రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్ వే ఉద్యోగుల‌ కు 2020-21 ఆర్థిక సంవత్సరాని కి గాను ఉత్పాద‌క‌త‌ తో ముడిపెట్టిన బోన‌స్ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 06 OCT 2021 3:41PM by PIB Hyderabad

అర్హత కలిగిన నాన్- గజెటెడ్ రైల్ వే ఉద్యోగులు అందరికీ (ఆర్ పిఎఫ్/ఆర్ పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2020-21 ఆర్థిక సంవత్సరాని కి 78 రోజుల వేతనం తో సమానమైనటువంటి ఉత్పాదకత ఆధారిత బోనస్ (పిఎల్ బి) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

 

రైల్ వే ఉద్యోగుల కు 78 రోజుల పిఎల్ బి చెల్లింపు తాలూకు ఆర్థిక భారం 1984.73 కోట్ల రూపాయలు గా ఉండవచ్చని అంచనా వేయడమైంది. అర్హులు అయిన నాన్- గజెటెడ్ రైల్ వే ఉద్యోగుల కు పిఎల్ బి చెల్లింపునకై నిర్దేశించిన వేతన గణన గరిష్ఠ పరిమితి ప్రతి నెల కు 7,000 రూపాయలు గా ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైల్ వే ఉద్యోగి కి చెల్లించదగిన 78 రోజుల గరిష్ఠ సొమ్ము 17,951 రూపాయలు గా ఉంది.

ఈ నిర్ణయం తో సుమారు గా 11.56 లక్షల మంది నాన్-గజెటెడ్ రైల్ వే ఉద్యోగుల కు లబ్ధి ని పొందేందుకు ఆస్కారం ఉంది. అర్హులైన రైల్ వే ఉద్యోగుల కు ప్రొడక్టివిటీ లింక్ డ్ బోనస్ (పిఎల్ బి) ని ప్రతి ఏటా దసరా/పూజ తాలూకు సెలవు దినాల కంటే ముందు గానే చెల్లించడం జరుగుతోంది. మంత్రిమండలి తీసుకొన్న ఈ నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడాను సెలవు దినాల కంటే ముందే అమలు పరచడం జరుగుతుంది.

 

2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 మధ్య కాలాని కి గాను 78 రోజుల వేతనం తాలూకు పిఎల్ బి రాశి ని చెల్లించడం జరిగింది. 2020-21 సంవత్సరానికి కూడాను 78 రోజుల వేతనాని కి సమానం అయినటువంటి పిఎల్ బి మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. దీని తో ఉద్యోగులు రైల్ వేస్ పనితీరు ను మెరుగు పరచే దిశ లో పాటుపడటానికి, వారికి ప్రేరణ లభిస్తుంది అని ఆశించడమైంది.

 

రైల్ వే లో ఉత్పాదకత తో ముడిపెట్టిన బోనస్ అనేది యావత్తు దేశం లో విస్తరించి ఉన్నటువంటి అందరు నాన్-గజెటెడ్ రైల్ వే ఉద్యోగుల కు ( ఆర్ పిఎఫ్/ఆర్ పిఎస్ఎఫ్ సిబ్బంది ని మినహాయించి ) వర్తిస్తుంది.

 

పిఎల్ బి ని లెక్కకట్టేందుకు అనుసరించే పద్ధతి:

 

సి)   2000వ సంవత్సరం సెప్టెంబర్ 23న జరిగిన మంత్రివర్గ సమావేశం లో ఆమోదించిన సూత్రం ప్రకారం, 1998-99 సంవత్సరాలు మొదలుకొని 2013-14 మధ్యకాలాని కి (కేపిటల్ వెయిటేజి, సిబ్బంది సంఖ్య ల విషయం లో స్వల్ప మార్పులు చేపట్టినటువంటి 2002-03 మొదలుకొని 2004-05 మధ్య కాలం మినహా) పిఎల్ బి ని చెల్లించడమైంది. ఈ ఫార్మూలా ఇన్ పుట్ : అవుట్ పుట్ ఆధారితం గా ఉండింది, దీని లో అవుట్ పుట్ ను మొత్తం టన్ను కిలోమీటర్ ల రూపం లో లెక్కించడం జరిగింది. ఇన్ పుట్ ను నాన్-గజెటెడ్ ఉద్యోగుల తాలూకు కేపిటల్ వెయిటేజ్ ద్వారా సవరించిన సంఖ్య (ఆర్ పిఎఫ్/ఆర్ పిఎస్ఎఫ్ సిబ్బంది ని వదలిపెట్టి ) రూపం లో అంచనా కట్టడమైంది.

