విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దేశంలో జల విద్యుత్ ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలు
Posted On:
10 AUG 2021 4:39PM by PIB Hyderabad
దేశంలో జల విద్యుత్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక విధానపరమైన కార్యక్రమాలను చేపట్టింది. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2005, నేషనల్ టారిఫ్ పాలసీ 2016, నేషనల్ రీహాబిలిటేషన్ & రీసెటిల్‌మెంట్ పాలసీ 2007, భూ సేకరణలో న్యాయమైన పరిహారం & పారదర్శకత హక్కు, రీహాబిలిటేషన్ & రీసెటిల్‌మెంట్ చట్టం 2013 వంటివి ఈ చర్యల్లో భాగం.
జల విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 8, 2019న చర్యలు తీసుకుంది, దీనికింద, ఈ క్రింది నిబంధనలు రూపొందించారు:
(i) పెద్ద జల ప్రాజెక్టులను (> 25 మె.వా.) పునరుత్పాదక శక్తి వనరులుగా ప్రకటించడం
(ii) జల విద్యుత్ సుంకాలు తగ్గించేందుకు హేతుబద్ధీకరణ చర్యలు
(iii) వరద ఆధునీకరణ/నిల్వ జల విద్యుత్ ప్రాజెక్ట్‌లకు (హెచ్‌ఈపీలు) ఆర్థిక మద్దతు
(iv) రోడ్లు/వంతెనల వంటి మౌలిక సదుపాయాల కల్పన ఖర్చుకు ఆర్థిక మద్దతు
2021-22 నుంచి 2029-30 కాలానికి హైడ్రో పర్చేజ్ ఆబ్లిగేషన్‌ను (హెచ్‌పీవో) కూడా 29.01.2021న ప్రభుత్వం ప్రకటించింది.
ఈ చర్యలు జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి, ముఖ్యంగా పర్వత ప్రాంతాలు/రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ప్రయోజనకరంగా ఉంటాయి. మారుమూల, సుదూర ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఉండి, అక్కడికి భారీ యంత్రాలు, పరికరాల తరలింపు కోసం రోడ్లు, వంతెనలు మొదలైన విస్తృత మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరయ్యే ప్రాజెక్టులకు ఉపయోగకరం.
కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1744524)
Visitor Counter : 237