ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
బెంగ ళూరులోని డిడాక్‌ను సందర్శించిన కేంద్ర సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఒటి కిట్‌ను ఆవిష్కరించిన మంతరి
ఈ పర్యటన సందర్భంగా సెమి కండక్టర్ కంపెనీలు , స్టార్టప్‌లకు చెందిన వారిని కలుసుకున్నమంత్రి
ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ డిజైన్ ఆవిష్కరణలలో ఇండియా నాయకత్వం వహించే స్థితికి చేరాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వారితో పంచుకున్న మంత్రి
సెమికండక్టర్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసేందుకు శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఈ ప్రభుత్వం సరైన పాలసీ ఫ్రేమ్ వర్క్‌ను అందిస్తుంది : శ్రీచంద్రశేఖర్
Posted On:
18 OCT 2021 4:41PM by PIB Hyderabad
కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటి, నైపుణ్యాభివృద్ధి , ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్, శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ , బెంగళూరులోని సిడాక్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సింగిల్ బోర్డ్ ఐఒటి డవలప్‌మెంట్ ప్లాట్‌పారం ఇండస్ ( ఇన్నొవేషన్ డవలప్‌మెంట్ అప్ స్కిల్లింగ్)ను ఆవిష్కరించారు. సిడాక్ అభివృద్ధి చేసిన కిట్, క్రెడిట్ కార్డు సైజ్‌లో ఉంది. దీనికి ఆరు సెన్సర్లు, యాక్ట్యుయేటర్లు, కనెక్టివిటి, డీ బగ్గర్ ఇంటర్ ఫేస్ ఉన్నాయి..
చిన్నదైన, సులభంగా ఎక్కడికైనా తీఉకువెళ్లడానికి వీలుగల ఈ ఐఒటి కిట్ స్థానిక, స్మార్ట్ సొల్యూషన్‌ల అభివృద్ధికి, డ్రోన్స్ తో సహా వివిధ అప్లికేషన్లకు ఉపయోగపడుతుంది. దీని ధర యూనిట్‌కు 2,500 రూపాయలుగా ఉంది. ఇది జిఇఎం పోర్టల్‌పై త్వరలో అందుబాటులో ఉంటుంది. సిడాక్ ఈ టెక్నాలజీని కమర్షియల్ ప్రొడక్షన్ కోసం స్టార్టప్‌లకు బదలాయించనుంది. బెంగళూరు సిడాక్‌లో అభివృద్ధి చేసిన ఇతర వినూత్న సాంకేతికతలను కూడా మంత్రి శ్రీ చంద్రశేఖర్ పరిశీలించారు. ఇందులో స్మార్ట్ వాటరింగ్ మీటర్, స్మార్ట్ పోస్ట్‌కియోస్క్, స్మార్ట్ వాటర్ పంపిణీ వ్యవస్థ, సిడాక్ వారి హై ఫెర్మాన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) ,హెచ్‌పిసి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్,సర్వీసెస్, పరమ్ ఉత్కర్ష్ సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ,క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధిత కార్యకలాపాలు తదితరాలు ఉన్నాయి. చంద్రశేఖర్ ఈ చొరవలను అభినందించారు. డ్రోన్లకు ఐఒటి ని విస్తరింపచేసేందుకు సిఫార్సుచేశారు.
సి డాక్ లో జరిగిన సమావేశంలో ప్రముఖ ఎం.ఎన్.సిలు, స్టార్టప్‌లనుంచి వచ్చిన ఎగ్జిక్యుటివ్‌లతో మంత్రి సమావేశమయ్యారు. కేంద్ర సహాయ మంత్రి స్వయంగా టెక్నో క్రాట్ కావడం, అత్యుత్తమ టెక్నాలజీ వేత్తలలో వారు కూడా ఒకరు కావడం చెప్పుకోదగిన అంశం. శ్రీ చంద్రశేఖర్‌గారు సిలికాన్ వ్యాలీలో గతంలో చిప్ డిజైనర్‌గా 80489 మైక్రోప్రాసెసర్, పెంటియమ్‌కు పనిచేశారు. స్వయంగా వారు ఈ రంగంలో నిపుణులు కావడంతో వారి మేధస్్సు, నైపుణ్యం, విలువైన అనుభవం వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు అప్పగించిన రెండు ప్రధాన పోర్టుఫోలియోలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది..
ఈ సందర్బంగా సమావేశమైన వారితో మాట్లాడుతూ, శ్రీ చంద్రశేఖర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలను పంచుకున్నారు. ఇండియాను ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ నాయకత్వ దశలో ఉండేలా చేసేందుకు శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ ఫెసిలిటేటర్‌గా , భాగస్వామిగా, మార్కెట్ అనుసంధానత, పెట్టుబడిని సమకూర్చడంతో పాటు ప్రగతి, ఆవిష్కరణలకు మద్దతునిచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మున్నెన్నడూ లేనంతటి గొప్ప అవకాశం భారత్‌కు వచ్చిందని అంటూ ఆయన, ఇది టెక్నాలజీకి వై2కె ఉద్యమమని ఆయన అన్నారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం సెమి కండక్టర్ కంపెనీలతో ,స్టార్టప్‌లతో కలసి పనిచేయనున్నదని, ప్రభుత్వం ఈ రంగానికి సరైన విధాన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని ఆయన తెలిపారు.
ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ డిజైన్, ఫాబ్రికేషన్ వ్యూహానికి సంబంధించి స్టేక్ హోల్డర్లు అందరితో శ్రీ చంద్రశేఖర్ క్రియాశీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇండియా తనంత తానుగా ఆవిష్కరణలను వేగవంతంగా ముందుకు తీసుకుపోవలసి ఉంది. మనం మన సామర్ధ్యాలు పెంపొందించేందుకు గట్టి కృషి చేయాలి. నరేంద్ర మొదీ ప్రభుత్వం బలమైన ఫెసిలిటేటర్‌గా ఉంటుంది అని ఆయన అన్నారు. పాలసీ ఫ్రేమ్ వర్క్‌లో చేర్చవలసిన వ్యూహాల గురించిన అంశాలను ఆయన ఆహ్వానించారు. పిఎల్.ఐ పథకాన్ని ప్రారంభించిన రీతిలోనే ప్రభుత్వం డిఎల్ఐ గురించి ఆలోచిస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ దిశగా మరింత కృషి చేయనున్నట్టు ఆయన తెలిపారరు. మీరు మాతో కలిసి ముందుకు కదలండి, నేను మీకు ఒక ఫోన్ కాల్ అంత దూరంలోనే ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అని శ్రీ చంద్రశేఖర్ వారికి హామీ ఇచ్చారు.
సెమి కండక్టర్ కంపెనీలు వాటి నాయకులు, స్టార్టప్‌లకు చెందిన వారుఈ సమావేశాన్ని ఎంతగానో స్వాగతించారు. ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, అంతరిక్ష ఉత్పత్తులు,డిజైన్ వాలిడేషన్ తయారీ, నిజమైన చోదక శక్తిగా పనిచచేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుండడం వీటన్నింటినీ ఈ సమావేశంలో పాల్గొన్నవారు స్వాగతించినట్టు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండి సంతోష్ కుమార్ తెలిపారు.
ఇదోక ప్రత్యేక అనుభవం. ఈ సమావేశం నిజంగా మేం మా సహచరుడితో మాట్లాడిన అనుభూతిని పొందాం. స్పష్టమైన ఆలోచన, నిర్మోహమాటమైనచర్చ వంటి వాటి కారణంగా మేధోమధనానికి అవకాశం దక్కింది. ఇలాంటి నాయకత్వం తో భారత సెమికండక్టర్ పరిశ్రమ తప్పకుండా పురోగతిసాధించగలదని,రాగల సంవత్సరాలలో అభివృద్ధి చెందగలదని ఆశిస్తున్నాను అని సాంఖ్య లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ పరాగ్ నాయక్ తెలిపారు.
ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ సరఫరా చెయిన్‌లో ఇండియా ఫుట్‌ప్రింట్‌ను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండడం అత్యంత సంతోషం కలిగిస్తున్నదని సిఐఆర్ ఇ ఎల్ సిస్టమ్స్ సిఇఒ సుమీత్ మాథుర్ అన్నారు.
వివిధ రంగాలలో కొత్త అవకాశాలు వస్తున్న దశలో ఇండియా వాతావరణానికి అనుగుణంగా సెమికండక్టర్ల రంగంలో తగిన పరిష్కారాలను అభివృద్ధి చేసే ఆలోచనను తాను స్వాగతిస్తున్నట్టు శ్రీ శ్రీనివాస లింగం, వైస్ ప్రెసిడెంట్, డాటా సెంటర్ , ఎఐ గ్రూప్ , జిఎం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రూప్, ఇంటెల్ ఇండియా తెలిపారు.
కేంద్ర సహయ మంత్రి శ్రీ చంద్రశేఖర్‌తో సమావేశమైనవారిలొ ఎం.ఎన్.సిలు, ఇండియా స్టార్టప్‌లకు చెందిన శ్రీనివాస లింగం, వైస్ ప్రెసిడెంట్, ఇంటెల్, సంజయ్ గుప్తా, మేనేజింగ్ డైరక్టర్ ఎన్.ఎక్స్‌పి సెమికండక్టర్స్, సంతోష్ కుమార్ మేనేజింగ్ డైరక్టర్ టిఐ, దీపక్ అగర్వాల్ సీనియర్ డైరక్టర్ ఎ.ఎం.డి , రాజెన్ వగాడియా వైస్ ప్రెసిడెంట్ , ప్రెసిడెంట్ క్వాల్‌కామ్ ఇండియా, సార్క్ , డాక్టర్ నీల్‌గాలా, సిటిఒ ఇన్‌కోర్ సెమికండక్టర్స్, శరవణ కుమార్ గణేశన్ సిఇఓ , ఫౌండర్ ఎం ఎం ఆర్ ఎప్ ఐసి లు ఉన్నారు.
స్టార్టప్‌ల నుంచి సుమీత్ మాథుర్ సిఇఒ, పౌండర్, సిరెల్, నారాయణ రావు , సిఇఒ అకార్డ్, పరాగ్ నాయక్, సిఇఒ సంఖ్యలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
***
(Release ID: 1764927)
Visitor Counter : 174