నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

భారతదేశ క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థలో అవకాశాలు అనే అంశంపై నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహకారంతో న్యూయార్క్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్

Posted On: 25 SEP 2021 9:58AM by PIB Hyderabad

భారతదేశ క్లీన్  ఎనర్జీ ఆర్థిక వ్యవస్థలో కలిసి పనిచేయడానికి గల అవకాశాలు అనే అంశంపై నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహకారంతో   ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐక్యరాజ్య సమితి ఇంధన రంగం 2021 పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనిని నిర్వహించారు. నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి కౌన్సిల్ ఆన్ ఎనర్జీఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ సహకారం అందించింది. 

2030 నాటికి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను ఈ వెబినార్ లో వివరంగా వివరించారు. ప్రజా ప్రయోజనాలను ప్రాధాన్యత ఇస్తూ ఇంధన వినియోగంలో మార్పులు తీసుకుని రావడానికి  అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో క్లీన్ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఈ కార్యక్రమంలో వివరించారు. అంతర్జాతీయంగా అమలు జరుగుతున్న విధానాలను భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడంసాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో అంతర్జాతీయ సహకారం, పెట్టుబడులు, మార్కెట్ల గుర్తింపు లాంటి ప్రధాన అంశాలను దీనిలో ప్రధానంగా ప్రస్తావించారు. 

కార్యక్రమంలో కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధనమరియు రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఇంధన రంగంపై కుదిరిన పారిస్ ఒప్పందం కింద నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే దిశలో భారతదేశం సాగుతున్నదని మంత్రి అన్నారు. పారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరులను ఉపయోగిస్తూ స్థాపిత శక్తిలో 40 శాతం ఉత్పత్తిని సాధించి, ఉద్గారాల తీవ్రత స్థాయిని 2005 స్థాయిల కంటే 33-35 శాతం మేరకు తగ్గించవలసి ఉంటుంది. 

సమావేశానికి హాజరైన బ్రెజిల్ అంబాసిడర్ ఆండ్రే అరన్హా కొరియా డో లాగో, డెన్మార్క్ రాయబారి ఫ్రెడ్డీ స్వనే లు క్లీన్ ఎనర్జీ రంగంలో భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలుపర్యావరణ పరిరక్షణకు అమలు జరుగుతున్న చర్యలకు తమ దేశాల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు.  పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకోవడానికి గల అవకాశాలను వారు చర్చించారు. ఇంధన వినియోగంలో మార్పులు తీసుకుని రావడానికి ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న ప్రయత్నాల్లో బ్రెజిల్, డెన్మార్క్ అగ్రస్థానంలో ఉన్నాయి. 

హేతుబద్ధమైన ధరలకు విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉండే శాశ్వత ఇంధన వనరులను అందించడానికి ప్రజా సంక్షేమం ప్రాతిపదికగా భారతదేశంలో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితిలో  భారత శాశ్వత మిషన్ అంబాసిడర్  శ్రీ టి. ఎస్. తిరుమూర్తి అన్నారు. సమావేశానికి  పంపిన వీడియో సందేశంలో  ఆయన అంతర్జాతీయ సహకారంతో లక్ష్య సాధనకు భారతదేశం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.  పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను నూతన మరియు  పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇందు శేఖర్ చతుర్వేది వివరించారు. 

ఇంధన రంగ అంశాలపై ఇక్యరాజ్యసమితి కి భారతదేశానికి చెందిన ప్రభుత్వ ప్రైవేట్ రంగ భాగస్వాములు, భారత ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలతో రూపొందించిన డాక్యుమెంటరీ ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. భారత ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు బయోఎనర్జీపునరుత్పాదక శక్తివిద్యుత్ఇ-మొబిలిటీటెలికాంవినియోగదారుల వస్తువులు మరియు ఎఫ్‌ఎంసిజిఆహారంసేవలు స్మార్ట్ సిటీలపై ప్రతిపాదనలను సమర్పించాయి. 

 రైల్వే మంత్రిత్వ శాఖ, ఎన్ టీ పీ సి ;  రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్;  మరియు స్మార్ట్ నగరాలుగా ఎంపికైన  అయోధ్య ( ఉత్తర ప్రదేశ్),  ఇండోర్( మధ్యప్రదేశ్)  న్యూ టౌన్ కోల్‌కతా (పశ్చిమ బెంగాల్),  పింప్రి-చించ్ వాడ( మహారాష్ట్ర),  రూర్కెలా( ఒడిశా) సూరత్( గుజరాత్) ల నుంచి ప్రతిపాదనలు పంపాయి. 

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్,  ఏథర్ ఎనర్జీ;  భారతీ ఎయిర్‌టెల్, హైడెల్బర్గ్ సిమెంట్,  ఐటిసి లిమిటెడ్,  జె కె సిమెంట్, పంజాబ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ .;  రెన్యూ పవర్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ కంపనీలు కార్పొరేట్ రంగం నుంచి ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదనలను అందించాయి. 

ఈ కార్యక్రమంలో నూతన మరియు  పునరుత్పాదక ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి దినేష్ డి జగదలే,  అదనపు ప్రధాన కార్యదర్శి,న్యూ టౌన్ కోల్‌కతా గ్రీన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ దేబాషిస్ సేన్న్యూ టౌన్ కోల్‌కతా గ్రీన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సీఈఓ    శ్రీమతి మేఘనా పాల్,స్నామ్ ఇండియా కంట్రీ మేనేజర్ మరియు సీఈఓ డేవిడే సిరెల్లి,  హైడల్ బర్గ్ సిమెంట్ ఇండియామేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ  జంషెడ్ ఎన్. కూపర్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

***



(Release ID: 1758082) Visitor Counter : 158


Read this release in: Hindi , Punjabi , English , Bengali