గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రికి డివిడెండ్ చెక్కుల‌ను అంద‌చేసిన ఎన్‌బిసిసి, హెచ్ఎస్‌సిఎల్

Posted On: 27 OCT 2021 5:11PM by PIB Hyderabad

ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21కు గాను వాటాదారుల‌కు మొత్తం రూ. 52.24 కోట్ల  డివిడెండ్ల‌ను (లాభాల‌లో భాగం) ఎన్‌బిసిసి ఇండియా లిమిటెడ్ చెల్లించింది. ఈ మేర‌కు రూ. 52.24 కోట్ల చెక్కును అంతిమ డివిడెండ్‌గా గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి దుర్గా శంక‌ర్ మిశ్రా, అద‌న‌పు కార్య‌ద‌ర్శి క‌మ్రాన్ రిజ్వీ, ఎన్‌బిసిసి  (ఫైనాన్స్‌) డైరెక్ట‌ర్ శ్రీమ‌తి సుఖే స‌మ‌క్షంలో  మంత్రి హ‌ర్‌దీప్ సింగ్‌కు ఎన్‌బిసిసి చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్  ప‌వ‌న్ కుమార్ గుప్తా బుధ‌వారంనాడు అంద‌చేశారు. 
ఎన్‌బిసిసి (ఇండియా) లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హిందుస్తాన్ స్టీల్‌వ‌ర్క్స్ క‌న‌స్ట్ర‌క్ష‌న్ లిమిటెడ్ (హెచ్ఎస్‌సిఎల్‌) కూడా అంతిమ డివిడెండుగా ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21కి గాను రూ. 4.36 కోట్ల‌ను (ఇందులో రూ. 1.68 కోట్ల డివిడెండు, రూ. 2.68 కోట్ల ఇంటెరిమ్ డివిడెండ్ ఉన్నాయి) భార‌త ప్ర‌భుత్వానికి చెల్లించింది. 

 

***



(Release ID: 1767068) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi , Tamil