నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఐఆర్ ఇడిఎకు మద్దతునందించనున్న టిఎఇన్‌జిఇడిసిఒ; ఎంఒయుపై సంతకాలు
प्रविष्टि तिथि:
06 SEP 2021 7:39PM by PIB Hyderabad
పునరావృత ఇంధన ప్రాజెక్టులను అబివృద్ధి చేయడంలో, నిధుల సేకరణలో తన సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ ఇడిఎ - భారతీయ పునరావృత ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్) సో మవారం తమిళనాడు జనరేషన్ & డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఎఎన్‌జిఇడిసిఒ)తో అవగాహనా ఒప్పందంపై (ఎంఒయు) సంతకాలు చేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఇతర ప్రముఖుల సమక్షంలో ఐఆర్ ఇడిఎ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ప్రదీప్ కుమార్ దాస్, టిఎఎన్‌జిఇడిసిఒ సిఎండి రాజేష్ లఖోనీ అవగాహన పత్రంపై సంతకాలు చేశారు.
ఎంఒయు కింద టిఎఎన్‌జిఇడిసిఒకి పునారవృత ఇంధన ప్రాజెక్టు అభివృద్ధి కోసం, బిడ్ ప్రక్రియల నిర్వహణ, అమలు తోడ్పాటుకు సంబంధించి సాంకేతిక నైపుణ్యాలను ఐఆర్ ఇడిఎ అందిస్తుంది. అంతేకాకుండా, ఆర్ధిక నమూనాలను అభివృద్ధి చేయడం ద్వారా టిఎఎన్‌జిఇడిసిఒ రుణ సేకరణకు, మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్ అవగాహనలో తోడ్పాటు, ప్రతిపాదిత రుణ అవసరాలకు సంబంధించిన లిఖిత సేవలు, ప్రీ మార్కెట్ సర్వేల నిర్వహణ, భవిష్య పెట్టుబడిదారులలో ఆసక్తిని పెంపొందించేందుకు రోడ్ షోలను నిర్వహించడంలో ఐఆర్ ఇడిఎ మద్దతును అందించనుంది,
సమర్ధవంతమైన పునరావృత ఇంధన ఏకీకరణ కోసం టిఎఎన్‌జిఇడిసిఒ తగిన బ్యాటరీ స్టోరేజీతో 20,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును, 3,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును, 2,000 మెగావాట్ల గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పైన పేర్కొన్న ప్రాజెక్టులను అంచనా వేసిన రుణం దాదాపు రూ. 1,32, 500 కోట్లు అవసరం అవుతాయి. పునరావృత ఇంధన రంగంలో నాయకత్వం వహిస్తున్న ఐఆర్ ఇడిఎ , పునరావృత ఇంధన ప్రాజెక్టుల ఆర్థిక అవసరాలను నెరవేర్చడంలో ముఖ్య పాత్ర పోషించేందుకు కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 1752748)
आगंतुक पटल : 273