సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఐఐటిఎఫ్‌లో ఎన్ఎస్ఐసి పెవిలియన్‌ను ప్రారంభించిన ఎంఎస్ఎంఇ మంత్రి
Posted On:
15 NOV 2021 5:48PM by PIB Hyderabad
ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న 40వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (40 ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్)లో ఎన్ఎస్ఐసి పెవిలియన్‌ను సోమవారం కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి నారాయణ్ రాణె, సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ ఎంఎస్ఎంఇ కార్యదర్శి బిబి స్వైన్, ఎన్ఎస్ఐసి సిఎండి అల్కా నంగియా అరోరా సమక్షంలో ప్రారంభించారు.
దేశం నలుమూలల నుంచి 121కి పైగా రాఆజస్తాన్, కర్నాటక, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, యుపి, పశ్చిమ బెంగాల్, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన ఎన్ఎస్ఐసి పెవిలియన్లలో
పాల్గొంటున్నాయి. హస్తకళలు, జౌళి, ఆహార ఉత్పత్తులు, లెదర్, ఆభరణాలు &రత్నాలు, ఫర్నిషింగ్, ఎంబ్రాయిడరీ & లేసులు, కాగితపు ఉత్పత్తులు, మూలికలు & ఆయుర్వేద/ యఉనాని, ఇన్‌లే పెయింటింగ్స్, హెయిర్ ప్రాడక్ట్స్ తదితరాలు ప్రదర్శనలో ఉన్నాయి.
(Release ID: 1772166)
Visitor Counter : 168