పర్యటక మంత్రిత్వ శాఖ
కర్బన తటస్త దేశంగా 2070 నాటికి అవతరించడానికి ఇటీవల సిఒపి-26 శిఖరాగ్రత సమావేశంలో ప్రధానమంత్రి చేసిన వాగ్ధానానికి మనందరం కట్టుబడి ఉండాలన్న నితిన్ గడ్కరీ
Posted On:
22 NOV 2021 8:31PM by PIB Hyderabad
నికర సున్నా ఉద్గారాలు లేదా కర్బన తటస్త దేశంగా 2070 నాటికి అవతరించడానికి ఇటీవల సిఒపి-26 శిఖరాగ్రత సమావేశంలో ప్రధానమంత్రి చేసిన వాగ్ధానానికి మనందరం కట్టుబడి ఉండాలని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్@ 75, సాధికార భారత్ః రేపటి కోసం నేడు అనన ఇతివృత్తంపై జరిగిన ఐసిసి &ఎజిఎం వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతను, ఆవిష్కరణలను, డిజిటలైజేషన్‌ను ఉపయోగించడం అన్నది దేశంలో కలుపుకుపోయే, స్థిరమైన అభివృద్ధికి దారి తీస్తుందని ఆయన చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రయాణంలో, మనం ఇప్పుడు ఒక మలుపులో ఉన్నామని, మన ప్రభుత్వం రేపటి నిర్మాణం కోసం నిర్ధిష్టమైన చర్చలు తీసుకుంటోందని మంత్రి అన్నారు. ఇది మరింత చైతన్యవంతమైన, ఆత్మనిర్భర, మన నేటికంటే పర్యావరణ స్థితిస్థాపక రేపటి కోసమని ఆయన వివరించారు.
హరిత హైవే మిషన్‌లో భాగంగా, ప్రభుత్వం జాతీయ రహదారులపై చెట్లు నాటడం, తిరిగి నాటడాన్ని ప్రభ/త్వం కొనసాగిస్తోందన్నారు. ఇందులో స్థానిక సముదాయాలు, రైతులు, ఎన్జీవోలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని భారీ ఎత్తున్న ఆశిస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడుల లాభాలను ఉపయోగించేందుకు, ప్రైవేటు రంగం లాజిస్టక్స్ పార్కులను, స్మార్ట్ సిటీలను, పారిశ్రామిక పార్కులను రహదారుల వెంట నిర్మించేందుకు పెట్టుబడులు పెట్టవచ్చన్నారు.
భారత్‌మాలా ఫేజ్ 1& 2 కింద 65,000కిమీల జాతీయ రహదారులను నిర్మించడం జరుగుతోందని గడ్కరీ చెప్పారు. భారత్‌మాలా 1 కింద మొత్తం రూ. 10 లక్షల కోట్ల మూలధన వ్యయంతో దాదాపు 35,000కిమీల హైవేలను అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక అన్నారు. ఇప్పటికే 20,000 కిమీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రెండు లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను 2025 నాటికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తోందని మంత్రి చెప్పారు.
ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు, త్రి చక్రవాహనాలు, కార్లకు భారత్ అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌గా అవతరిస్తోందని, తక్కుప ధరలో దేశీయ బ్యాటీరీ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి జరుగుతోందని గడ్కరీ తెలిపారు. సంప్రదాయ ఆటో వ్యాపారంలో ఉన్నవారికన్నా ఎలక్ట్రానిక్ వాహనాల పరిశ్రమలోకి ప్రవేశించిన స్టార్టప్‌లు, నూతన పోటీదారులు బాగా రాణిస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రైవేటు రంగం నుంచి ఎక్కువ భాగస్వామ్యం, పెరిగిన ప్రభుత్వ వ్యయంతో దేశ సరఫరా గొలుసులో పెట్టుబడిదారులకు అవకాశాలు పెరుగుతాయని మంత్రి వివరించారు.
***
(Release ID: 1774127)
Visitor Counter : 189