సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'న్యూస్‌ఆన్‌ఎయిర్‌' రేడియో ప్రత్యక్ష ప్రసారాల ప్రపంచ ర్యాంకులు


అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఎయిర్‌ న్యూస్‌ 24*7 'మార్నింగ్‌ న్యూస్‌', 'సమాచార్‌ ప్రభాత్‌'

Posted On: 23 AUG 2021 1:08PM by PIB Hyderabad

'న్యూస్‌ఆన్‌ఎయిర్‌' ర్యాంకుల ప్రమాణాలకు ఆసక్తికరమైన నూతన అదనపు హంగుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఎయిర్‌ న్యూస్ 24*7 కార్యక్రమాల ర్యాంకులు కూడా ప్రచురితమయ్యాయి. మార్నింగ్ న్యూస్, సమాచార్ ప్రభాత్, సత్య కే ప్రయోగ్, ఆజ్ సవేరే వంటివి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎయిర్‌ న్యూస్ 24*7 రేడియో కార్యక్రమాలు.

'న్యూస్‌ఆన్‌ఎయిర్‌' యాప్‌లో 'ఆల్‌ ఇండియా రేడియో' ప్రత్యక్ష ప్రసారాలు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రపంచ దేశాల (భారత్‌ మినహా) తాజా ర్యాంకుల్లో తొలి 10 స్థానాల్లోకి న్యూజిలాండ్ తిరిగి వచ్చింది. 10వ స్థానం నుంచి సౌదీ అరేబియాను కిందకు నెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమించింది.

    ప్రపంచవ్యాప్తంగా (భారత్‌ మినహా) ఎయిర్‌ ప్రసారాల ర్యాంకుల్లో జరిగిన ప్రధాన మార్పులను చూస్తే; ఎయిర్‌ త్రిస్సూర్‌, ఎయిర్‌ అనంతపురి మొదటిసారి మొదటి 10 స్థానాల్లోకి రాగా, ఎయిర్‌ కొడైకెనాల్, అస్మిత ముంబయి చోటును కోల్పోయాయి. ఎయిర్‌ చెన్నై రెయిన్‌బో 5వ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోగా, ఎయిర్‌ కోచి ఎఫ్‌ఎం రెయిన్‌బో 5వ ర్యాంకుకు చేరింది.

    ఎయిర్‌ ప్రసారాల ప్రపంచ దేశాల (భారత్‌ మినహా) ర్యాంకుల్లో; వివిధ్‌ భారతి నేషనల్, ఎఫ్‌ఎం గోల్డ్ దిల్లీ, ఎఫ్‌ఎం రెయిన్‌బో దిల్లీ, ఎయిర్‌ కోచి, వివిధ్‌ భారతి బెంగళూరు కార్యక్రమాలు న్యూజిలాండ్‌లో మంచి ఆదరణ పొందాయి. మధ్యప్రాచ్య దేశాల్లో ప్రసిద్ధి చెందడమేగాక, సింగపూర్, హాంకాంగ్, అమెరికాలోనూ ఎయిర్‌ త్రిస్సూర్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. తొలి 10 దేశాల్లోనూ 'వివిధ్‌ భారతి నేషనల్' అత్యంత ఇష్టమైన కార్యక్రమంగా కొనసాగుతోంది.

    'ఆల్ ఇండియా రేడియో'కు చెందిన 240కి పైగా రేడియో ప్రసారాలు 'ప్రసార భారతి' అధికారిక యాప్ అయిన 'న్యూస్‌ఆన్‌ఎయిర్' యాప్ ప్రసార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. 'న్యూస్‌ఆన్‌ఎయిర్' యాప్‌లోని 'ఆల్ ఇండియా రేడియో' ప్రసారాలకు మన దేశంలోనేగాక, ప్రపంచవ్యాప్తంగా 85కు పైగా దేశాలు, 8000 నగరాల్లో పెద్ద సంఖ్యలో శ్రోతలు ఉన్నారు.

    'న్యూస్‌ఆన్‌ఎయిర్' యాప్‌లో ఎయిర్‌ ప్రత్యక్ష ప్రసారాలు అత్యంత ప్రజాదరణ పొందిన అగ్ర దేశాల (భారత్‌ మినహా) జాబితా, 'న్యూస్‌ఆన్‌ఎయిర్' యాప్‌లో 'ఆల్ ఇండియా రేడియో'కు చెందిన ప్రజాదరణ పొంది ప్రసారాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. దేశాలవారీగానూ వివరాలను చూడవచ్చు. ఈ ఏడాది ఆగస్టు 1-15 తేదీల్లో పక్షం రోజుల సమాచారంపై ఆధారపడి ఈ ర్యాంకులను ప్రకటించారు.

***


(Release ID: 1748335) Visitor Counter : 223