ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం - నవ సేవ సందర్శన ; భారతీయ కస్టమ్స్ కార్యకలాపాల సమీక్ష


జవహర్లాల్ నెహ్రు నౌకాశ్రయం "సెంట్రలైజ్డ్ పార్కింగ్ ప్లాజా" లో "కస్టమ్స్ ఎగ్జామినేషన్ ఫెసిలిటీ" ఏర్పాటుకై మంత్రి భూమి పూజ.

రోజువారీ అపరిష్కృత కేసులు లేకుండా సరుకు వేగంగా విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని కస్టమ్స్‌ అధికారులకు మార్గ నిర్దేశాల జారీ

సాంకేతికత మద్దతు వ్యాపార పద్ధతుల సంస్కరణలతో పని భారాన్ని తగ్గించడం లక్ష్యం

Posted On: 25 NOV 2021 5:16PM by PIB Hyderabad

ముంబై తీరప్రాంతమైన  మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని నవ శేవా కేంద్ర లో   ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్.   ఈరోజు కస్టమ్స్ కార్యకలాపాలపై ఒక రోజు చేపట్టిన  సుదీర్ఘ సమీక్ష. 
 సులభతరం చేసే  కస్టమ్స్ పరిష్కార  ప్రక్రియ అమలును ఆర్థిక మంత్రి సమీక్షించారు.   ఇటీవలి కాలంలో,పరోక్షపన్నుల కస్టమ్స్   బోర్డు తన పరిధిలోని దిగుమతులపై పత్రాలను ఆన్‌లైన్‌లో ముందస్తుగా దాఖలు చేయడం, ఇ-సంచిత్‌ పై  అనుబంధ పత్రాల  సమర్పణ, ఆన్‌లైన్ కస్టమ్స్ డ్యూటీ చెల్లింపుతో పాటు వస్తువుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, కస్టమ్స్ డిజిటలైజేషన్, అనుమతి పత్రాల దిగుమతులపై ఆటోమేటెడ్ క్లియరెన్స్ వంటి ముఖ్యమైన అంశాలు తప్పనిసరి  చేసింది. .

ఈ సంస్కరణలను పూర్తి చేయడానికి, బోర్డు  లాజిస్టిక్స్ చైన్‌లో   ఎక్స్-రే స్కానర్‌లు, కంటైనర్‌ల ట్రాకింగ్  ట్రేసింగ్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ  ట్యాగ్‌లను ఉపయోగించడం వంటి మెరుగైన చర్యలు చురుకుగా అమలుపరచింది .  కస్టమ్స్ మండలి   చేపట్టిన ఎలెక్ట్రానిక్  సంస్కరణలు/కార్యక్రమాలు సరళ వ్యాపార వైఖరికి,   సమస్యలను    తగ్గించడంతో పాటు  మొత్తం సరుకు  విడుదల సమయాన్ని తగ్గించడానికి గణనీయంగా దోహదపడతాయి.

ఆర్థిక మంత్రి, సులభతర వాణిజ్య నిర్వహణకై  కస్టమ్స్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించిన తర్వాత, ఏరోజుకారోజు కార్య పాలకై నిర్దేశించిన  ‘జీరో డైలీ అసెస్‌మెంట్ పెండెన్సీ’ సాధించడానికి   విధుల సమన్వయంతో సరుకులను (కార్గో) వేగంగా విడుదల చేయాలని కోరారు. ఆమె  RoDTEP (ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు,పన్నుల తగ్గింపు ) , RoSCTL (రాష్ట్ర & కేంద్ర పన్నులు మరియు లెవీ తగ్గింపు రేట్లు ), తిరిగి చెల్లింపులు /డ్రాబ్యాక్‌లను సకాలంలో పూర్తి చేయడం . వంటి ఎగుమతి ప్రోత్సాహక పథకాలు,   ప్రక్రియ లపై దృష్టి సారించారు :

 అపాయకర వస్తువుల ఏరివేత మరింత  వేగంగా  చేయాలని నిర్మలా  సీతారామన్ అధికారులను కోరారు. న్యాయ ప్రక్రియ ఏదైనా తప్పనిసరి అయితే , దిగుమతి చేసుకున్న మూడు నెలల్లో పూర్తయ్యే విధంగా నిర్వహించాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తగిన ప్రచారం కల్పించాలని ఆమె అన్నారు. నవ సేవ నౌకాశ్రయంలో  మంత్రి ఓడ, కార్గో   నిల్వ సంచయాన్ని   మరియు రవాణా కార్యకలాపాలలో మౌలిక సదుపాయాల సర్వేను కూడా ఆమె  చేపట్టారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన రెవెన్యూ, భద్రత, వాటి సరళీకరణ విధానాన్ని   ఆమె తనిఖీ చేశారు


నవ సేవా నౌకాశ్రయంలో లో దాదాపు 50% ఎగుమతి TEUలను (ఇరవై అడుగుల సమానమైన పెట్టెల  పరిమాణం ) అందించే కర్మాగారాన్ని  ఇ-సీల్డ్ కంటైనర్‌ల కోసం పోర్ట్‌కు సమీపంలో సెంట్రలైజ్డ్ పార్కింగ్ ప్లాజాలో "సింగిల్ యూనిఫైడ్ ఆన్-వీల్ ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంటేషన్ సెంటర్"  ను మంత్రి సందర్శించారు .  ఒక సంవత్సరం క్రితం ప్రారంభించబడిన సెంట్రలైజ్డ్ పార్కింగ్ ప్లాజా, నౌకాశ్రయానికి వెలుపల  అనేక ప్రదేశాలు   డాక్యుమెంట్ ప్రాసెసింగ్  ఇతర   సేవలను ఏకీకృతం చేస్తుంది.

వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయడానికి, మంత్రివర్యులు  సీతారామన్    సెంట్రలైజ్డ్ పార్కింగ్ ప్లాజాలోనే ఆన్-వీల్ ఫ్యాక్టరీ సీల్డ్ ఎగుమతి కంటైనర్‌ల కోసం ఏర్పాటు చేసిన  కస్టమ్స్ ఎగ్జామినేషన్ ఫెసిలిటీని  ప్రారంభించారు.  ప్రమాద సందర్భాలలో   కంటైనర్‌లను ప్రత్యేక ప్రదేశానికి పంపాల్సిన అవసరాన్ని ఈ సౌకర్యం తొలగిస్తుంది. ఎగుమతిదారులకు ఖర్చు, సమయం రెండూ ఆదా అవుతాయి. ఈ సదుపాయానికి  భూమి పూజను ఆర్థిక మంత్రి ఈరోజు నిర్వహించారు.

నవసేవా నౌకాశ్రయం  వద్ద 60% దిగుమతి TEUలకు అవకాశం కల్పించే   (DPD)  లాజిస్టిక్స్ కార్యక్రమం గురించి కూడా మంత్రి తెలుసుకున్నారు .  ఇది  పోర్ట్‌లో కస్టమ్స్ క్లియర్ చేసిన సరుకును  డెలివరీ చేయడానికి తద్వారా రవాణా మరియు ఇతర ఖర్చులు ఆదా చేయడానికి ఇది  ప్రత్యామ్నాయ పద్ధతి.
  అధికారులు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) నుండి  లైసెన్స్ పొందిన ఆపరేటర్లు శిక్షణ పొందారు,  ఈ సంవత్సరం ప్రారంభంలో మూడు కొత్త మొబైల్ కంటైనర్ స్కానర్‌లను పోర్టులో ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రికి తెలిపారు.. దీనర్థం ఇకపై ఎక్కువ దూరాలకు ట్రైలర్‌లపై కంటైనర్‌లను తరలించాల్సిన అవసరం లేదు.     ఇ-లింకింగ్ కాగితం ఆధారిత స్కాన్  నివేదిక చూపితే పని సులభతరం అవుతుంది.

 నిర్మలా సీతారామన్ కస్టమ్స్  ఫెసిలిటేషన్ సెంటర్‌ద్వారా దిగుమతి కార్గోలను పనివేళల నిమిత్తం లేకుండా  ఉచితంగా  ప్రాసెసింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిత్య వినియోగానికి తీసుకువచ్చినందుకు మెచ్చుకున్నారు, మిగతా  స్థానాల్లోనూ కొనసాగించాలని  కోరారు.


పన్ను చెల్లింపుదారులు మరియు పౌరులను, ముఖ్యంగా యువతను నిరంతరం కలవాలని ఆర్థిక మంత్రి అధికారులకు ఉద్బోధించారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను  సమర్థవంతంగా పరిష్కరించడంలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని మరియు కస్టమ్స్ విధానాలలో మార్పుల గురించి స్థిరమైన అవగాహన కల్పించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.  కస్టమ్స్   వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేయడానికి  సామర్థ్యాన్ని పెంచడంలో  సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో సూచనలు  చేయాలని  ఆమె అధికారులను కోరారు.

.సీతారామన్ 2022 జనవరి 25న అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం సందర్భంగా కస్టమ్స్ మండలి  ద్వారా దేశవ్యాప్తంగా దిగుమతి దారులు, ఎగుమతిదారులు, కస్టమ్ మధ్యవర్తులు  పరస్పర చర్చ జరపడానికి  ఆదేశించారు.    రెండు లక్ష్యాలు ; ఒకటి వ్యాపారం చేయడం సౌలభ్యం కోసం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ చేపడుతున్న వివిధ మార్గాలనుఅమలుపరచే  సంస్కరణల గురించి వాటాదారులకు అవగాహన కల్పించడం. ; రెండు వాటాదారుల  నుండి   ఫీడ్‌బ్యాక్‌ను సేకరించేందుకు, వాటిని పరిష్కరించేందుకు త్వరిత పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించమన్నారు.
భారతదేశపు అతిపెద్ద కంటైనర్ పోర్ట్ (JNPT) కలిగి ఉన్న నవ సేవా ,  కస్టమ్స్ డ్యూటీ ఆదాయంలో దాదాపు 20%ని  దేశానికి అందిస్తుంది. ఇక్కడ  సరుకులో 85%  పెట్టెలద్వారా (కంటెయినరైజ్) రవాణా  చేయబడుతుంది . నౌకాశ్రయం  సామర్ధ్యం మేరకు  సంవత్సరానికి 7 మిలియన్ TEU లో (ఇరవై అడుగుల సమానమైన పరిమాణం గల  కంటైనర్లు) నిర్వహించగలదు.
ఆర్థిక మంత్రితో   రెవెన్యూ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్, సిబిఐసి ఛైర్మన్ శ్రీ ఎం అజిత్ కుమార్ నవసేవా లో ఒక రోజు   పర్యటనలో పాల్గొన్నారు . కస్టమ్స్ చీఫ్ కమీషనర్ శ్రీ ఎమ్ కె సింగ్, న్హవా షెవా, జెఎన్‌పిటి చైర్మన్ శ్రీ సంజయ్ సేథి వీరితోపాటు ఉన్నారు.

ఛాయాచిత్రాలు
 
నవసేవా వద్ద  ఆర్థిక మంత్రికి సంప్రదాయ స్వాగతం
 
 
JNPT ల్యాండింగ్ జెట్టీలో ఆర్థిక మంత్రికి CISF వందన సమర్పణ
 
 
నవా సేవా  వద్ద కస్టమ్స్ గౌరవ వందనం 

***


(Release ID: 1775473) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Marathi , Hindi