భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఓఎన్‌జీసీ త్రిపుర పవర్ కంపెనీ లిమిటెడ్ (టార్గెట్) సంస్థ‌ను గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (అక్వైరర్) కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆమోదం


Posted On: 09 SEP 2021 7:39PM by PIB Hyderabad

కాంపిటీషన్ యాక్ట్ 2002, సెక్షన్ 31 (1) ప్రకారం ఓఎన్‌జీసీ త్రిపుర పవర్ కంపెనీ లిమిటెడ్ (టార్గెట్) సంస్థ‌ను గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (అక్వైరర్) కొనుగోలు  చేసేందుకు గాను సీసీఐ త‌న ఆమోదం తెలిపింది.  ఈ ప్రతిపాదిత  ఒప్పందం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూపు ఎంటీటీల నుండి అక్వైరర్ ద్వారా టార్గెట్ యొక్క 26 శాతం మేర‌ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కొనుగోలుకు సంబంధించినది. ఈ  ప్ర‌తిపాదిత  కొనుగోలు  పోటీ నియంత్ర‌ణ చట్టం, 2002 సెక్షన్ 5 (ఏ) కిందకు వస్తుంది.

కొనుగోలుదారు (అక్వైర‌ర్‌)

అక్వైరర్ పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్‌జీ) కింద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) గా ఆగస్టు 1984న ఏర్పాటు చేయ‌డ‌మైంది.  అక్వైరర్  పబ్లిక్ రంగంలోని లిస్టెడ్  కంపెనీ, ఈ సంస్థ ట్రేడింగ్‌, ట్రాన్స్‌మిషన్, ఎల్‌పీజీ ప్రొడక్షన్ & ట్రాన్స్‌మిషన్, ఎల్‌ఎన్‌జీ రీ-గ్యాసిఫికేషన్, పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్, ఈ అండ్ పీ, మరియు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, త‌మిళ‌నాడులోని కొన్ని చిన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో వైవిధ్యమైన ఆసక్తులను కలిగి ఉంది.

టార్గెట్‌

టార్గెట్ సంస్థ  చమురు మరియు సహజ గ్యాస్ కార్పొరేషన్ఐఎల్ &ఎఫ్ఎస్  గ్రూప్ మరియు త్రిపుర ప్రభుత్వం (జీఓటీ) మధ్య ఒక స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్‌. సెప్టెంబర్ 18, 2008న, 726.6 MW కంబైన్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ (సీసీజీటీ) అమలు చేయడానికి వాటాదారుల ఒప్పందం (ఎస్‌హెచ్ఏ) లోకి ప్రవేశించడం ద్వారా ఇది ఏర్పడింది.  ఇది  త్రిపురలోని పాలతనలో థర్మల్ పవర్ ప్లాంట్. టార్గెట్ అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది భారతదేశ చట్టాల కింద ఏర్పాటు చేయబడింది. ఇది ఈశాన్య భారత దేశ ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేలా పైన పేర్కొన్న పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి మరియు విద్యుత్ సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. విద్యుత్ ప్రసారంలో నిమగ్నమైన నార్త్ ఈస్ట్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్‌లో టార్గెట్ 26 శాతం వాటాను కలిగి ఉంది. సీసీఐ  యొక్క వివరణాత్మక ఆర్డర్ వెలువ‌డాల్సి ఉంది.

****



(Release ID: 1754010) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi