంపెనీలు పిఎల్ఐ పథకం కింద రూ.5,858 కోట్ల నిబద్ధతా పెట్టుబడితో తమ దరఖాస్తును దాఖలు చేశాయి. .
అన్ని దరఖాస్తులను మదింపు చేసిన తరువాత, రూ.4,614 కోట్ల నిబద్ధత కలిగిన 42 మంది దరఖాస్తుదారులను పిఎల్ ఐ పథకం కింద లబ్ధిదారులుగా తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఎంపిక అయిన దరఖాస్తుదారుల్లో రూ. 3,898 కోట్ల నిబద్ధతకలిగిన పెట్టుబడులతో ఎయిర్ కండిషనర్ తయారీకి 26 ,రూ. 716 కోట్ల నిబద్ధతకలిగిన పెట్టుబడులతో ఎల్ ఈడి లైట్ల తయారీకి 16 ఉన్నాయి.
భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుండి ఎఫ్ డిఐని ప్రతిపాదించిన ఆరుగురు దరఖాస్తుదారులకు పిఎల్ఐ పథకం కింద పరిశీలనామోదం కోసం 17.4.20 నాటి ప్రెస్ నోట్ 3 (2020) పరంగా ఎఫ్ డిఐకి ఆమోదం సమర్పించాలని సూచించారు.
నలుగురి దరఖాస్తులను పరిశీలన ,సిఫార్సుల కోసం నిపుణుల కమిటీకి (సిఒఇ) నివేదించారు
****
(Release ID: 1775474)
Visitor Counter : 133