 

బి) 2012-13 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనానికి సమానమైన పిఎల్ బి ని ఒక ప్రత్యేక కేసు గా ఒక షరతు తో ఆమోదించడం జరిగింది. ఆ షరతు ఏమిటి అంటే- అది ఆరో సిపిసి సిఫారసుల ను మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయాల ను దృష్టి లో పెట్టుకొని పిఎల్ బి సంబంధిత సూత్రాన్ని మార్చడం జరుగుతుంది- అన్నదే. దీని పర్యవసానం గా, రైల్ వేస్ మంత్రిత్వ శాఖ ఒక కొత్త సూత్రాన్ని తయారు చేయడం కోసం ఒక సంఘాన్ని ఏర్పరచింది.

 

  • ) 2000 సంవత్సరం తాలూకు ఫార్ములా మరియు ఆపరేశన్ రేశియో (ఒఆర్) పైన ఆధారపడ్డ డై న్యూ ఫార్ములా రెండిటి వెయిటేజి 50:50 నిష్పత్తి లో ఉండవచ్చు అంటూ సంఘం సిఫారసు చేసింది. ఈ ఫార్ములా భౌతిక కొలమానాల సందర్బం లోను, ఆర్థిక కొలమానాల రూపం లోను ఉత్పాదకత తాలూకు సమాన ప్రతినిధిత్వాన్ని సూచించింది. సంఘం సిఫారసు చేసిన సూత్రాన్ని అనుసరించి 2014-15 మొదలుకొని 2019-20 వరకు పిఎల్ బి ని లెక్కించడమైంది.

 

పూర్వరంగం:

 

రైల్ వేస్ 1979-80 సంవత్సరం లో పిఎల్ బి భావన ను ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వ తొలి విభాగ సంస్థ గా ఉంది. ఆ కాలం లో ఆర్థిక వ్యవస్థ పనితీరు లో మౌలిక సదుపాయాల పరంగా సమర్థన ను ఇవ్వడం లో మొత్తంమీద రైల్ వే యొక్క మహత్వపూర్ణ పాత్ర ను ప్రధానం గా పరిగణన లోకి తీసుకోవడమైంది. బోనస్ కు బదులు పిఎల్ బి అనే భావన ను ప్రవేశపెట్టడం వాంఛనీయం అని తలపోయడం జరిగింది. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్-1965 రైల్ వేస్ కు వర్తించకపోయినప్పటికీ, ఆ చట్టం లో పేర్కొన్న విస్తృత సిద్దాంతాల ను ‘‘వేతనం/ పే సీలింగ్’’, ‘జీతం/ వేతనం’’ నిర్వచనం మొదలైన వాటిని నిర్ధారించే ఉద్దేశ్యం తో దృష్టి లో పెట్టుకోవడం జరిగింది. గుర్తింపు కలిగిన రెండు సమాఖ్య లు అయినటువంటి ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేశన్ మరియు నేశనల్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియన్ రైల్ వేమెన్ లతో సంప్రదింపులను జరిపిన మీదట రైల్ వేస్ కోసం పిఎల్ బి స్కీము ను రూపొందించి, మరి ఆ తరువాత మంత్రిమండలి ఆమోదం తో ఆ పథకాన్ని 1979-80 సంవత్సరం నుంచి అమలు లోకి తీసుకు రావడమైంది. ఈ పథకం పై ప్రతి మూడు సంవత్సరాల కు ఒకసారి ఒక సమీక్ష ను చేపట్టాలనే సంగతి ని ప్రస్తావించడమైంది.

 

 

***

 

 



(Release ID: 1761501) Visitor Counter : 203