రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వై 12704 (విశాఖ‌ప‌ట్నం) నౌక‌ భార‌త నౌకా ద‌ళానికి అప్ప‌గింత‌


15 బి ప్రాజెక్టుకు చెందిన తొలి నౌక ఇది

Posted On: 31 OCT 2021 9:39AM by PIB Hyderabad

వై 12704 (విశాఖ‌పట్నం_15 బి ప్రాజెక్టుకు సంబంధించి స్టెల్త్ గైడెడ్ క్షిప‌ణి విధ్వంస‌క కీల‌క నౌక‌ను 2021 అక్టోబ‌ర్ 28న భార‌త నౌకాద‌ళానికి అంద‌జేశారు. దీనిని మాజ్‌గాన్ డాక్స్ లిమిటెడ్ (ఎండిఎల్‌) వ‌ద్ద నిర్మిస్తూ వ‌చ్చారు. ఈ కాంట్రాక్టు కింద 15 బి ప్రాజెక్టులో భాగంగా నాలుగు నౌక‌ల త‌యారీ కి సంబంధించ‌చి 2011 జ‌న‌వ‌రి 28 న సంత‌కాలు జ‌రిగాయి. వీటిని విశాఖ‌పట్నం త‌ర‌హా నౌక‌లు అంటారు. ఈ ప్రాజెక్టు,  గ‌త ద‌శాబ్దంలో త‌యారైన కోల్‌క‌తా ( ప్రాజెక్టు 15 ఎ) విధ్వంస‌క నౌక త‌ర‌హాలో నిదే.

ఈ నౌక‌ను డైర‌క్ట‌రేట్ ఆఫ్ నావ‌ల్ డిజైన్ సంస్థ డిజైన్ చేసింది. ఇండియ‌న్ నావీకి చెందిన డిజైన్ సంస్థ ఇది.దీనిని ముంబాయి కి చెందిన మాజ‌గాన్ డాక్ షిప్ బిల్డ‌ర్స్ లిమిటెడ్  నిర్మించింది. ఇది త‌యారు చేస్తున్న నాలుగు నౌక‌ల‌ను దేశంలోని న‌లుమూల‌ల నుంచి నాలుగు న‌గ‌రాల పేర్లు అయిన‌ విశాఖ‌ప‌ట్నం, మ‌ర్మ‌గోవా, ఇంఫాల్‌, సూర‌త్లల పేర్లు పెట్టారు.

నౌకానిర్మాణానికి సంబంధించిన ప్ర‌ధాన స్ట్ర‌క్చ‌ర్ నిర్మాణాన్ని 2013 అక్టోబ‌ర్‌లో ప్రారంబించారు. షిప్‌నిర్మాణాన్ని 2015 లో ప్రారంభించారు. డిజైన్ లో ప్రొప‌ల్ష‌న్ మెషిన‌రీ, ప‌లు ఫ్లాట్‌ఫారం ప‌రిక‌రాలు, ప్ర‌ధాన ఆయుధాలు, సెన్స‌ర్లు ఉన్నాయి.

163 మీట‌ర్ల పొడ‌వుగ‌ల ఈయుద్ద నౌక 7400 ట‌న్నుల బ‌రువు క‌లిగి ఉంటుంది. అలాగే 30 నాట్ ల గ‌రిష్ఠ వేగాన్ని క‌లిగి ఉంటుంది, ఇందులో మొత్తం దేశీయ సాంకేతిక ప‌రిజ్ఞానంతో రూపొందించిన‌ది 75 శాతం వ‌రకు ఉంది. ఫ్లోట్‌, మూవ్ విభాగాల ప‌రిక‌రాలు, విధ్వంస‌కాన్ని ప్ర‌ధాన దేశీయ ఆయుధాల‌తో దీనిని స‌మ‌క‌కూర‌ర్చారు.
ఇందులో
--మీడియం రేంజ్ క‌లిగిన‌ భూమి నుంచి గ‌గ‌న త‌లానికి ప్ర‌యోగించే మిసైల్ ( బిఇఎల్‌, బెంగ‌ళూరు)
--బ్ర‌హ్మోస్ భూ ఉప‌రిత‌లం నుంచి  భూ ఉప‌రిత‌లానికి ప్ర‌యోగించే క్షిప‌ణి ( బ్ర‌హ్మోస్ ఎయిరో స్పేస్‌, న్యూఢిల్లీ)
--దేశీయ టార్పెడో ట్యూబ్ లాంచ‌ర్లు ( లార్స‌న్ అండ్ టుబ్రో, ముంబాయి)
-- స‌బ్ మెరైన్ విధ్వంసక రాకెట్ లాంచ‌ర్లు (లార్స‌న్ అండ్ టుబ్రో , ముంబాయి)
--76 ఎంఎం సూప‌ర్ రాపిద‌డ్ గ‌న్ మౌంట్ (బిహెచ్ ఇ ఎల్‌, హ‌రిద్వార్‌)  ఉన్నాయి.
విశాఖ‌ప‌ట్నం నౌక‌ను త‌యారు చేసి నౌకాద‌ళానికి అందించ‌డం , 75 సంవ‌త్స‌రాల స్వాతంత్ర వార్షికోత్స‌వాల సంద‌ర్భంగా ఆత్మ‌నిర్బ‌ర్ దిశ‌గా ఇది ఒక పెద్ద ఊతంగా భావించ‌వ‌చ్చు. కోవిడ్ స‌వాళ‌ల్ఉ ఉన్న‌ప్ప‌టికీ ఈ క్షిప‌ణి విధ్వంస‌క నౌక త‌యారీ అనేది వివిధ విబాగాల స‌మ‌ష్టి కృషికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. ఇది  హిందూ మ‌హాస‌ముద్ర  ప్రాంతంలో  స‌ముద్ర మార్గ ర‌క్ష‌ణ‌కు ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది.

***


(Release ID: 1768380) Visitor Counter : 217