ఆర్థిక మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 1వ తేదీన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివస్గా పాటించనుంది.
Posted On:
23 SEP 2021 7:58PM by PIB Hyderabad
‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ను పురస్కరించుకొని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) ప్రచారాన్ని ప్రారంభించింది. పెన్షన్, పదవీ విరమణపై మరింత ప్రచారాన్ని కల్పించేందుకు అక్టోబర్ 1న తేదీని నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివస్(ఎన్పీఎస్ దివస్)గా పాటిస్తారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల ద్వారా పిఎఫ్‌ఆర్‌డిఎ ‘#npsdiwas’ హ్యాష్ ట్యాగ్ పేరుతో ఈ ప్రచారాన్ని చేస్తోంది.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ మొదలుకొని, స్వయం ఉపాధి నిపుణుల వరకు ప్రతి పౌరుడు పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా మంచి భవిష్యత్తును నిర్ధారించుకోవడానికి, ఆర్థిక పరిపుష్టి పొందడానికి పిఎఫ్‌ఆర్‌డిఎ ప్రణాళిక రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులు ప్రస్తుతం కొన్ని ప్రయోజనాలు పొందడంతోపాటు పదవీ విరమణ తర్వాత అనేక ప్రయోజనాలను పొందుతారు.
‘‘పెన్షన్, పదవీ విరమణ ప్రణాళిక కోసం అక్టోబర్ 1వ తేదీని నేషనల్ పెన్షన్ స్టిస్టమ్ దివస్గా ప్రకటించడం సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో మేమూ పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ ప్రచారం ద్వారా ప్రజలకు పెన్షన్ ప్రణాళికపై మేము అవగాహన కల్పిస్తాము. ఒక పెన్షన్ నియంత్రణ సంస్థగా మేము పెన్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అర్హులైన పౌరులందరినీ పెన్షన్ పథకం కిందకు తీసుకురావడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం”అని పిఎఫ్‌ఆర్‌డిఎ చైర్‌పర్సన్ శ్రీ సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ్ అన్నారు
పిఎఫ్‌ఆర్‌డిఎ గురించి..
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ మరియు డెవలప్‌మెంట్ అథారిటీ అనేది భారతదేశంలో పెన్షన్స్కు సంబంధించి మొత్తం పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న నియంత్రణ సంస్థ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ మరియు డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం 19 సెప్టెంబర్, 2013 న ఆమోదించబడింది. మరియు 1 ఫిబ్రవరి 2014 న నోటిఫై చేయబడింది. ప్రభుత్వ ఉద్యోగులు చందాదారులుగా చేరిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ మరియు డెవలప్‌మెంట్ అథారిటీ నియంత్రిస్తుంది. భారతదేశం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థలు, అసంఘటిత రంగాల ఉద్యోగుల ద్వారా పెన్షన్ మార్కెట్ లో క్రమబద్ధమైన పురోగతిని, అభివృద్ధిని సాధించేలా చర్యలు తీసుకుంటుంది.
***
(Release ID: 1757473)
Visitor Counter : 183