ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేదార్ ‌నాథ్ ను నవంబరు 5న సందర్శించనున్న ప్రధాన మంత్రి; శ్రీ ఆది శంకరాచార్య సమాధి ని ఆయన ప్రారంభిస్తారు


శ్రీఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి

అనేకకీలకమైన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పథకాల ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి;  అలాంటి మరికొన్ని పథకాల కు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు

నిర్మాణంపూర్తి అయిన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పనుల ను ఆయన పరిశీలించనున్నారు, ప్రస్తుతంనిర్మాణ పనులు సాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పనుల పై ఆయన సమీక్ష ను చేపడుతారు

Posted On: 28 OCT 2021 5:45PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 5న సందర్శించనున్నారు.

కేదార్ నాథ్ ఆలయం లో ప్రధాన మంత్రి ప్రార్థనల లో పాలుపంచుకొంటారు. అటు తరువాత, శ్రీ ఆది శంకరాచార్య సమాధి ని ఆయన ప్రారంభించడమే కాకుండా శ్రీ ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2013వ సంవత్సరం లో సంభవించిన వరదల లో ఆ సమాధి ధ్వంసం అయిన దరిమిలా దాని ని పునర్ నిర్మించడం జరిగింది. ఈ పునర్ నిర్మాణం సంబంధి పనుల ను అన్నిటి ని ప్రధాన మంత్రి మార్గదర్శకత్వం లో చేపట్టడమైంది. ఈ పథకం తాలూకు ప్రగతి ని ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సమీక్షించడం చేస్తూ వచ్చారు.

సరస్వతీ ఆస్తాపథ్ వెంబడి జరిగిన పనుల ను మరియు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల ను ప్రధాన మంత్రి తనిఖీ చేయడం, పరిశీలించడం చేయనున్నారు.

ఒక జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. సరస్వతీ రిటేనింగ్ వాల్ ఆస్తాపథ్, ఇంకా ఘాట్ లు, మందాకినీ రిటేనింగ్ వాల్ ఆస్తాపథ్, తీర్థ పురోహితుల గృహాల తో పాటు మందాకినీ నది పైన గరుడ్ ఛాతీ సేతువు లు సహా నిర్మాణం పూర్తి అయినటువంటి కీలకమైన మౌలిక సదుపాయాల సంబంధి పథకాల ను ఆయన ప్రారంభిస్తారు. ఈ పథకాల ను 130 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 180 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక పథకాల కు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ పథకాల లో సంగమ్ ఘాట్ ను సరిక్రొత్త గా నిర్మించడం, ప్రాథమిక చికిత్స మరియు తీర్థ యాత్రికుల కు ఉద్దేశించిన సదుపాయాల కేంద్రం, పరిపాలన భవనం మరియు ఆసుపత్రి, రెండు వసతి గృహాలు, పోలీస్ స్టేశన్, కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్, మందాకిని ఆస్తాపథ్ క్యూ మేనేజ్ మెంట్ ఎండ్ రెయిన్ శెల్టర్ మరియు సరస్వతీ పౌర సౌకర్యాల భవనం వంటివి భాగం గా ఉన్నాయి.

***


(Release ID: 1767372) Visitor Counter : 157