సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
"బుజుర్గోంకీ బాత్-దేశ్ కే సాత్" కార్యక్రమం ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కె.రెడ్డి
"గీత గోవింద|పై ఎగ్జిబిషన్, డాక్టర్ ఉత్పల్.కె.బెనర్జీ రచించిన "గీత గోవింద : జయదేవుని భక్తిమార్గం" పుస్తకం విడుదల
ఎల్లప్పుడూ పెద్దల నుంచి నేర్చుకోవాలనే ఆసక్తి గల యువజనాభా గల జాతి భారతదేశం : శ్రీ జి.కె.రెడ్డి
యువత శక్తి, పెద్దల అనుభవం దేశాన్ని ముందుకి నడిపించి 2047 నాటికి దేశాన్ని శక్తివంతం చేయగలవు : శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్
Posted On:
07 SEP 2021 8:06PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు :
- యువతకు, 95 సంవత్సరాల వయసు గల, ఆ పైబడిన వయసు గల పెద్దల మధ్య సంభాషణను పెంపొందించే కార్యక్రమం బుజుర్గోంకి బాత్-దేశ్ కే సాత్
- కృష్ణుడు ప్రధానాంశంగా అంబర్, కాంగ్రా సహా పలు రీతుల్లో చిత్రించిన వర్ణచిత్రాలను ప్రదర్శించే వేదిక ఎగ్జిబిషన్
- గీతగోవింద అసలు రచయిత 12వ శతాబ్దికి చెందిన జయదేవ
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గంగాపురం మంగళవారం ఐజిఎన్ సిఏ లో సహాయమంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ తో కలిసి డాక్టర్ ఉత్పల్.కె.బెనర్జీ రచించిన "గీత గోవింద : జయదేవాస్ డివైన్ ఒడిస్సీ" పుస్తకం, "గీత గోవింద" ఎగ్జిబిషన్, "బుజుర్గోంకి బాత్-దేశ్ కే సాత్" కార్యక్రమాలను ప్రారంభించారు.
యువతకు, 95 సంవత్సరాల వయసు గల, ఆ పైబడిన వయస్కులై ఉండి కనీసం 18 సంవత్సరాల పాటు దేశ స్వాతంత్ర్యోద్యమంలో గడిపిన పెద్దలకు మధ్య సంభాషణను పెంచేందుకు ఉద్దేశించిన కార్యక్రమం "బుజుర్గోంకి బాత్-దేశ్ కే సాత్". ఈ కార్యక్రమానికి సంబంధించిన గోష్ఠితో 60 సెకండ్ల కన్నా తక్కువ నిడివి గల వీడియోని www.rashtragaan.in లో అప్ లోడ్ చేస్తారు.
అలాగే కృష్ణుడు ప్రధానాంశంగా అంబర్, కాంగ్రా సహా పలు రీతుల్లో చిత్రించిన వర్ణచిత్రాలను ప్రదర్శించే వేదిక ఎగ్జిబిషన్.
గీత గోవిందాన్ని 12వ శతాబ్దికి చెందిన కవి జయదేవుడు రచించారు.
"ఎల్లప్పుడూ పెద్దల నుంచి వారి అనుభవసారాన్ని నేర్చుకోవాలన్న తపన గల యువకులు గల దేశం భారత్" అని "బుజుర్గోంకి బాత్-దేశ్ కే సాత్" కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. గురు-శిష్య పరంపర కావచ్చు, కుటుంబం పాత్ర కావచ్చు లేదా పని ప్రదేశాల్లో పెద్దలు కావచ్చు..,భారతీయులు ఎప్పుడూ తమ కన్నా వయసులో పెద్ద వారి దగ్గర వారి అనుభవసారాన్ని నేర్చుకోవాలనుకుంటారు. అందుకే "బుజుర్గోంకి బాత్-దేశ్ కే సాత్" కార్యక్రమం ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు.
దేశంలోని యువతరం 95 సంవత్సరాలు లేదా ఆ పైబడిన వయసు గల పెద్దలతో కాలం గడిపి సంభాషించే అరుదైన కార్యక్రమం ఇదని ఆయన అన్నారు. అలా తాము సంభాషించిన సందర్భాన్ని వీడియోగా తీసి వారు అప్ లోడ్ చేస్తే సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాన్ని సమీకృతం చేస్తుంది. మన పెద్దలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగస్వాములను చేసేందుకు ఇది చక్కని వేదిక.
యువతలోని శక్తి, పెద్దల అనుభవం కలగలిసి దేశాన్ని ముందుకు నడిపిస్తాయని, ప్రధానమంత్రి కలలకు అనుగుణంగా 2047 నాటికి దేశాన్ని బలోపేతం చేస్తాయని సహాయమంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ అన్నారు. కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కుటుంబంలోని పెద్దలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన చెప్పారు. కుటుంబ వ్యవస్థలో కుటుంబం ఒక వ్యక్తి అభివృద్ధికి దోహదపడుతుందని, ఆ వ్యక్తి కుటుంబాన్ని, కుటుంబం సమాజాన్ని ముందుకు నడిపించి దేశాన్ని సుసంపన్న సమాజంగా తీర్చి దిద్దగలుగుతారని ఆయన అన్నారు.
మన పెద్దల్లో ఒకరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ఉత్పల్ బెనర్జీ రచించిన గీత గోవిందం- ఒక భక్తి యాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని పుస్తకావిష్కరణ సందర్భంగా శ్రీ జి.కె.రెడ్డి అన్నారు. 12వ శతాబ్దికి చెందిన కవి జయదేవుని రచనలను పూర్తిగా సంగీతాత్మకంగా రచించిన మొదటి పుస్తకం ఇదని తనకు తెలియచేశారని ఆయన చెప్పారు.
గానం, గీతం, సాంప్రదాయిక సంగీతం, శాస్ర్తీయ నృత్యం, సూక్ష్మ పెయింటింగ్, శిల్పం వంటి అనేక రీతుల్లో రూపొందిన గీత గోవిందం మన సంస్కృతిలో ఎన్నో కాలాలను జయించి నిలిచి ఉందని ఆయన అన్నారు. దాన్ని ఇంగ్లీషులోకి అనువదించడం ద్వారా మన సంస్కృతికి, వారసత్వానికి ఎంతో సేవ చేసినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచంతో పంచుకున్నప్పుడే సంస్కృతి అయినా సంప్రదాయం అయినా పది కాలాల పాటు వెలుగొందుతాయని మంత్రి నొక్కి చెప్పారు. అందుకే ఈ అనువాదాన్ని ప్రారంభించడం తనకు ఆనందంగా ఉన్నదన్నారు. జయదేవుని కృష్ణుడు, రాధ మానవ రూపంలో కనిపించి భావోద్వేగాలను ప్రదర్శించే దేవతలు అని ఆయన చెప్పారు. భారతీయ సంస్కృతి, తత్వ శాస్ర్తాల పట్ల లోతైన అవగాహన గల వ్యక్తి మాత్రమే ఇలాంటి అనువాదానికి న్యాయం చేయగలుగుతాడని మంత్రి అన్నారు.
***
(Release ID: 1753119)
Visitor Counter : 196