వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పప్పుధాన్యాల ధరల స్థిరకరణ


కేంద్రం సానుకూల చర్యలతో పప్పుధాన్యాల రిటైల్ ధరల్లో స్థిరత్వం

పప్పుధాన్యాల నిల్వ ,కృత్రిమ కొరత కారణంగా ధరలను నియంత్రించడానికి స్టాక్ పరిమితిని విధించిన కేంద్రం

Posted On: 18 NOV 2021 6:32PM by PIB Hyderabad

పప్పుధాన్యాల రిటైల్ ధరలు ఈ ఏడాది జూన్ నుంచి గత ఐదు నెలల్లో గణనీయంగా స్థిరపడ్డాయి. ఇప్పటి వరకు, శనగ పప్పు, కందిపప్పు, మినపప్పు . పెసర పప్పు ధరలు గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి లేదా స్థిరంగా ఉన్నాయి.

 

పప్పుధాన్యాల సిపిఐ ద్రవ్యోల్బణం కూడా గత ఐదు నెలల్లో స్థిరమైన తగ్గుదలను నమోదు చేసింది. జూన్, 2021 లో 10.01% నుండి అక్టోబర్, 2021 లో 5.42%కి చేరుకుంది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణ రేటు అక్టోబర్, 2020 లో 18.34% వరకు ఉంది. అదేవిధంగా పప్పుధాన్యాల డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం జూన్, 2021లో 11.56% నుండి అక్టోబర్, 2021లో 5.36%కి తగ్గింది.

 

సజావుగా , అంతరాయం లేని దిగుమతులను ధృవీకరించడం కోసం కందిపప్పు, మినపప్పు , పెసర పప్పు లను  'ఫ్రీ కేటగిరీ'కి పరిమితం చేయడం వంటి ప్రభుత్వ ముందస్తు, సానుకూల చర్యల కారణంగా పప్పుధాన్యాల రిటైల్ ధరల్లో స్థిరత్వం సాధ్యం అయింది. కంది, మినపప్పు లకు సంబంధించి స్వేచ్ఛా కేటగిరీ నీ విస్తరించారు.  బిల్ ఆఫ్ లాడింగ్ కు చివరి తేదీ డిసెంబర్ 31, 2021 కాగా, కస్టమ్స్ క్లియరెన్స్ ఇది జనవరి 31, 2022. ఈ విధాన చర్యకు సానుకూల చర్యల ద్వారా , సంబంధిత శాఖల /సంస్థల ద్వారా  దాని అమలును నిశితంగా పర్యవేక్షించడం ద్వారా మద్దతు లభించింది. దిగుమతి విధాన చర్యలు గత రెండు సంవత్సరాలుగా ఇదే కాలంతో పోలిస్తే కంది,మినప. పెసర పప్పు దిగుమతి గణనీయంగా పెరగడానికి దోహదపడ్డాయి.

 

పప్పుధాన్యాల నిల్వ ,ఫలితంగా కృత్రిమ కొరత కారణంగా ధరల పెరుగుదలను నియంత్రించడానికి, ప్రభుత్వం జూలై 02, 2021 న నిత్యావసర వస్తువుల చట్టం, 1955 కింద పెసర మినహా అన్ని పప్పుధాన్యాలపై నిల్వ పరిమితిని విధించింది. స్టాక్ లిమిట్ ఆర్డర్ ప్రభావం వల్ల అక్టోబర్ 31, 2021 కు మించి తదుపరి పొడిగింపు అవసరం లleni విధంగా ధరలు తగ్గాయి. . అయినా ముందు జాగ్రత్తగా, వెబ్ పోర్టల్ ద్వారా స్టాక్ ల పర్యవేక్షణ కొనసాగు తోంది.

 

ప్రధాన పప్పుధాన్యాలలో, కందిపప్పు దిగుమతి పై భారతదేశం ఎక్కువగా ఆధారపడింది. దేశీయ లభ్యత , ధరలు కూడా  విదేశీ ఉత్పత్తికి ప్రభావిత మవుతున్నాయి.  దేశీయ వినియోగదారులపై అధిక అంతర్జాతీయ ధరల ప్రభావాన్ని సరళంగా మార్చడానికి, ప్రభుత్వం కందిపప్పు పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని సున్నాకు మరియు ఎఐడిసి (వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్) ను జూలై 27, 2021 నుండి 10%కి తగ్గించింది. మార్కెట్ జోక్యంగా , వినియోగదారులకు సహేతుకమైన ధరలకు రిటైల్ అవుట్ లెట్ ల ద్వారా లభ్యతను పెంచడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత  ప్రాంతాలకు రాయితీ ధర తో బఫర్ నిల్వ నుంచి కందిపప్పు ను కేంద్రం సరఫరా చేస్తోంది. ధరలను తగ్గించడానికి బహిరంగ మార్కెట్లోకి మసూర్ స్టాక్స్ విడుదలతో ఈ చర్య మరింత పెరిగింది. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ అరైవల్ వద్ద పప్పుల ఫ్యుమిగేషన్ కోసం ప్రోటోకాల్ ను కూడా క్రమబద్ధీకరించారు. పెనాల్టీ ఛార్జీలను  మార్చి 31, 2022 వరకు మాఫీ చేశారు. ఇది కందిపప్పు రిటైల్ ధరలను నియంత్రించడం పై మరింత సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.

***



(Release ID: 1773103) Visitor Counter : 213


Read this release in: English , Urdu , Hindi