వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఒకదేశం, ఒకే రేషన్ కార్డు’ పథకం మరింత వేగవంతం!


34 రాష్ట్రాల్లో జయప్రదంగా అమలు

నెలసరి సగటుగా దాదాపు 2.2 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు

పక్షంరోజుల్లోనే 15 లక్షలకుపైగా ‘మేరా రేషన్’ యాప్ డౌన్ లోడ్స్.

Posted On: 28 AUG 2021 4:38PM by PIB Hyderabad

  జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.) కింద లబ్ధిదారులకు రేషన్ సరకులు అందించేందుకు ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ‘మేరా రేషన్’... ఒక దేశం, ఒకే రేషన్ కార్డు (ఒ.ఎన్.ఒ.ఆర్.సి.) పథకం కింద ఈ యాప్.ను రూపొందించారు. ప్రత్యేకించి, తరచూ వలసలమీద ఉండే లబ్ధిదారులకు గరిష్టస్థాయిలో రేషన్ కార్డు పోర్టబిలిటీ ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా ఈ యాప్ రూపొందింది.  2021 మార్చి 12న ఈ యాప్.ను ఆవిష్కరించినప్పటినుంచి ఇప్పటివరకూ గూగుల్ ప్లే స్టోర్.నుంచి 15లక్షలకుపైగా డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 

   కేంద్ర ఎన్.ఐ.సి. యూనిట్ సాంకేతిక సహాయంతో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఈ యాప్.ను రూపొందించింది. ఒక దేశం, ఒకే రేషన్ కార్డు, ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి అనేక ఉపయోగకరమైన అంశాలతో ఈ యాప్ తయారైంది. లబ్ధిదారులతో మరింత మెరుగైన అనుసంధానానికి, వారికి గరిష్ట స్థాయి ప్రయోజనాలు అందించడానికి వీలుగా ఈ యాప్.ను 12 భాషల్లో అందుబాటులో ఉంచారు. ఇంగ్లీష్, హిందీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, బంగ్లా భాషల్లో యాప్.ను తీసుకువచ్చారు. యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ఈ యాప్.ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా లబ్ధిదారులకు ఈ కింది ప్రయోజనాలు, సేవలు అందుబాటులో ఉంటాయి. :

https://ci5.googleusercontent.com/proxy/DwtNJvl4G0L2udv4ko6wO0g-t78V0hKBOACE_jDB-tVQ8WXp2W9dy1eo_yuKv5_qH8vp1aCK6U8MVIBhJVB4E_mSiru_sDGODnOKyJG5qdLFu7S3SGOAfoHdwg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZU9P.png

  యాప్ కోసం కేంద్ర స్థాయినుంచి ప్రోత్సాహం అందించిన కేంద్రం, ఇందుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా పలు సూచనలు జారీ చేసింది. ఈ మొబైల్ యాప్.పై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని, ప్రజలకు అవగాహకన కల్పించాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనం పొందే వలస కూలీలకు ఈ యాప్ ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి, వారు తమతమ అర్హతా వివరాలను, ఇటీవలి లావాదేవీలను, ఆధార్ సీడింగ్ పరిస్థితిని, జాతీయ స్థాయి పోర్టబిలిటీకి తమకున్న అర్హతను గురించి తెలుసుకునేందుకు వీలుగా యాప్ లో తగిన ఏర్పాట్లు చేశారు. ఒ.ఎన్.ఒ.ఆర్.సి. పథకం కింద స్వచ్ఛందంగా పేర్లను నమోదు చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు. తమకు సమీపంలో చవుక ధరల దుకాణం ఎక్కడుందో తెలుసుకునే ఏర్పాటును ఈ యాప్.లో పొందుపరిచినందున తరచూ వలసలపై జీవనం సాగించే లబ్ధిదారు ఎవరైనా సరే, తానున్న కొత్త ప్రాంతంలో, తనకు సమీపంలో చవుక ధరల దుకాణాలు ఎక్కడున్నాయో తెలుసుకుని, అతి సమీపంలోని రేషన్ షాపును చేరుకునేందుకు మ్యాప్ సూచనలను అనుసరించేందుకు, తద్వారా ఆహార ధాన్యాలను పొందేందుకు వీలుంటుంది.

  2020 డిసెంబరు నాటికి 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్న ఒ.ఎన్.ఒ.ఆర్.సి. పథకం ఇపుడు అదనంగా మరో రెండు రాష్ట్రాల్లో కూడా అమలులోకి వచ్చింది. 2021 ఆగస్టు నాటికి ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా అమలులోకి వచ్చింది. దీనితో ఈ పథకం 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది. దాదాపు 75కోట్ల మంది జనాభాకు దీన్ని వర్తింపజేస్తున్నారు. (అంటే,.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనం పొందే జనాభాలో ఏకంగా 94.3శాతం మందికి పథకం వర్తింస్తోందన్నమాట.) ఇక మిగిలిన అస్సాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాలుకూడా రాబోయే కొన్ని నెలల్లోనే ఒ.ఎన్.ఒ.ఆర్.సి. కార్యక్రమ పరిధిలోకి రాబోతున్నాయి. దీనికి తోడు వివిధ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 2కోట్ల 20లక్షలమేర పోర్టబిలిటీ లావాదేవీలు నిర్విరామంగా నమోదవుతూ వస్తున్నాయి. లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా చవుక ధరలపై ఆహార ధాన్యాలను సబ్సిడీ ప్రయోజనంతో అందించే ప్రక్రియ అమలవుతూ వస్తోంది. 

 

https://ci3.googleusercontent.com/proxy/yClLXDN0Zp1vvuZ6FCsGlhqCP5-zOJ4vu4mhM20_CLXX6yDTbtDeww_1WJNZ2Q5_55lNKd9Ezx0-O3-uxjIZELyqGySNdki16ay7-DDJvh_UbhYh4e2ot3JVxA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PG5S.jpg

ఒక దేశం ఒకే రేషన్ (ఒ.ఎన్.ఒ.ఆర్.సి.) అనేది జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.) కింద చేపట్టిన బృహత్తర పథకం. ఎన్.ఎఫ్.ఎస్.ఎ. కింద అర్హులైన లబ్ధిదారులందరికీ నిరాటంకంగా సబ్సిడీతో కూడిన ఆహార భద్రతను కల్పించేందుకు ఈ పథకం చేపట్టారు. వారు దేశంలో ఎక్కడున్నా సరే...వారికి ఆహార సబ్సిడీ ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యం.

  ఎన్.ఎఫ్.ఎస్.ఎ. లబ్ధిదారులు దేశంలో ఎక్కడున్నా వారికి సాధికారత కల్పించి, ఆహార భద్రతతో స్వావలంబన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. దేశంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే రేషన్ కార్డు ద్వారా, బయోమెట్రిక్, ఆధార్ సీడింగ్.తో  తమ వాటా సబ్సిడీ ఆహార ధాన్యాల్లో కొంతభాగాన్ని అయినా పొందేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీనికి తోడు వారి ఇంటివద్దనున్న వారి కుటుంబ సభ్యులు కూడా తమవాటాలో మిగిలిన ఆహార ధాన్యాలను అదే రేషన్ కార్డుపై పొందేందుకు వీలు కల్పించారు.

   వలస కూలిలకు ఆహార భద్రతాపరమైన సాధికారత కల్పించే ఒ.ఎన్.ఒ.ఆర్.సి. పథకం ప్రత్యేక  స్వభావం కారణంగా, ఇది ఆత్మనిర్భర భారత్ అభియాన్ లో ఒక భాగంగా మారింది. ప్రధానమంత్రి పేర్కొన్నట్టుగా సాంకేతిక పరిజ్ఞానం సారథ్యంలో నడిచే సంస్కరణల వ్యవస్థగా ఇది రూపుదిద్దుకుంది.

https://ci3.googleusercontent.com/proxy/lMdRmpzbiim3--xWzTn6dyi30_lUZqssSpTosOrJ66VW1OZLudzMUhKy7ESQ40iTK9EeQPWHNGVEuWBWGkus4lj5ckH1B7_iUeUXxQocX1YvnK0-tNdPKToSUw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003QFFV.jpg

  ఒ.ఎన్.ఒ.ఆర్.సి. పథకానికి దేశవ్యాప్త పోర్టబిలిటీ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సంస్కరణలను అమలు చేసే ప్రక్రియను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రారంభించింది. కేంద్ర పథకంలో సమగ్ర భాగంగా ఈ సంస్కరణలు చేపట్టింది.

 ‘ప్రజా పంపిణీ వ్యవస్థ సమగ్ర నిర్వహణా వ్యవస్థ (ఐ.ఎం.-పి.డి.ఎస్.)’ను 2018 ఏప్రిల్ నుంచి చేపట్టారు. మొత్తం రూ.127.30కోట్ల పెట్టుబడితో పథకం అమలవుతోంది. ప్రస్తుతం పథకాన్ని అమలుచేసే వ్యవధిని 2022 మార్చి 31వరకూ పొడిగిస్తూ ఆర్థిక స్థాయీ సంఘం (ఎస్.ఎఫ్.సి.) నిర్ణయం తీసుకుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఎలాంటి హెచ్చింపు లేకుండా ఈ గడువును పొడిగించారు.

