ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశిష్ట ఉక్కు (స్పెషాలిటీ స్టీల్) విభాగానికి పీఎల్ఐ ప‌థ‌కం వ‌ర్తింపుపై చ‌ర్చించేందుకు అక్టోబ‌రు 25, 2021న స‌ద‌స్సు

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2021 10:33AM by PIB Hyderabad

విశిష్ట ఉక్కు (స్పెషాలిటీ స్టీల్) రంగానికి పీఎల్ఐ ప‌థ‌కం వ‌ర్తింపు విధానంపై చ‌ర్చించేందుకు గాను ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక రోజు స‌ద‌స్సు‌ను నిర్వహిస్తోంది. న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అక్టోబర్ 25, 2021న‌ (సోమవారం) ఈ  సెమినార్‌ను నిర్వహించ‌నున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్‌లు స‌ద‌స్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగించనున్నారు. నీతి ఆయోగ్ సంస్థ సీఈవో శ్రీ అమితాబ్ కాంత్ మరియు సీనియర్ ప్రభుత్వ ప్రముఖులు కూడా సెమినార్‌లో పాల్గొన‌నున్నారు. పీఎల్ఐ ప‌థ‌కం వ‌ర్తింపు అద‌న‌పు అంశాల‌ను చ‌ర్చించేందుకు గాను
భాగ‌స్వామ్యప‌క్షాల వారికి ఒక వేదిక‌ను అందించాల‌నే ఉద్దేశంతో ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. స్పెషాలిటీ స్టీల్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,322 కోట్ల బడ్జెట్ వ్యయంతో 2023-24 నుండి FY 2029-30 వరకు అమలు చేయడానికి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహ‌పు  పథకాన్ని ఆమోదించింది. పీఎల్ఐ పథకం ద్వారా గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 'స్పెషాలిటీ స్టీల్' దేశీయ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఉంది. ఈ పథకం ఐదు (05) సూచక ఉక్కు ఉత్పత్తి వర్గాలకు వర్తిస్తుంది, అవి, పూత/పూతతో కూడిన ఉక్కు ఉత్పత్తులు, అధిక సామ‌ర్థ్యం/వేరు నిరోధక ఉక్కు, ప్రత్యేక పట్టాలు, అనుబంధ ఉక్కు ఉత్పత్తులు మరియు ఉక్కు తీగ‌లు మరియు ఎలక్ట్రికల్ స్టీల్‌కు ఇది వ‌ర్తిస్తుంది. "ఆత్మనిర్భర్ భారత్" లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పీఎల్ఐ పథకం ద్వారా సంభావ్య పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, సామర్థ్యాలను జోడించడానికి, దేశంలోకి కొత్త టెక్నాలజీలను తీసుకురావడానికి ఇప్పటికే ఉన్న వివిధ కంపెనీలను దృష్టిని ఆక‌ర్షించే దిశ‌గా ఇది ఒక ముంద‌డుగా ఉంది. ఉక్కు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో వివరణాత్మక నోటిఫికేషన్ మరియు మార్గదర్శకాలు ప్రచురించబడ్డాయి. పరిశ్రమ భాగ‌స్వామ్య ప‌క్షాల వారు పథకంపై వివరణాత్మక చర్చలు జరపడానికి వీలుగా సాంకేతిక సెషన్‌లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేయబడ్డాయి.
స‌ద‌స్సులో విధానక‌ర్త‌లు, బ్యూరోక్రాట్లు, ప్ర‌భుత్వ రంగ ఉక్కు ఉత్ప‌త్తి సంస్థ‌లు,  స‌మీకృత‌ మరియు ద్వీతియ శ్రేణి ఉక్కు ఉత్ప‌త్తిదారులు, సంభావ్య పెట్టుబడిదారులు, స్టీల్ అసోసియేషన్లు త‌దిత‌రులు పాల్గొననున్నారు.
                                                                                   

*******


(రిలీజ్ ఐడి: 1766036) సందర్శకుల సూచీ సంఖ్య : : 195
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Punjabi , Tamil