ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఐఐటీఎఫ్‌, 2021లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల లాంజ్ ఏర్పాటు చేయబడింది

Posted On: 14 NOV 2021 4:49PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను నియమాలు మరియు విధానాలకు అనుగుణంగా పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ అందించే వివిధ సేవల గురించి అవగాహన పెంపొందించడానికి మరియు సులభతరం చేయడానికి నవంబర్ 14, 2021 నుండి 27 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న భారతదేశ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2021లో ఆదాయపు పన్ను శాఖ ద్వారా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేయబడింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, న్యూఢిల్లీ చైర్మన్ శ్రీ జే.బి. మోహపాత్ర ఈ రోజు అంటే 14.11.2021న హాల్ నెం. 12లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సభ్యులు, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ , అడ్మినిస్ట్రేషన్ మరియు టాక్స్ పేయర్ సర్వీసెస్), ఇన్‌కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ (సిసిఏ), న్యూఢిల్లీ మరియు ఆదాయపు పన్ను శాఖలోని ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో పన్ను చెల్లింపుదారుల లాంజ్‌ను ప్రారంభించారు.

డిపార్ట్‌మెంట్ మరియు పన్ను చెల్లింపుదారుల మధ్య విశ్వసనీయ వాతావరణాన్ని ప్రోత్సహించడానికి మరియు ఇటీవలి కాలంలో డిపార్ట్‌మెంట్ తీసుకున్న కార్యక్రమాల గురించి వారికి అవగాహన కల్పించడానికి పన్ను చెల్లింపుదారుల లాంజ్ కృషి చేస్తుంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపుదారుల లాంజ్‌లో వివిధ కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి:

 

  1. పాన్‌/ఈ-పాన్‌,  ఆధార్ మరియు పాన్ కార్డ్‌ లింకింగ్ అలాగే పాన్ సంబంధిత ప్రశ్నల కోసం దరఖాస్తులో సహాయం.
  2. ఇ-ఫైలింగ్ మరియు ఫారం 26ఏఎస్ (పన్ను-క్రెడిట్) సంబంధిత ప్రశ్నలలో సహాయం.
  3. వివిధ అంశాలపై పన్ను చెల్లింపుదారుల సమాచార సిరీస్ బ్రోచర్‌లను అందించడం. ఇది ఈ-ఫార్మాట్ మరియు పేపర్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది.
  4. వర్చువల్ రియాలిటీ గేమ్ మరియు వీడియో కార్ గేమ్ వంటివి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించడం యొక్క ప్రాముఖ్యతను యువ సందర్శకులకు ఆకర్షణీయంగా తెలియజేస్తాయి.
  5. ట్రేడ్ ఫెయిర్‌ని సందర్శించే ప్రస్తుత మరియు భవిష్యత్ పన్ను చెల్లింపుదారుల కోసం పన్నులు మరియు దేశ నిర్మాణం వంటి అంశాలపై నూక్కడ్‌నాటక్, క్విజ్ షోలు, మ్యాజిక్ షోలు, పిల్లల కోసం ప్రత్యక్ష వ్యంగ్య చిత్రాలు మరియు డ్రాయింగ్/పెయింటింగ్ పోటీలు మొదలైనవి.


పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఫీడ్‌బ్యాక్ పొందేందుకు కూడా లాంజ్ ఉపయోగించబడుతుంది. అందువల్ల, లాంజ్ అనేది ఫోకస్డ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, డిపార్ట్‌మెంట్ యొక్క సేవా-ఆధారిత విధానాన్ని ప్రదర్శించడానికి ఒక వేదిక కూడా సహాయపడుతుంది.

            పన్ను చెల్లింపుదారుల లాంజ్‌లో వివిధ కార్యక్రమాల ఏర్పాటులో కొవిడ్‌ ప్రోటోకాల్‌లు అనుసరించబడతాయి.


 

****



(Release ID: 1771788) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi