పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డ్రోన్లు, డ్రోన్ విడిభాగాలకు సంబంధించి పిఎల్ ఐ పథకాన్ని ఆమోదించిన ప్రభుత్వం
Posted On:
15 SEP 2021 6:03PM by PIB Hyderabad
మన సమష్టి దార్శనికత అయిన ఆత్మనిర్భర్‌భారత్‌ను సాకారం చేయడంలో మరో ముందడుగుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, డ్రోన్లు, డ్రోన్ కాంపొనెంట్‌లకు సంబందించి ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది.
డ్రోన్లు ఆర్ధిక వ్యవస్థకు చెందిన అన్ని రంగాలకు అద్బుతమైన ప్రయోజనాలను అందించగలవు. వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, అత్యవసర స్పందన, రవాణా, జియో స్పేషియల్ మ్యాపింగ్, రక్షణ, చట్టం అమలు వంటి వి ఇందులో కొన్నిగా చెప్పుకోవచ్చు. డ్రోన్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉపాధి కల్పించగలవు. అలాగే ఆర్ధిక ప్రగతికి దోహదపడగలవు. ప్రత్యేకించి ఇండియాలో మారుమూల ప్రాంతాలు , చేరుకోవడానికి ఇబ్బందికర ప్రాంతాలను చేరకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.
ఆవిష్కరణల విషయంలో ఇండియా కు గల సంప్రదాయ బలం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అద్భుత ఇంజనీరింగ్ పరిజ్ఞానం, దేశీయంగా వీటికిగల డిమాండ్ వీటిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు 2030 నాటికి ఇండియా గ్లోబల్ డ్రోన్ హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభభుత్వం 2021 ఆగస్టు 25న సరళీకృత డ్రోన్ నిబంధనలు తీసుకురావడంతో దానికి అనుగుణంగా పిఎల్ై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పిఎల్ఐ పథకకకం , కొత్త డ్రోన్ నిబంధనలు భవిష్యత్ డ్రోన్ రంగంలో అధ్బత ప్రగతికి చొదక శక్తిగా ఉపకరించనున్నాయి.
నూతన నిబంధనలు, ప్రోత్సాహపథకం వల్ల రాగల మూడు సంవత్సరాలో డ్రోన్‌లు, డ్రోన్ కాంపొనెంట్‌ల తయారీ పరిశ్రమ లో 5 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. డ్రొన్‌ల తయారీ పరిశ్రమ వార్షిక అమ్మకపు టర్నోవర్ 202021లో 60 కోట్ల రూపాయల నుంచి 2023-24 నాటికి 900 కోట్ల రూపాయలకు పైగా చేరుకోనుంది. డ్రోన్ తయారీ పరిశ్రమ రాగల మూడు సంత్సరాలలో ప్రత్యక్షంగా పదివేల మందికి ఉపాధి కల్పించనుంది.
డ్రోన్ సర్వీసెస్ రంగం ( ఆపరేషన్లు, లాజిస్టిక్, డాటా ప్రాసెసింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ తదితరాలు) చాలా పెద్ద స్థాయిలోని రంగం. ఇది రాగల మూడు సంవత్సరాలలో 30,000 కోట్ల రూపాయలకు పైగా పెరగనుంది. డ్రోన్ సర్వీసుల పరిశ్రమ రాగల మూడు సంవత్సరాలలో 5 లక్షల ఉద్యోగాలను కల్పించనుంది.
డ్రోన్లకు సంబంధించి న పిఎల్ఐ పథకంలోని 15 ముఖ్యమైన అంశాలు
1.డ్రోన్లు, డ్రోన్ కాంపొనెంట్‌లకు సంబంధించి పిఎల్ ఐ పథకానికి కేటాయించిన మొత్తం మూడు ఆర్దిక సంవత్సరాలకు 120 కోట్ల రూపాయలు. ఈ మొత్తం 2020-21లో మొత్తం డ్రోన్‌తయారీ సంస్థల టర్నోవర్‌కు దాదాపు రెట్టింపు.
2.డ్రోన్‌లు, డ్రోఓన్ కాంపొనెంట్‌ల తయారీదారులకు ప్రోత్సాహకం వారు చేసిన విలువ జోడింపుకు గరిష్ఠంగా 20 శాతం వరకు ఉంటుంది.
3. విలువ జోడింపును డ్రన్‌లు, డ్రోన్ కాంపొనెంట్‌లకు సంబంధించి వార్షిక అమ్మకాల ఆధారంగా లెక్కకడతారు. ఇందులోనుంచి డ్రొన్లు, డ్రొన్ కాంపొనెంట్‌ల కొనుగోలు ఖర్చు (నెట్ ఆఫ్ జిఎస్‌టి)ను తీసివేస్తారు.
4. పిఎల్ఐ రేటు స్థిరంగా రాగల మూడు సంవత్సరాలు 20 శాతంగా ఉంటుంది. ఇలాంటి సదుపాయం డ్రోన్ పరిశ్రమకు ప్రత్యేకం. ఇతర రంగాలకు చెందిన పిఎల్ ఐ పథకాలలో పిఎల్ ఐ రేటు ప్రతిసంవత్సరం తగ్గుతూ ఉంటుంది.
5. ప్రతిపాదిత పిఎల్ఐ స్కీక్ కాలపరిమితి 2021-22 నుంచి మూడు సంవత్సరాలు. పిఎల్ ఐ పథకం ప్రభావాన్ని పరిశ్రమ వర్గాలతో సంప్రదించి అధ్యయనం చేసిన తర్వాత దానిని పొడిగించడం లేదా తిరిగి పునర్ రూపకల్పన చేయడం చేస్తారు.
6. డ్రోన్‌లు, డ్రోన్ కాంపొనంట్‌లకు సంబంధఙంచి కనీస విలువ జోడింపు నిబంధనను నికర అమ్మకాలపై 50 శాతం బదులు 40 శాతంగా నిర్ణయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇది డ్రోన్ పరిశ్రమకు లభించిన మరో అద్భుత అవకాశం. ఇది లబ్ధిదారుల సంఖ్య పరిధిని పెంచుతుందిఇ.
7. పిఎల్ఐ పథకం కింద ఎన్నో డ్రోన్ కాంపొనెంట్‌లు ఉన్నాయి.
ఎ) ఎయిర్ ఫ్రేమ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ (ఇంజిన్, ఎలక్ట్రిక్) పవర్ సిస్టమ్స్, బ్యాటరీస్, దాని అనుబంధం ఉపకరణాలు, లాంచ్, రికవరీ సిస్టమ్‌లు.
బి) ఇనెర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్, ఇనెర్షియల్ నావిగేషన్ వ్యవస్థ, ఫ్లైట్ కంట్రోల్ మాడ్యూల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, దాని అనుబంధ కాంపొనెంట్‌లు.
సి) కమ్యూనికేషన్ వ్యవస్థలు (రేడియో ఫ్రీక్వెన్సీ, ట్రాన్స్‌పాండర్లు, ఉపగ్రహ ఆధారిత తదితరాలు)
డి) కెమరాలు, సెన్సర్లు, స్ప్రేయింగ్ వ్యవస్థలు, సంబందిత పేలోడ్ తదితరాలు
ఇ) కనిపెట్టే, పక్కకుతప్పించే వ్వవస్థలు, అత్యవసర గాలింపు వ్యవస్థలు, గుర్తింపు వ్యవస్థలు తదితరాలు, ఇతర భధ్రత, రక్షణకు సంబంధించిన కీలక ఉపకరణాలు.
8. అర్హతగల కాంపొనెంట్‌లకు సంబంధించిన జాబితా ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు డ్రోన్ సాంకేతికత విస్తరించే కొద్దీ విస్తరింప చేస్తుంది.
9. ప్రభుత్వం డ్రోన్ సంబంధిత ఐటి ఉత్పత్తులను అభివృద్ధి చేసేవారికి కూడా దీని కవరేజ్‌ని విస్తరింప చేసేందుకు అంగీకరించింది.
10. ప్రభుత్వం అర్హతా నిబంధనను ఎం.ఎస్.ఎం.ఇలకు, స్టార్టప్‌లకు వాటి వార్షిక టర్నోవర్‌ను సాధారణ స్థౄయి డ్రోన్‌లక 2 కోట్ల రూపాయల వరకు డ్రోన్ కాంపొనెంట్లకు 50 లక్షల రూపాయలవరకు ఉంచింది. ఇది లబ్దిదారుల సంఖ్య విస్తరింప చేయడానికి పనికివస్తుంది.
11. నాన్ ఎం.ఎస్.ఎం.ఇ కంపెనీలకు వాటి వార్షిక అమ్మకపు టర్నోవర్‌ను నాలుగు కోట్ల రూపాయల వద్ద ఉంచారు (డ్రొన్లకు), అలాగే డ్రోన్ కాంపొనెంట్‌లకు కోటి రూపాయలుగా నిర్ధారించారు.
12. డ్రోన్‌లు, డ్రోన్ కాంపొనెంట్‌లకు సంబంధించి తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహం వాటి విలువ జోడింపులో ఐదొ వంతుగా కింద సూచించిన నమూనా సంవత్సరం ప్రకారం వివరించడం జరిగింది. ( ఉదాహరణకు 2021-22)
తయారీదారులకు పిఎల్ఐ లెక్కింపు (నమూనాఆర్దిక సంవత్సరం 2021-22)
|
క్లెయిమ్ సంవత్సరం
|
అమ్మకాలు -
జిస్‌టి నికరం (రూ.కో.లో)
|
కొనుగోఓళ్లు)-
జిఎస్‌టిలో నికర( రూ.కో)
|
విలువజోడింపు
(రూ.కో)
|
పిఎల్ఐ
రేటు శాతం
|
పిఎల్ఐబకాయి
(కో.రూ)
|
FY 2021-22
|
100
|
60
|
100–60 = 40
|
20%
|
40 x 20% = 8
|
13. తయారీ దారుకు పిఎల్ఐ పరిమితి మొత్తం వార్షిక పెట్టుబడిలో 25 శాతం వద్ద ముగుస్తుంది. ఇది లబ్ధిదారుల సంఖ్య పెరగడానికి వీలుకల్పిస్తుంది.
14. ఏదైన ప్రత్యేక ఆర్దిక సంవత్సరంలో తయారీదారు విలువ జోడింపు అర్హత ను అందుకోలేకపోతే ఆ మరుసటి సంవత్సరం వారుదానిని బర్తీ చేయగలిగితే . కోల్పోయిన ప్రోత్సాహకాన్ని పొందడానికి వీలు కలుగుతుంది.
15.అంచనా చెల్లింపు షెడ్యూలు కింద సూచించడం జరిగింది.డ్రోన్,
డ్రోన్ కాంపొనెంట్‌లకు పిఎల్ఐ అంచనా చెల్లింపుల షెడ్యూలు
క్లెయిమ్ సంవత్సరం
|
అమ్మకాలు
జిఎస్‌టిలో నికర (రూలో)
|
కొనుగోళ్లు
జిఎస్టిలో నికర( రూ.లో)
|
అర్హతగల
విలువజోడింపు(కో.రూ)
|
విలువజోడింపునకు
పి.ఎల్.ఐ రేటు (శాతం) |
వర్తింపు
పిఎల్ఐ (కో.రూ)
|
చెల్లింపు
సంవత్సరం
|
FY 21-22
|
200
|
120
|
80
|
20%
|
16
|
FY 22-23
|
FY 22-23
|
400
|
240
|
160
|
20%
|
32
|
FY 23-24
|
FY 23-24
|
900
|
540
|
360
|
20%
|
72
|
FY 24-25
|
మొత్తం
|
1500
|
900
|
600
|
20%
|
120
|
డ్రోన్ నిబంధనలు 2021 కి సంబంధించిన 15 ప్రధాన అంశాలు ( 2021 ఆగస్టు 25న నోటిఫై చేసినది)
1.విశ్వసనీయత, నాన్ ఇన్‌ట్రూసివ్ పర్యవేక్షణ ఆధారితంగా
2. పలు పర్మిషన్లు , అనుమతుల రద్దు. సమర్పించవలసిన ఫారమ్‌ల సంఖ్యను 25 నుంచి 5 కు తగ్గింపు. చెల్లించవలసిన రుసుముల రకాలను 72 నుంచి 4కు తగ్గింపు
3. డిజిటల్ స్కై ప్లాట్‌పారం ను వాడకం దారులకు అనుకూలంగా ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థగా అభివృద్ధి.
4. ఇంటరాక్టివ్ డ్రోన్ ఎయిర్ స్పేస్ మ్యాప్, గ్రీన్, ఎల్లో , రెడ్ జోన్ లను 2021 సెప్టెంబర్ 24 నాటికి ప్రదర్శిస్తారు.
5. గ్రీన్ జోన్‌లలో డ్రోన్‌లు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.
6. ఎటిసి పర్మిషన్ అవసరమైన ఎల్లో జోన్ లో ఎయిర్‌పోర్ట్ పరిధిని 45 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లకు తగ్గించడం జరిగింది.
7. రిమోట్ పైలెట్ లైసెన్సు మైక్రోడ్రోన్‌లకు, ( వాణిజ్యేతర వినియోగానికి), అన్ని నానో డ్రోన్లకు అవసరం లేదు.
8. ఏదైనా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సు జారీకి ముందు సెక్యూరిటీ క్లియరెన్సు అవసరం లేదు.
9. డ్రోన్ నిబంధనలు 2021 కింద డ్రోన్ కవరేజ్‌ను 300కేజీలనుంచి 500 కేజీలకు పెంచడం జరిగింది. ఇందులో డ్రోన్ టాక్సీలు కూడా కలిసి ఉన్నాయి.
10. భారతీయ డ్రోన్ కంపెనీల విసయంలో విదేశీ యాజమాన్యం పై ఆంక్షలు లేవు.
11. డిజిసిఎ నుంచి దిగుమతుల క్లియరెన్సులు అవసరం లేదు.
12. అదీకృత డ్రోన్ స్కూల్ నుంచి, పైలెట్ రిమోట్ పైలెట్ సర్టిఫికేట్ అందుకున్న 15 రోజులలోగా డిజిసిఎ రిమోట్ పైలెట్ లైసెన్సు జారీ చేస్తుంది.
13. నిబంధనల ఉల్లంఘనకు గరిష్ఠ పెనాల్టీని లక్ష రూపాయలకు తగ్గింపు. గతంలో పలు లక్షలుగా ఉండేది.
14. కార్గో అందజేతకు డ్రోన్ కారిడార్ల అభివృద్ధి
15. విద్యావేత్తలు, స్లార్టప్‌లు, ఇతర స్టేక్ హోల్డర్లతో డ్రోన్‌ప్రోత్సాహక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.
***
(Release ID: 1755404)
Visitor Counter : 318