మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఉప్పుటేరు లో మత్స్య రంగ అభివృద్ధికి ప్రోత్సాహం అనే అంశంపై వెబినార్ నిర్వహించిన మత్స్య శాఖ


ఉప్పు ప్రభావంతో సారం కోల్పోయిన భూములలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి గల అవకాశాలపై చర్చ

వ్యర్ధ భూములను సంపద భూములుగా మార్చడానికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద అందిస్తున్న ప్రయోజనాలను వివరించిన అధికారులు

3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఉప్పుటేరు లో మత్స్య రంగ అభివృద్ధికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 2020-21 నుంచి 2024-25 వరకు 526 కోట్ల రూపాయల పెట్టుబడి

Posted On: 06 NOV 2021 8:22PM by PIB Hyderabad

  ఉప్పుటేరు లో  మత్స్య రంగ అభివృద్ధికి ప్రోత్సాహం  అనే అంశంపై కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న  మత్స్యశాఖ 2021 నవంబర్ న ఒక వెబినార్ నిర్వహించింది. "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మత్స్య శాఖ ఈ వెబినార్ నిర్వహించింది.  కార్యక్రమానికి  కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జితేంద్ర నాథ్ శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షత వహించారు. మత్స్య శాఖ, వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు, ఐసీఏఆర్ కి చెందిన శాస్త్రవేత్తలు, రాష్ట్రాల వ్యవసాయ,ఇన్‌స్టిట్యూట్‌ల శాస్త్రవేత్తలు మరియు ఫ్యాకల్టీతో సహా 100 మందికి పైగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయంవెటర్నరీ మరియు మత్స్య విశ్వవిద్యాలయాలుపారిశ్రామికవేత్తలు చేపల పెంపకం దారులుహేచరీల  యజమానులు, ఆక్వాకల్చర్ పరిశ్రమల ప్రతినిధులు వెబినార్ లో పాల్గొన్నారు. 

వెబినార్ ను మత్స్య అభివృద్ధి కమిషనర్ శ్రీ ఐ.ఏ, సిద్దిఖీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్ ల్యాండ్ ఫిషరీస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్సంయుక్త  కార్యదర్శి  శ్రీ సాగర్ మెహ్రామెరైన్ ఫిషరీస్ సంయుక్త కార్యదర్శి డాక్టర్. జె. బాలాజీ, గుజరాత్ కి చెందిన శాస్త్రవేత్త శ్రీ జోస్ ఆంటోనీ ఇతరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

దేశంలో మత్స్య రంగ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ స్వైన్ అన్నారు. సుస్థిర అభివృద్ధిని సాధించడానికి ఈ వనరులను వినియోగంలోకి తీసుకు రావలసి ఉంటుందని అన్నారు. ఉప్పు ప్రభావానికి గురై సారాన్ని కోల్పోయిన భూములలో చేపల పెంపకం చేపట్టడానికి గల అవకాశాలను ఆయన వివరించారు. ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్న భూములలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద అందిస్తున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. 'వ్యర్థ భూమిని సంపద భూమి'గా మార్చాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. సాంకేతిక అంశాల వినియోగం, శిక్షణ, రైతుల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విత్తనాలు, చేపల మేత ను అందుబాటులోకి తేవడం ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. మత్స్య రంగం, మత్స్య పరిశ్రమ రంగ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను ఆయన వివరించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్య రంగం, మత్స్యకారుల అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను, ఈ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి అమలు చేస్తున్న చర్యలను ఆయన ప్రస్తావించారు. 

మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి (ఇన్ ల్యాండ్  ఫిషరీస్) శ్రీ సాగర్ మెహ్రా ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్న భూములలో ప్రస్తుతం అమలు జరుగుతున్న చేపల పెంపకం కార్యక్రమాలను వివరించారు. హర్యానాపంజాబ్రాజస్థాన్ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ రంగ అభివృద్ధికి గల అవకాశాలను ఆయన ప్రస్తావించారు. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో ఉప్పు నీటి భూములలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 526 కోట్ల రూపాయల పెట్టుబడులను అందించేలా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమాలు అమలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల మూడు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి బయోఫ్లోక్ వంటి సాంకేతికతలను ప్రోత్సహించడంతో పాటు టెస్టింగ్ లేబొరేటరీ నెట్‌వర్క్ఫీడ్ ప్లాంట్లుకోల్డ్ చైన్ మరియు మార్కెటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సౌకర్యాలు అభివృద్ధి చెందేలా  ఈ రాష్ట్రాల్లో కార్యక్రమాలు అమలు జరగాలని ఆయన సూచించారు. మత్స్య జాతులు, ఉప్పు నీటి తొలగింపు, మానవ వనరులను అభివృద్ధి చేయడం లాంటి చర్యల ద్వారా ఉప్పు భూములలో చేపల పెంపకం సుస్థిర అభివృద్ధిని సాదిస్తుందని అన్నారు. 

మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి (మెరైన్ ఫిషరీస్) శ్రీ బాలాజీ ఉప్పు నీటి భూములలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించే అంశం లో ఎదురవుతున్న సమస్యలు, వాటిని అధిగమించడానికి అమలు చేయాల్సిన చర్యలను వివరించారు. నాణ్యమైన విత్తనాలు, పారిశ్రామిక విధానం, రొయ్యల పెంపకం, సుస్థిర అభివృద్ధి సాధించడానికి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉత్తర భారత రాష్ట్రాలలో ఉప్పు నీటి భూములలో చేపల పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ , పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి చర్యలు అమలు జరగాలని అన్నారు. 

వెబినార్ లో భాగంగా ఏర్పాటైన సాంకేతిక సదస్సులో గుజరాత్ కి చెందిన శాస్త్రవేత్త  శ్రీ జోస్ ఆంటోనీ ఉప్పు నీటి భూములలో చేపల పెంపకంపై ప్రసంగించారు. దేశంలో ఈ రంగ అభివృద్ధికి గల అవకాశాలను, ఎదురవుతున్న సమస్యలు, వీటిని అధిగమించడానికి అమలు చేయవలసిన చర్యలను ఆయన వివరించారు. పరిశోధనాశాలల కొరత, కొనుగోలుదారులు లేకపోవడం, పర్యావరణ సమస్యలు, పౌష్టిక ఆహార లోపం, రొయ్యల పెంపకం లాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. 

సాంకేతిక సదస్సు తరువాత చేపల పెంపకం దారులు, పారిశ్రామికవేత్తలు, హాచేరీల యజమానులు, శాస్త్రవేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మత్స్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ ఎస్.కే.ద్వివేది వందన సమర్పణ చేశారు. 

***



(Release ID: 1769861) Visitor Counter : 130


Read this release in: Tamil , English , Urdu , Hindi