పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోవాలో విమానయాన మౌలిక సదుపాయాల బలోపేతం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా లేఖ

प्रविष्टि तिथि: 26 AUG 2021 8:00PM by PIB Hyderabad

గోవాలో విమానయాన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని అభ్యర్థిస్తూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డా.ప్రమోద్‌ సావంత్‌కు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా లేఖ రాశారు. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి తగ్గట్లుగా వచ్చే 4-5 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు రూ.20,000 కోట్లను మంత్రిత్వ శాఖ ఖర్చు చేస్తోంది.  

    గోవాలో విమానయాన రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల అమలుపై ప్రభావం చూపుతున్న వివిధ సమస్యలను శ్రీ సింధియా డా.సావంత్‌ దృష్టికి తీసుకొచ్చారు. గోవా విమానాశ్రయంలో సిటీ సైడ్ కార్ పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాల కోసం 20.48 ఎకరాలను మంత్రిత్వ శాఖ చాలాకాలం క్రితం కోరిందని లేఖలో పేర్కొన్నారు. భూ సేకరణ వ్యయాన్ని కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ గోవా ప్రభుత్వానికి చెల్లించింది. అయితే, 15.50 ఎకరాల భూ సేకరణకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అందులోనూ 9.23 ఎకరాలు ఇంకా మంత్రిత్వ శాఖకు అప్పగించలేదు.

***


(रिलीज़ आईडी: 1749404) आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी