ఆర్థిక మంత్రిత్వ శాఖ
జమ్ము& కాశ్మీర్, పంజాబ్ లలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
05 NOV 2021 2:34PM by PIB Hyderabad
డ్రైఫ్రూట్స్ ప్రాసెసింగ్, వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులపై 28.10.2021న ఆదాయపన్ను శాఖ సెర్చ్ అండ్ సీజర్ (సోదాల, స్వాధీనం) ఆపరేషన్లను నిర్వహించింది.
ఈ సోదాల సందర్భంగా, అసెసీ గ్రూపు గత కొన్ని ఏళ్ళుగా డ్రైఫ్రూట్ కొనుగోళ్ళను అత్యధికంగా పెంచి చూపుతున్నట్టు సూచించే అనేక డిజిటల్ ఆధారాలు సహా నేరారోపణ పత్రాలను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. కొనుగోళ్ళ కోసం చేసిన చెల్లింపులకు సంబంధించిన లెక్కల్లోకి రాని నగదు తిరిగి గ్రూపు డైరెక్టర్లు పొందిన వాస్తవాన్ని స్వాధీనం చేసుకున్న ఆధారాలు పట్టి చూపుతున్నాయి. దీనితోపాటుగా అసెసీలలో ఒకరు సమాంతరంగా ఖాతాల పుస్తకాల సెట్‌ను నిర్వహిస్తున్నారని, ఈ రెండు జతల పుస్తకాలలో నమోదైన అమ్మకాలు, కొనుగోళ్ళ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఆధారాలు వెలుగులోకి తెచ్చాయి.ఈ గ్రూపులలో ఒకటి లెక్కల్లోకి రాని డ్రూఫ్రూ్స్ కొనుగోళ్ళు, అమ్మకాలకు పాల్పడుతోంది. దాదాపుగా రూ. 40 కోట్ల మేరకు అదనపు స్టాక్ బయిటపడింది. ఈ గ్రూపులలో ఒకటి బినామీ ఆస్తి సంస్థను నడిపిస్తున్నట్టు స్వాధీనం చేసుకున్న సరుకు, సేకరించిన ఆధారాల విశ్లేషణలు బయిటపెట్టాయి.
రెండు గ్రూపుల్లో కూడా, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని 80ఐబి సెక్షన్ కింద తగ్గింపు క్లెయిము వాస్తవమైంది కాదని, దాని విలువ దాదాపు రూ. 30 కోట్ల మేరకు ఉందని తేలింది.
ఈ సోదాల ఫలితంగా రూ. 63 లక్షల మేరకు లెక్కల్లోకి రాని నగదును, రూ. 2 కోట్ల మేరకు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పధ్నాలుగు లాకర్లను స్తంభింపచేశారు. ఈ సోదా చర్య దాదాపు రూ. 200 కోట్లకు పైగా లెక్కల్లోకి రాని ఆదాయాన్ని గుర్తించడానికి దారి తీసింది.
తదుపరి దర్యాప్తులు కొనసాగుతున్నాయి.
***
(Release ID: 1769529)
Visitor Counter : 130