కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా యూనివర్సల్ పోస్టల్ యూనియన్, పోస్టల్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్


కఠినమైన సమయాలలో అందించిన పరపతి ఇండియా పోస్ట్‌కు రాబోయే సంవత్సరాలలో సానుకూలంగా మార్గనిర్దేశం చేస్తుంది: పోస్టల్ కార్యదర్శి శ్రీ వినీత్ పాండే

Posted On: 09 OCT 2021 3:47PM by PIB Hyderabad
1874 లో స్థాపించిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 9 న ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకుంటారు. 1876 నుండి భారతదేశం యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌లో సభ్యునిగా ఉంది. ప్రపంచ తపాలా దినోత్సవం ఉద్దేశ్యం ప్రజల జీవితాల్లో, వ్యాపారాలలో పోస్టల్ రంగం పాత్ర, అలాగే దేశాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సహకారం గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడం. ఈ సంవత్సరం ప్రపంచ పోస్ట్ డే ఇతివృత్తం 'ఇన్నోవేట్ టు రికవరీ' - తిరిగి పునరుద్ధరణ దిశగా ఆవిష్కరణల పేరుతో  ప్రపంచ పోస్ట్ డే సందర్భంగా, కోవిడ్ మహమ్మారి కష్ట కాలంలో ప్రజా సేవలను అందించడంలో పోస్టల్ సిబ్బంది అమూల్యమైన కృషిని గుర్తుచేసుకుంటాము. 

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మిస్టర్ ఆంటోనియో గుటెర్రెస్‌ని ఉటంకిస్తే.. "విస్తారమైన పోస్టల్ నెట్‌వర్క్-లక్షలాది మంది కార్మికులు వందల వేల పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా బిలియన్ల కొద్దీ మెయిల్ లను తరలించడం-ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీలను కలుపుతూ మన సమాజాలను అనుసంధానం చేస్తోంది"

1.5 లక్షలకు పైగా ఐటి ఎనేబుల్ చేసిన పోస్ట్ ఆఫీసులతో, 2020 మరియు 2021 లో మహమ్మారి లాక్డౌన్ సమయంలో పోస్టల్ మరియు ఫైనాన్షియల్ సేవలను అందించడంలో ఇండియా పోస్ట్ కీలక పాత్ర పోషించింది. బలమైన ఐటీ వ్యవస్థ పౌరుల ఇంటి వద్ద ఆర్థిక సేవలను అందించడానికి ఇండియా పోస్ట్‌ని  అవకాశం కలిపిస్తుంది. 

సామాన్యుడికి అత్యంత అందుబాటులో, విశ్వసనీయమైన బ్యాంక్‌ను నిర్మించాలనే దృష్టితో 2018 లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించడం ద్వారా విస్తారమైన పోస్టల్ నెట్‌వర్క్ మరింత బలోపేతం అయింది.
ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, పోస్టల్‌ శాఖను ట్వీట్‌లో అభినందించారు. భారత తపాలా శాఖ సామాజిక సహకారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా  కార్యదర్శి (పోస్ట్స్) శ్రీ వినీత్ పాండే తన సందేశంలో పోస్ట్ ఆఫీసులు గతంలో కంటే చాలా సందర్భోచితంగా మారాయి రాబోయే సంవత్సరాల్లో ఇండియా పోస్ట్‌కి సానుకూలంగా ఉంటుందని అన్నారు. 

 

****


(Release ID: 1762596) Visitor Counter : 255