   దేశంలోని ఆహార భద్రతా చట్టంకింద దాదాపు 80కోట్లమంది లబ్ధిదారులూ తామెక్కడున్నా సమ ప్రయోజనాలు పొందేందుకు ఒ.ఎన్.ఒ.ఆర్.సి. సదుపాయం కల్పిస్తున్నప్పటికీ, జీవనంకోసం, ఉపాధిని వెతుక్కుంటూ, వలసలపై తిరిగే లబ్ధిదారులు ప్రజాపంపిణీ వ్యవస్థతో అనుసంధానమయ్యేలా చూడటమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఎక్కవగా దినసరి కూలీలు, చెత్తను సేకరించేవారు, వీధుల్లో ఉండేవారు, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని తాత్కాలిక కార్మికులు, ఇంటి పనిమనుషులు వంటి వారిని ప్రజాపంపిణీ వ్యవస్థతో అనుసంధానానిస్తారు. ఈ పథకం ద్వారా వారు ఈపోస్ సదుపాయం కల్గిన ఏదైనా రేషన్ దుకాణంనుంచి ఆహార ధాన్యాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రతి చవుక ధరల దుకాణాల్లో ఈపోస్ పరికరాలు అందుబాటులో ఉంచడం, లబ్ధిదారుల డిజిటల్ రేషన్ కార్డుకు ఆధార్ సీడింగ్ చేయడం అవసరం.

 ఇక, ఎంతో ప్రభావశీలమైన ఈ కార్యక్రమాన్ని గురించి ప్రచారం చేయడం, అవగాహన కల్పించడం తదితర అంశాలపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాగాలకు బాధ్యతను అప్పగించారు. దీనితో లబ్ధిదారుల గుర్తించడం, ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల బాధ్యతగా మారింది. వీటన్నింటికీ తోడుగా, కార్యక్రమానికి ప్రోత్సాహం, లబ్ధిదారులను చేరువగా కార్యక్రమాన్ని తీసుకెళ్లడం, ఒ.ఎన్.ఒ.ఆర్.సి. పథకంపై అవగాహన కల్పించడం వంటి కార్యకలాపాలను కూడా ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఎప్పటికప్పుడు చేపడుతూ వస్తోంది.  ఈ విషయంలో ప్రజాపంపిణీ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో క్రమం తప్పకుండా సమన్వయం చేసుకుంటూ పోతోంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఇతర సంస్థలతో క్రమం తప్పకుండా సమన్వయం చేసుకుంటోంది. ఇందుకు సంబంధించి వివిధ భాషల్లో సమాచార, ప్రచార సామగ్రిని మైగవ్ (MyGov -MeitY), తదితర సంస్థల మద్దతుతో ఆహార, ప్రజాపంపిణీ శాఖ రూపొందించింది. ఇలా రూపొందించిన సమాచార, ప్రచార సామగ్రిని,  వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది. సామాజిక మాధ్యమాలు, వెబ్ సైట్లు, పోర్టల్స్ తదితర మాధ్యమాల ద్వారా కూడా పంపిణీ జరిగింది. ఇక, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రత్వ శాఖ ఆధ్వర్యంలోని పి.ఎం. స్వనిధి పథకం పరిధిలో కూడా ఒ.ఎన్.ఒ.ఆర్.సి.ని అమలు చేస్తున్నారు.

https://ci3.googleusercontent.com/proxy/HAuOkRQNxHZ9IPM_IKohx9I3Ork4MHtEA7kZQSdIV8pozihGZFkxQ3oC6sey6NuxUnQfHzVBnUz312DMvMdwoVVp_6TS7M8TUQDA-QPgUQ9oPumZC-fHHxuJPQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H24P.jpg

ఒ.ఎన్.ఒ.ఆర్.సి. పథకంపై ప్రచారం కోసం ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను కూడా క్రమం తప్పకుండా  వినియోగిస్తున్నారు. హిందీతోపాటుగా, మరో పది ప్రాంతీయ భాషల్లో రేడియో ఆధారిత ప్రచార ఉద్యమాన్ని ప్రజా పంపిణీ శాఖ చేపడుతోంది. ప్రధానమంత్రి సందేశాన్ని తెలియజేస్తూ, 167 ఎఫ్.ఎం. రేడియో చానళ్లు, 91 కమ్యూనిటీ రేడియో స్టేషన్లలో బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ కమ్యూనికేషన్ (బి.ఒ.సి.) ద్వారా ప్రచారం చేపట్టారు. వలస కూలీల జనాభాకు అవగాహన కలిగించే కృషిలో భాగంగా, భారతీయ రైల్వే శాఖ మద్దతుతో ఆడియో స్పాట్లు, దృశ్య, శ్రవణ  స్పాట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దేశంలోని 2,400 రైల్వే స్టేషన్లలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘శ్రామిక్ స్పెషల్” రైళ్లతో సహా, పలు రైళ్లలో ప్రయాణించే వలస కూలీల అవగాహన కోసం ఈ ప్రచారం చేపట్టారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వహణలోని బస్సుల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని అదనంగా చేపట్టారు.

