అంతరిక్ష విభాగం

ఇస్రో తాజా అత్యాధునిక ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ ఉప‌గ్ర‌హం గురువారం ఉద‌యం ప్ర‌యోగించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌


ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ ఉప‌గ్ర‌హం (ఇఓఎస్‌-03) శ్రీ‌హ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ లోని రెండో ప్ర‌యోగ వేదిక నుంచి ప్ర‌యోగిస్తార‌ని వెల్ల‌డి

Posted On: 11 AUG 2021 7:20PM by PIB Hyderabad

ఇస్రో తాజాగా ప్రయోగించనున్నది అత్యాధునికమైన భూ ప‌రిశీల‌న‌ ఉపగ్రని (ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ ఉప‌గ్ర‌హం) కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);  ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా);  పిఎంఓ,  సిబ్బంది వ్యహారాలుప్రజా ఫిర్యాదులుపింఛన్లుఅణు ఇంధనంఅంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

 

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రోగురువారం శ్రీ‌హ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ ఉప‌గ్ర‌హం (ఇఓఎస్-03)  ఎంతో ఆశావ‌హంగా ప్ర‌యోగించ‌నున్నద‌నిఅది అత్యంత వేగ‌వంత‌మైన ఉప‌గ్ర‌హ‌మ‌ని ఆయ‌న చెప్పారుజిఎస్ఎల్ వి-ఎఫ్ 10 ఉప‌గ్ర‌హ వాహ‌న రాకెట్ ఇఓఎస్‌-03ని జియో సింక్రోన‌స్ ట్రాన్స్ ఫ‌ర్ క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నుంది త‌ర్వాత ఉప‌గ్ర‌హం ఆన్ బోర్డ్ లోని ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్ స‌హాయంలో జియో స్టేష‌న‌రీ క‌క్ష్యలో ప్ర‌వేశిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

మ‌న శాస్త్రవేత్త‌ల‌కి ఆస‌క్తి గ‌ల విస్తార‌మైన ప్రాంతాల‌కు సంబంధించిన వాస్త‌విక చిత్రాల‌ను  ఉప‌గ్ర‌హం త‌ర‌చు అందిస్తూ ఉంటుంద‌ని  ఇఒఎస్ గురించి వివ‌రిస్తూ మంత్రి తెలిపారుప్ర‌కృతి వైప‌రీత్యాలు స‌త్వ‌రం ప‌ర్య‌వేక్షించేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుందివివిధ సంఘ‌ట‌న‌ల‌కుస్వ‌ల్ప‌కాలిక సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన స‌మాచారం కూడా అందిస్తుంద‌న్నారు.

 

శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఉప‌యోగించి స‌గ‌టు మ‌నిషికి ప్ర‌యోజ‌నం క‌ల్పించాల‌ని, “జీవ‌న సౌల‌భ్య‌త”‌, “వ్యాపార సౌల‌భ్య‌త” అందుబాటులోకి తేవాల‌న్న‌ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజ‌న్ కు దీటుగా  కొత్త ఉప‌గ్ర‌హం వ్య‌వ‌సాయంఅడ‌వులునీటి మ‌డుగులు వంటి వ‌న‌రుల స‌మాచారం అందించ‌డ‌మే కాకుండా వైప‌రీత్యాల హెచ్చ‌రిక‌తుపాను హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంకుంభ‌వృష్టి లేదా గాలివాన‌ల వంటి వైప‌రీత్యాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

ప్ర‌ధాన‌మంత్రిగా శ్రీ న‌రేంద్ర మోదీ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌తీ ఒక్క మంత్రిత్వ శాఖ‌లోను, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప్ర‌క్రియ‌కు చెందిన ప్ర‌తీ ఒక్క విభాగంలోనూ దేశీయ సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చేందుకు నిరంత‌ర కృషి చేస్తున్నార‌న్న విష‌యం డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ "ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్" విజ‌న్‌కు అనుగుణంగా ఈ ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ద‌న్నారు.

మాన‌వ జీవితానికి సంబంధించినంత వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క రంగంలోనూ ఉప‌యోగిస్తున్న అంత‌రిక్ష టెక్నాల‌జీకి చెందిన  విభిన్నఅప్లికేష‌న్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింది. అంత‌రిక్ష టెక్నాల‌జీలో మ‌నం అనుస‌రిస్తున్న సిద్ధాంతాలు,  అనుభ‌వాలను ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ అంత‌రిక్ష సంస్థ‌లు ఇత‌రుల‌కు అందిస్తున్నాయి.

 

***



(Release ID: 1745056) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi