ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ టీకాల లభ్యతపై తాజా సమాచారం


రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 59.86 కోట్లకు పైగా డోసులు సరఫరా

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 4.05 కోట్లకు పైగా నిల్వలు, ఉపయోగించని డోసులు/ సరఫరాకు సిద్ధంగా 17.64 లక్షల డోసులు

Posted On: 27 AUG 2021 2:26PM by PIB Hyderabad
 దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం మరింత వేగంగా ఎక్కువ ప్రాంతాల్లో అమలు జరిగేలా చూడడానికి  కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ ఈ ఏడాది జూన్‌ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాలను అందుబాటులోకి తీసుకుని వచ్చి లభ్యతటీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికిటీకా సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించడం జరిగింది.

సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా కోవిడ్ టీకాలను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. టీకా సార్వత్రికరణ కొత్త దశలో దేశంలో ఉత్పత్తి అవుతున్న  టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి వాటిని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నది.

ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.

 

టీకా డోసులు

 

(ఈ నెల 25 నాటికి)

 

పంపిణీ చేసిన డోసులు 

 

59,86,36,380

 

పంపిణీకి సిద్ధంగా ఉన్న డోసులు 

 

17,64,000

 

అందుబాటులోని నిల్వలు

 

4,05,05,746

 

 59.86 కోట్లకు పైగా (58,86,36,380) టీకా డోసులు కేంద్ర ప్రభుత్వం ( ఉచితంగా) మరియు  ప్రత్యక్ష సేకరణ తరగతిలో  ఇప్పటివరకు రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అందాయి. మరో 17.64 లక్షల ( 17,64,000) డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

 

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఉపయోగించడానికి సిద్ధంగా 4.05 కోట్లకు పైగా (4,05,05,746) నిల్వలుఉపయోగించని డోసులు అందుబాటులో ఉన్నాయి.


(Release ID: 1749623)