వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కేరళ నుండి ఆస్ట్రేలియాకు జాక్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ & జాజికాయల (జైఫల్) నుండి సేకరించిన విలువ ఆధారిత ఉత్పత్తుల మొదటి ఎగుమతిని ప్రారంభించిన ఏపీఈడీఏ
Posted On:
06 OCT 2021 4:19PM by PIB Hyderabad
కేరళ రాష్ట్రం త్రిసూర్‌లోని రైతుల నుండి సమీకరించిన జాక్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్, జాజికాయలను (జైఫల్) మూలాధారంగా పొందిన.. పోషకాలు అధికంగా ఉన్న ఉత్పత్తుల మొదటి ఎగుమతులను.. ఆస్ట్రేలియాలో గల మెల్‌బోర్న్ నగరానికి ఎగుమతి చేసేందుకు 'అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ' (ఏపీఈడీఏ) తగు చర్యలు చేపట్టింది. ఈ ఉత్పత్తులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉంటాయి. 2021-22 నాటికి 400 బిలియన్ డాలర్ల సరుకుల ఎగుమతులను సాధించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యంలో భాగంగా ఏపీఈడీఏ విలువ ఆధారిత మరియు ఆరోగ్య ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. నిన్న జరిగిన ఎగుమతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీఈడీఏ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు మరియు కేరళ వ్యవసాయ శాఖ డైరెక్టర్ టి.వి. సుభాష్, ఎగుమతిదారు మరియు దిగుమతిదారులతో పాటు ఏపీఈడీఏకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ యుగంలో వినియోగదారుల ప్రాధాన్యత ఎక్కువగా ఆరోగ్యవంతమైన ఆహారం వైపు మళ్లుతోంది. జాక్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ వంటి ఆరోగ్యకరమైన ఎంపికల నుండి తయారు చేసిన గ్లూటెన్ ఫ్రీ ఉత్పత్తులు ఫాస్ట్ ఫుడ్ వినియోగానికి ప్రతిగా ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. పశ్చిమ ఘాట్స్‌లో లభించే జాక్‌ఫ్రూట్‌ను 2018, మార్చిలో కేరళ రాష్ట్రం అధికారిక ఫలంగా ప్రకటించింది. అతి పెద్ద వృక్షం నుంచి లభించే ఈ గ్రాగన్
పండులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి. ఈ ఉష్ణమండల పండు ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండటంతో శాకాహారులు ఎక్కువగా దీనిని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. పండ్లు, విత్తనాలు మరియు గుజ్జు వాడకంతో పాటు, జాక్‌ఫ్రూట్ విత్తులు, ఆకులు, బెరడు, పుష్ఫాలు, రబ్బరు వంటి పండ్లను సాంప్రదాయ ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. పండ్లు-ఆరోగ్యం మరియు పోషక లక్షణాలపై పెరుగుతున్న అవగాహన మరియు దేశ వ్యాప్తంగా జాక్ ఫ్రూట్ రైతులు మరియు పారిశ్రామికవేత్తల నిరంతర ప్రయత్నాలతో రాబోయే సంవత్సరాల్లో జాక్ ఫ్రూట్ కచ్చితంగా అత్యంత ఆదరణ కలిగి| పండుగా మారుతుందని అంచనా వేయబడింది. జాక్ ఫ్రూట్ ఎక్కువగా సింగపూర్, నేపాల్, కతార్, జర్మనీ మొదలైన దేశాలకు ఎగుమతి చేయడబడుతోంది. ప్యాషన్ ఫ్రూట్ అనేది యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఒక పోషకమైన ఉష్ణమండల పండు. ఇది చర్మం, దృష్టి, రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైన ఆరోగ్యకరమైన పోషకాహార ప్రొఫైల్‌తో ప్రయోజనకరమైన పండు. ఈ పండ్లు అందించే గొప్ప పోషకాల కారణంగా రీ మార్కెట్ సామర్థ్యం, అపరిమిత ప్రయోజనాల కారణంగా, దాని వినూత్న ఉత్పత్తులతో ఎగుమతులను విస్తరించడానికి భారీ అవకాశాలు ఉన్నాయి.
***
(Release ID: 1761565)
Visitor Counter : 217