ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 కారణంగా ఆహార ద్రవ్యోల్బణం పెర‌గ‌కుండా అరికట్టడానికి మరియు సామాన్యుడి సమస్యల్ని తగ్గించడానికి ప‌లు చ‌ర్య‌లు

Posted On: 10 AUG 2021 6:30PM by PIB Hyderabad

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కార‌ణంగా బాధపడుతున్న ప్రజల స్థితిని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు మ‌రీ ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా క‌ట్ట‌డి చేసేందుకు గాను ప్రభుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి తెలియ‌జేశారు. సామాన్యుల సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న మరిన్ని చర్యలను గురించి మంత్రి వివరిస్తూ ఈ వస్తువుల ధరల అస్థిరతను పరిష్కరించడానికి పప్పుల బఫర్ స్టాక్ ఉపయోగ‌ప‌డిందని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో బఫర్ నుండి పప్పుల స‌ర‌ఫ‌రాను చాలా ప్రభావవంతంగా ఉపయోగించబడ్డాయి. ప్రతి ఇంటికి నెలకు 1 కేజీ చొప్పున ఉచితంగా ప‌ప్పులు సరఫరా చేయబడ్డాయి. 2020 ఏప్రిల్ మరియు నవంబర్ మధ్య కాలంలో 19 కోట్ల జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద లబ్ధిదారుల కుటుంబాల వారికి వీటిని స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మైంది. నిత్యావసర వస్తువుల చట్టం- 1955 మేర‌కు
జూలై 2021లో కొన్ని పప్పులపై ప్ర‌భుత్వం నిల్వ‌ పరిమితులను విధించింది. దీని కార‌ణంగా వాటి ధ‌ర‌లు కొంత త‌గ్గేందుకు వీలు క‌లిగింద‌ని ఇదిప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో కంది పప్పు, మునుప ప‌ప్పు మ‌రియు పెస‌ర ప‌ప్పుల‌ లభ్యత మెరుగుపరచడానికి ప్రభుత్వం వీటిపై దిగుమతి ఆంక్షలను సడలించిందని మరియు పప్పుల దిగుమతి కోసం మయన్మార్, మలావి, మొజాంబిక్‌తో అవ‌గాహ‌న ఒప్పందాల‌ను కూడా చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. మసూర్‌పై ప్రాథమిక దిగుమతి సుంకం మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్‌ల‌ను వరుసగా సున్నా మరియు 10% కి తగ్గించబడ్డాయి. వంట‌ నూనెల ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని మరియు ముడి పామాయిల్ (సీపీఓ) పై సుంకాన్ని తగ్గించామని, సీపీఓ పై ప్రభావవంతమైన పన్ను రేటును 35.75% నుండి 30.25% కి తగ్గించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంకా, శుద్ధి చేసిన పామాయిల్ / పామోలిన్ మీద సుంకాన్ని 45% నుండి 37.5% కి తగ్గించినట్లు మంత్రి తెలిపారు.
                                                                   

****


(Release ID: 1744627)
Read this release in: English , Urdu