మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఎన్‌డిడిబిలో నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్ బ్లూప్రింట్‌ను ఆవిష్కరించిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల సహా మంత్రి
Posted On:
07 OCT 2021 6:01PM by PIB Hyderabad
గురువారం ఆనంద్‌లోని ఎన్‌డిడిబిలో జాతీయ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ నమూనా పత్రాన్ని (బ్లూప్రింట్)ను కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ బాల్యాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిడిబి మీనేష్ షా, భారత ప్రభుత్వ డిఎహెచ్‌డి (సి&డిడి) అదనపు కార్యదర్శి వర్షా జోషి,భారత ప్రభుత్వ డిఎహెచ్‌డి (ఎల్‌హెచ్) సంయుక్త కార్యదర్శి ఉపమన్య బసు, విజిటింగ్ పిఎస్ఎ ఫెలో, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం, డాక్టర్ సింధూర గణపతి, జిసిఎంఎంఎఫ్, ఎండి, గుజరాత్‌కు చెందిన వివిధ పాల యూనియన్ల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఎస్ సోధి, ఎన్‌డిడిబి, దాని అనుబంధ సంస్థల సీనియర్ అధికారులు, టిసిఎస్, ఎర్నెస్ట్ & యంగ్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కొందరు సీనియర్ అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా ఇందులో పాలుపంచుకున్నారు.
ఈ రంగ అభివృద్ధికి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలను క్రమబద్ధీకరించేందుకు సంఘటిత ప్రయత్నాలు చేసి ఉంటే వృద్ధి ఇంకా ఎంతో మెరుగ్గా ఉండేదన్నారు. ఎన్‌డిఎల్ఎంను మోహరించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం రైతు సంక్షేమ కేంద్రంగా పెట్టుకోవడమేనన్నారు. ఎన్‌డిఎల్ఎం అమలు తరువాత పశుసంవర్ధక రంగం భారీ పురోగతికి సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఉన్న పశు ఉత్పాదకత, ఆరోగ్యానికి సంబంధించిన సమాచార నెట్‌వర్క్ ఆధారంగా డిఎహెచ్‌డి, డిడిబి సంయుక్తంగా ఈ డిజిటల్ వేదికను అభివృద్ధి చేస్తున్నాయని అన్నారు. సరైన సమాచారం తోడ్పాటుతో పశుసంపద ద్వారా మెరుగైన ఆదాయాన్ని సాధించేందుకు రైతులకు తోడ్పడే , సాంకేతిక తోడ్పాటు కలిగిన వాతావరణాన్ని రైతు కేంద్రంగా సృష్టించాలన్నది లక్ష్యం. పాడి రైతులను వారి జీవనోపాధి వైవిధ్యీకరణ, ఆర్థిక సంక్షేమం లక్ష్యంగా పెట్టుకున్న విభిన్న ప్రత్యామ్నాయ కార్యకలాపాల ద్వారా బహుళ ఆదాయ మార్గాల్లో ప్రోత్సహించడం, భాగస్వామ్యం చేసేందుకు ఎన్‌డిడిబి ప్రేరణను ఇస్తుందని డాక్టర్ బాల్యాన్ అన్నారు.
అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ప్రాముఖ్యతను, లాబాలను వివరిస్తూ, ఈ సాఫ్ట్‌వేర్ ను విజయవంతంగా అమలు చేయవలసిందిగా భాగస్వాములందరికీ వర్షా జోషి విజ్ఞప్తి చేశారు.
అన్ని పశువుల ప్రత్యేక గుర్తింపుకు పునాదిగా ఎన్‌డిఎల్ఎం వ్యవహరిస్తుందని, ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యంతో సహా అన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యక్రమాలకు మూల స్తంభం అవుతుందని చెప్పారు. విస్త్రత స్థాయిలో భాగస్వాములను ఈ వాతావరణంలో అనుసంధానం చేయడం వల్ల ఈ డిజిట్ ప్లాట్‌ఫాం ద్వారా రైతు తాను ఎక్కడ ఉన్నా, తమ పెట్టుబడి ఎంతైనా మార్కెట్లలోకి ఎటువంటి ప్రయాస లేకుండా ప్రవేశించగలరు. ఈ వ్యవస్థలో బలమైన, ఆరోగ్యకరమైన జంతువుల పెంపకం, పోషణ వ్యవస్థలు, వ్యాధి పర్యవేక్షణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, జంతువులు, జంతు ఉత్పత్తులను గుర్తించదగిన విధానం కూడా ఉంటాయి.
ఆనంద్‌లోని జకారియాపురా గ్రామంలో ఎన్‌డిడిబి ఎరువుల నిర్వహణ చొరవను డాక్టర్ బాల్యాన్ దర్శించారు. జకారియాపురా గ్రామంలో రైతులతో సంభాషిస్తూ, బయోగ్యాస్ ప్లాంట్ల నూతన సాంకేతికతను ఆమోదించినందుకు వారిని ప్రశంసించారు. దీని ద్వారా ఉత్పత్తి అయిన బయో వ్యర్ధాలను రైతులు తమ స్వంత పొలాలలో ఉపయోగించుకుంటారు. అదనపు బయో వ్యర్ధాలను ఇతర రైతులకు అమ్మడం లేదా వాటిని సేంద్రీయయ ఎరువులుగా మార్చడం చేస్తారు. బోర్సాద్‌లోని వాస్నాలోని వ్యర్ధాల శుద్ధి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్‌డిడిబి సుధాన్ ట్రేడ్ మార్క్ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే బ్రాండ్ గుర్తింపును సృష్టించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు, బయోగ్యాస్ ఉపయోగించే మహిళలందరూ కూడా కట్టెలపై వండేందుకు వాటిని సేకరించడం, తత్సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గినట్టుగా పేర్కొన్నారు.
ఎన్‌డిడిబికి చెందిన ఆధునిక ఓవం పికప్ & ఇన్‌విట్రో ఎంబ్రియో ప్రొడక్షన్ (ఒపియు-ఐవిఇపి) కేంద్రాన్ని కేంద్ర మంత్రి దర్శించినప్పుడు భారతీయ పశు జనాభాలో జన్యుపరమైన మెరుగదల, ఉత్పాదకత పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టడం అన్నది కీలక అంశంగా నిలిచింది.
.
*****
(Release ID: 1762004)
Visitor Counter : 281