నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

నైపుణ్యత, ఉపాధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం

Posted On: 09 AUG 2021 3:32PM by PIB Hyderabad

నైపుణ్యత, ఉపాధి రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి) ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం చొరవతో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవైవై) స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖ,  ఎన్‌ఎస్‌డిసి ద్వారా, స్కిల్ ఇండియా మిషన్ కింద భాగస్వామ్యం కోసం పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎన్‌ఎస్‌డిసి నైపుణ్య కార్యక్రమాలలో 2188 మంది శిక్షణ భాగస్వాములు పాల్గొంటున్నారు. వారందరూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (ఎస్ఎస్సిలు) పరిశ్రమ నేతృత్వంలోని సంస్థలుగా ఏర్పాటు అయ్యాయి, ఇవి శిక్షణ అవసరాల విశ్లేషణ, పాఠ్యాంశాల అభివృద్ధి, శిక్షణ, అంచనా, ధృవీకరణకు సహాయపడతాయి.

అదనంగా, ఎంఎస్డిఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్), ఐబిఎం ఇండియా , శాప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీల సిఎస్ఆర్ చొరవ కింద కోర్సులు నిర్వహించడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నాయి.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) 2020 దశలవారీగా అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో ఒకేషనల్, అకడమిక్ స్ట్రీమ్‌ల మధ్య సమైక్యతను నొక్కి చెబుతుంది. చెప్పిన విధానం ప్రకారం, వృత్తి విద్య 6 వ తరగతి నుండి పాఠశాలలో ప్రారంభమవుతుంది, ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఇప్పటికే హబ్, స్పోక్ మోడల్‌పై పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. హబ్, స్పోక్ మోడల్‌లో, పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐ)/ ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలు (పీఎంకేకే) ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (విఈటి) కేంద్రంగా మారతాయి; ఈ హబ్ నుండి పాఠశాలలు నైపుణ్య శిక్షణను చేపడతాయి. ఈ సినర్జీతో, పాఠశాల విద్యార్థులు తమ రంగాలలో అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాలను అంది పుచ్చుకుంటారు. ఐటిఐలలో అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతలను నేర్చుకుంటారు.

6 నుండి 19 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి యువకుడికి 12 సంవత్సరాల పాఠశాల స్థాయిని కనీసం ఒక సర్టిఫికేషన్ లెవెల్ 2 నుండి 4 వరకు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్) సర్టిఫికెట్ లేదా 10 సంవత్సరాల స్కూలింగ్, సర్టిఫికేషన్ 2 సంవత్సరాల ఐటీఐ ప్రోగ్రాంతో పూర్తి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుతం, ఈ కార్యక్రమం 4 రాష్ట్రాలు  (i) ఛత్తీస్‌గఢ్ (ii) మధ్యప్రదేశ్ (iii) ఒడిషా (iv) పశ్చిమ బెంగాల్ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో 2 జిల్లాలు, ఒక హబ్ ఐటీఐ ని గుర్తించాయి. పాఠశాలల మ్యాపింగ్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతోంది.

ఇంకా, ఎంఎస్డిఈ,  ఎన్‌ఎస్‌డిసి, దాని ఎస్ఎస్సి ల ఆధ్వర్యంలో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో (యుటీలు) 12,332 పాఠశాలల్లో సమగ్ర శిక్షా పథకాన్ని అమలు చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖను సులభతరం చేస్తోంది, , 2020-21 లో లాగే  21 విభాగాలలో 125 ఉద్యోగ కల్పనకు అవకాశం ఉన్న కోర్సులను అందిస్తోంది. ఈ చొరవ కింద, 2020-21 విద్యా సంవత్సరంలో 13 లక్షలకు పైగా విద్యార్థులు (విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా) నమోదు అయ్యారు.

అదనంగా,  ఎన్‌ఎస్‌డిసి ద్వారా మంత్రిత్వ శాఖ కమ్యూనిటీ కాలేజ్, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు (బివిఓసి), దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ కేంద్రాలు (డిడియుకేకే) అనే మూడు పథకాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు సహాయ పడుతుంది. ఎన్ఎస్క్యూఎఫ్ ఆమోదించిన క్వాలిఫికేషన్ ప్యాక్ ప్రకారం స్కిల్ కాంపోనెంట్ అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ నిర్వహించడానికి కళాశాలలు/ యూనివర్సిటీలు తమ పాఠ్యాంశాలను సమలేఖనం చేయడానికి సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ సహకరిస్తున్నాయి.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి,  ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

*****


(Release ID: 1744288) Visitor Counter : 149
Read this release in: English , Punjabi