వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వరిగడ్డితో జీవ ఎరువుల తయారీపై అవగాహన పెంపు చర్యలు


2020-21 లో 25 రాష్ట్రాల రైతులకు జీవ ఎరువుల కిట్స్ పంపిణీ
పూసా డీకంపోజర్ భారీ తయారీ, మార్కెటింగ్ కోసం 12 కంపెనీలకు

సాంకేతిక పరిజ్ఞానం అందించిన ఐఏఆర్ఐ

Posted On: 10 AUG 2021 6:36PM by PIB Hyderabad

భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ సి ఎం ఆర్) తాను  రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన పూసా డీకంపోజర్ టెక్నాలజీ ని ప్రదర్శించింది.    దేశవ్యాప్తంగా పంటలో మిగిలిపోయే పదార్థాలను వాడుకోవటం మీద ఈ పరిశోధన సాగింది.

1.      2020 లో 56730 హెక్టార్లకు పూసా డీకంపోజర్ యూనిట్లను అందజేశారు. అందులో ఉత్తరప్రదేశ్ (3700 హెక్టార్లు), పంజాబ్  (200 హెక్టార్లు), ఢిల్లీ  (800 హెక్టార్లు ), పశ్చిమ బెంగాల్ (510 హెక్టార్లు), తెలంగాణ  (100 హెక్టార్లు) ఉన్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య ( సి ఐ ఐ) -100 హెక్టార్లు, స్వచ్ఛంద సంస్థలు , రైతులు (320 హెక్టార్లు ) ఉన్నాయి.

2.      10,000 కు పైగా హెక్టార్లకు సరిపడేలా 2020-21లో 25రాష్ట్రాలకు ఈ కాప్స్యూల్   కిట్స్ పంపిణీ జరిగింది.

3.      వారి వ్యర్థాల నుంచి జీవ ఎరువు తయారీకి సంబంధించి వ్యవసాయ క్షేత్రాలలోనే ప్రయోగాత్మకంగా వాడి చూపించి పూసా డీకంపోజర్ మీద  గ్రామీణులకు అవగాహన కల్పించారు. పంజాబ్ లోని మీర్పూర్ (ముఖేరియా) బలిం ( గురదాస్ పూర్), కవహాలి ( అమృత్ సర్), సలీనా ( మోగా), కత్తయన్   వాలి (ఫజిల్కా), హర్యానాలోని    బద్వాసిని ( సోనిపట్),  అన్వయల్ ( రోహ్ తక్)  గ్రామాలున్నాయి. పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఎరువుగా మార్చుకోవాలని తెలియజెబుతూ “జలనా నహీ, గలనా హై  అనే నినాదాన్ని ప్రచారం చేశారు.

4.     లూధియానాలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. హిస్సార్ లోని హిస్సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయ  శాస్త్రవేత్తలకోసం  ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో కలసి క్షేత్ర దర్శనం చేపట్టారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అభ్యుదయ రైతులు కూడా ఇందులో పాల్గొన్నారు. వరిగడ్డి  ని వదిలేయకుండా ఈ పూసా డీకంపోజర్ సాయంతో ఎలా ఎరువుగా మార్చవచ్చునో ఢిల్లీ రైతుల పొలాల్లో  ప్రదర్శించి  చూపారు.

5.      అంతే కాకుండా  క్రమం తప్పకుండా రైతులతో ఆన్ లైన్ సమావేశాలు, వెబినార్లు, వాట్సాప్ చాట్  నిర్వహించి వారికి టెక్నాలజీ పట్ల అవగాహన పెంచి వరిగడ్డిని తగలబెట్టకుండా చూస్తున్నారు.

6.      పూసా సమాచార్  పేరుతో వారం వారం ఐ ఎ ఆర్ ఐ నిర్వహించే యూట్యూబ్ చానల్  లో కూడా పూసా డీకంపోజర్ సాంకేతిక పరిజ్ఞానం మీద కార్యక్రమం ప్రసారం చేయటం రైతులకు లబ్ధి చేకూర్చుతోంది.

ఐఏఆర్ ఐ ఈ టెక్నాలజీని వాడుకోవటానికి 12 కంపెనీలకు అనుమతి ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఈ యూనిట్ల తయారీ, మార్కెటింగ్ కోసం  ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఐసీఏఆర్ – ఐ ఎ ఆర్ ఐ 20,000 యూనిట్ల ను కూడా రైతులకోశం స్వయంగా తయారుచేశాయి.   

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖామంత్రి  శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ ఈ రోజు లోక్ సభకు లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.

*****


(Release ID: 1744590) Visitor Counter : 327


Read this release in: English , Urdu