  మరో వైపు, 14445 అనే టోల్ ఫ్రీ నంబరును ఒ.ఎన్.ఒ.ఆర్.సి. కార్యకలాపాలకోసం, సమాచారాన్ని పంపిణీ చేయడం కోసం, రేషన్ కార్డుల పోర్టబిలిటీ అంశాలకోసం వినియోగించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. మరో వైపు,..వలసపై తిరిగే లబ్ధిదారులను ఒ.ఎన్.ఒ.ఆర్.సి. కింద నమోదు చేసేందుకు వెబ్ ఆధారిత సదుపాయాన్ని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ రూపొందించింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్.తో కలసి ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. వలస లబ్ధిదారుల ప్రయోజనాల కోసం,.. ఇందుకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్.ను కూడా ఖరారు చేస్తున్నారు.

 

ఒక దేశం, ఒకే రేషన్ కార్డు (ఒ.ఎన్.ఒ.ఆర్.సి.) పథకం కింద 34 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2021 ఆగస్టు నెలాఖరు వరకూ లబ్ధిదారుల కవరేజీలో ప్రగతి:

నెల/ సంవత్సరం

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థితి

రాష్ట్రాల సంఖ్య

ఎన్.ఎఫ్.ఎస్.ఎ. పరిధిలోని జనాభా

ఆగస్టు 2019

రెండు క్లస్టర్లలో

4 రాష్ట్రాలు:

  • ఆఁధ్రప్రదేశ్, తెలంగాణ (క్లస్టర్-1)
  • మహారాష్ట్ర, గుజరాత్ (క్లస్టర్-2)

4

15.43 కోట్లు.

(19శాతం ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభా)

అక్టోబర్ 2019

మరొ రెండు క్లస్టర్లలో మరో 4 రాష్ట్రాలు:

  • కర్ణాటక, కేరళ (క్లస్టర్-3)
  • హర్యానా, రాజస్థాన్ (క్లస్టర్-4)

8

26.72 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ జనాభాలో 33శాతం)

జనవరి 2020

8 రాష్ట్రాలతో కూడిన ఒకే క్లస్టర్.లో మరో 4 రాష్ట్రాలు. (గోవా, జార్ఖండ్, మధ్యప్రదేశ్,  త్రిపుర) ఏకీకృతం. దీనితో 12 రాష్ట్రాలతో క్లస్టర్ ఏర్పాటు

12

35.12 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 44 శాతం)

మే 2020

మరో 5 రాష్ట్రాలు, (ఉత్తర ప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, దాద్రా-నాగర్ హవేళీ, డామన్-డయ్యూ

17

60 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 74శాతం)

జూన్ 2020

3 రాష్ట్రాలు  (మిజోరాం, ఒడిశా, సిక్కిం.)

20

63 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 77శాతం)

ఆగస్టు 2020

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకాశ్మీర్ తో కలసి 4 రాష్ట్రాలు..( జమ్ము కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్.

24

>65 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 80శాతం)

సెప్టెంబరు 2020

2 కేంద్ర పాలిత ప్రాంతాలు (లఢక్, లక్ష ద్వీప్)

26

>65 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 80శాతం)

అక్టోబరు 2020

2 రాష్ట్రాలు

(అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు)

28

~68.6 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 85శాతం)

నవంబరు 2020

2 కేంద్రపాలిత

ప్రాంతాలు (చండీగఢ్, పుదుచ్చేరి)

30

~68.7 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 80శాతం)

డిసెంబరు 2020

2 రాష్ట్రాలు/ 2కేంద్ర పాలిత ప్రాంతాలు (మేఘాలయ, అండమాన్-నికోబార్ దీవులు)

32

~69 కోట్లు.

((ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 86శాతం)

జూలై 2021

ఒక కేంద్ర పాలిత ప్రాతం

(ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం-ఎన్.సి.ఆర్.)

33

~69 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 86.7శాతం)

ఆగస్టు 2021

ఒక రాష్ట్రం (పశ్చిమ బెంగాల్)

34

74.9 కోట్లు.

(ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 94.3శాతం)

 

 

***


(Release ID: 1750130) Visitor Counter : 1581


Read this release in: English , Hindi , Bengali