వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వారణాసిలో బలవర్ధక బియ్యం వినియోగంపై మహిళలకు అవగాహనా సదస్సు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం


రాష్ట్ర డబ్ల్యుసిడి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించిన ఆహారం,ప్రజా పంపిణీ శాఖ

Posted On: 19 NOV 2021 5:10PM by PIB Hyderabad

ఆజాది కా అమృత్  మహోత్సవ్ వేడుకల్లో  భాగంగా వారణాసిలో కేంద్ర ఆహారం,ప్రజా పంపిణీ  శాఖ బలవర్ధక బియ్యం వినియోగంపై మహిళలకు  ఒక రోజు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు రాణీ లక్ష్మీబాయి జన్మస్థలమైన వారణాసిలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలుఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలో భాగమైన ఆహారం ప్రజా పంపిణీ శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 

జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 నిబంధనల కింద అమలు చేస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవల కింద అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సదస్సులో లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం కింద ఆరు నెలల నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణులు,పిల్లలకు పాలు ఇస్తున్న తల్లులకు పోషకాహారంపై అవగాహన  కల్పించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న బలవర్ధక బియ్యం పోషక విలువలను వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వారణాసిలోని విహెచ్ యూ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు తీసుకోవలసిన పోషక ఆహారం పై  ప్రదర్శన నిర్వహించారు. 

ఉత్తర ప్రదేశ్  ఐసిడిఎస్   డిప్యూటీ డైరెక్టర్, యూనిసెఫ్ జోనల్ అధికారి పిల్లలు, మహిళలకు పోషక ఆహార అంశంపై అవగాహన కల్పించారు. పిల్లలు, మహిళలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. బలవర్ధక బియ్యం ప్రాధాన్యతను ఆయన వివరించారు. 

కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి అనుభవాలు, సవాళ్ల ను తెలుసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమం అనంతరం కేంద్రం నుంచి వచ్చిన ఒక బృందం ఒక చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసి పనితీరును సమీక్షించి లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న  ఆహార పదార్థాల నాణ్యత పరిశీలించింది. 

డిఎఫ్ పిడి  సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీమతి మమతా శంకర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఎన్ఎఫ్ఎస్ఏ అధికారులు శ్రీ కే.కే.గితే, శ్రీమతి మోనికా సింగ్ శ్రీ అభయ్ శ్రీవాస్తవ,, శ్రీ అనిల్ కుమార్  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

***


(Release ID: 1773363) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Hindi