ఆర్థిక మంత్రిత్వ శాఖ
ముంద్రా వద్ద 3004 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. ఎనిమిది మంది అరెస్టు
Posted On:
22 SEP 2021 7:42PM by PIB Hyderabad
దేశంలో హెరాయిన్ అక్రమ రవాణాను నియంత్రించేలా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా డీఆర్ఐ 13.09.2021న రెండు కంటైనర్లను అదుపులోకి తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ నుంచి ఇరాన్ దేశంలోని బాన్‌దర్ అబ్బాస్ నుంచి ముంద్రాకు చేరుకున్న ఈ రెండు కంటైనర్లను డీఆర్ఐ పరీక్షించింది. వాస్తవానికి కంటైనర్లలో
సెమీ ప్రాసెస్డ్ టాల్క్ స్టోన్స్ ఉన్నట్లుగా ప్రకటించబడింది. కానీ 17.09.2021 మరియు 19.09.21వ తేదీలలో ఈ రెండు కంటైనర్ల
వివరణాత్మక పరిశీలన జరిపి వీటి నుండి 2988 కిలోల హెరాయిన్ కనుగొనబడింది. దీనిని అధికారులు స్వాధీనం చేసుకోన్నారు.
హెరాయిన్‌ను ప్రాసెస్ చేయని టాల్క్ పౌడర్‌ను కలిగి ఉన్న జంబో బ్యాగ్‌లలో దాచారు. హెరాయిన్‌ను సంచుల దిగువ పొరలుగా ఉంచబడింది. నిఘా వర్గాలు హెరాయిన్ గుర్తించబడకుండా ఉండటానికి టాల్క్ స్టోన్స్‌తో సంచుల పై భాగం కప్పి ఉంచడమైంది తత్ఫలితంగా, హెరాయిన్‌ను టాల్క్ స్టోన్స్ నుండి వేరు చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. దీంతో న్యూఢిల్లీ, నోయిడా (యుపీ), చెన్నై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, మాండవి, గాంధీధం మరియు విజయవాడలలో తక్షణ తదుపరి కార్యకలాపాలు జరిగాయి.
దీంతో ఢిల్లీలోని ఒక గోడౌన్ నుండి 16.1 కిలోల హెరాయిన్, కొకైన్‌గా అనుమానించబడిన 10.2 కిలోల పౌడర్, నోయిడాలోని ఒక నివాస స్థలం నుండి హెరాయిన్ అని అనుమానించిన 11 కిలోల పదార్ధం రికవరీ చేయడమైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు (4) ఆఫ్ఘన్ జాతీయులను, ఒకరు (1) ఉజ్బెకిస్థాన్ జాతీయుడిని, ముగ్గురు (3) భారత జాతీయులతో పాటుగా మొత్తం ఎనిమిది (8) మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన భారతీయ జాతీయులు సరుకు దిగుమతి చేయడానికి ఉపయోగించే దిగుమతి ఎగుమతి కోడ్ (ఐఈసీ) కలిగి ఉన్నారు. ఒకతడిని చెన్నై, అరెస్టు చేశారు. దీనికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.
(Release ID: 1757211)
Visitor Counter : 243