ఉక్కు మంత్రిత్వ శాఖ
ఇనుపఖనిజ తవ్వకాలను ప్రారంభించేందుకు ఎన్ఐఎన్ఎల్ కు మద్దతును అందించిన ఎన్ఎండిసి, ఉక్కు మంత్రిత్వ శాఖ
Posted On:
28 AUG 2021 6:59PM by PIB Hyderabad
ఒడిషాలో మైనింగ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్)కు ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎండిసి సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. దీనితో ముచుకుంద మైన్ బ్లాక్‌లో ఇనప ఖనిజాన్ని (ఐరన్ ఓర్) ఎన్ఐఎన్ఎల్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
ఉక్కు మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, డిఐపిఎఎం తోడ్పాటుతో ఎన్ఎండిసిని ఎన్ఐఎన్ఎల్ మద్దతు కోరింది. ఓడిషా రాష్ట్రంలో ఉన్నత శ్రేణి ఇనప ఖనిజం సరఫరాను వేగవంతం చేసేందుకు, సహాయాన్ని అందించేందుకు ఎన్ ఎండిసి - ఎన్ఐఎన్ఎల్‌తో ఎంఒయుపై సంతకాలు చేసింది.
ఎంఎంఐసి జాయింట్ వెంచర్ కంపెనీ అయిన ఎన్ఐఎన్ ఎల్, ఐపిఐసిఒఎల్, ఒఎంసి, ఎన్ఎండిసి, ఇతరులతో కలిసి ఒడిషాలోని జాజ్‌పూర్‌లోని దుబ్రిలో 1.1 ఎంటిపిఎ ఇంటిగ్రేడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇనప ఖనిజాన్ని కాప్టివ్ ప్రొడక్షన్ చేసేందుకు జనవరి 2017లో కంపెనీ మైనింగ్ లైసెన్స్‌ను పొందింది. రాష్ట్రంలో ఇనుము ధాతువు ఉత్పత్తిని పెంచేందుకు రెండేళ్ళపాటు మిలియన్ టన్నుల చొప్పున అమ్మేందుకు, కంపెనీ ఖర్చులకు ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎన్ఐఎన్ఎల్ కు అనుమతి లభించింది.
******
(Release ID: 1750021)
Visitor Counter : 167