పర్యటక మంత్రిత్వ శాఖ

ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్/ ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ గైడ్ అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించిన పర్యాటక మంత్రిత్వ శాఖ :శ్రీ కిషన్ రెడ్డి

Posted On: 10 AUG 2021 5:48PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు:

* ఈ కోర్సు అభ్యర్థులకు ప్రాథమికఅధునాతన (IITF - వారసత్వం మరియు సాహసం)మాట్లాడే భాష మరియు రిఫ్రెషర్ కోర్సులను  అందిస్తుంది.

·          డచ్జర్మన్ఫ్రెంచ్జపనీస్చైనీస్ మొదలైన  భాషల్లో  పర్యాటక మంత్రిత్వ శాఖ  6 వారాల భాషా కోర్సులను (ఆఫ్‌లైన్)  నిర్వహిస్తోంది,

ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్/ ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ గైడ్ అంశాల్లో పర్యాటక మంత్రిత్వ శాఖ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించింది. దేశవ్యాపితంగా పర్యాటకులకు సౌకర్యాలను కల్పించే అంశంలో శిక్షణ పొందిన వారిని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో డిజిటల్ విధానంలో ఈ కోర్సులను ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్  ఈ కోర్సులను నిర్వహిస్తుంది. 

2020 జనవరి ఒకటవ తేదీ నుంచి కోర్సులు ప్రారంభం అయ్యాయి. ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు ప్రాథమికఅధునాతన (IITF - వారసత్వం మరియు సాహసం)మాట్లాడే భాష మరియు రిఫ్రెషర్ కోర్సులను అందిస్తారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల సహకారంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్  పాఠ్య అంశాలను రూపొందిస్తుంది. ఆన్ లైన్ విధానంలో అభ్యర్థులు ఎక్కడ నుంచి అయినా ఎప్పుడైనా కోర్సులలో చేరవచ్చును. వివిధ డిజిటల్ సాధనాల ద్వారా కోర్సుల వివరాలను పొందవచ్చు. కోర్సును పూర్తి చేసిన అతను / ఆమెకు దేశంలో పర్యటించడానికి ఆసక్తి కనబరిచే పర్యాటకులకు దేశ పర్యాటకం, ఇతర అంశాలను వివరించి వారికి అవసమైన సౌకర్యాలను అందించడానికి అధీకృత టూరిస్ట్ ఫెసిలిటేటర్ గా సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. 

ఇంతేకాకుండా, డచ్జర్మన్ఫ్రెంచ్జపనీస్చైనీస్ మొదలైన  భాషల్లో  పర్యాటక మంత్రిత్వ శాఖ  6 వారాల భాషా కోర్సులను (ఆఫ్‌లైన్)  నిర్వహిస్తోంది. వివిధ దేశాల నుంచి పర్యాటకులు మాట్లాడే భాషలో మాట్లాడి వారికి అవసరం అయ్యే సదుపాయాలను సమకూర్చడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

స్థానిక  స్థాయిలో  గైడ్ లైసెన్సులను జారీ చేయడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పర్యాటక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఈ సమాచారాన్ని పర్యాటక శాఖ మంత్రి శ్రీ. జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్య సభలో లిఖితపూర్వకంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం లో అందించారు. 

***



(Release ID: 1744626) Visitor Counter : 160


Read this release in: English , Urdu