ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 23.88 కోట్ల సంచిత నమోదులు పూర్తి

Posted On: 09 AUG 2021 6:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) 9మే 2015న ప్రారంభించబడింది. మ‌న‌ దేశంలో బీమా వ్యాప్తి స్థాయిని పెంచడానికి, సామాన్య ప్రజలకు ముఖ్యంగా పేదలకు మరియు సమాజంలోని అట్టడుగు వర్గాలకు బీమా సౌకర్యాన్ని అందించే ఉద్దేశంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈరోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన‌ సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసంరావు ఖ‌రాద్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.
ప్రారంభించినప్పటి నుండి పీఎంఎస్‌బీవై కింద నమోదులు క్రమంగా పెరుగుతూ వ‌చ్చాయి. ఈ
బీమాలో ప‌థ‌కంలో సంచిత న‌మోదుల సంఖ్య 2021 జూలై 21వ తేదీ నాటికి 23.88 కోట్ల‌కు చేరుకున్నాయ‌ని మంత్రి వివ‌రించారు. ప్రజలలో ఈ పథకం గురించి అవగాహన పెంచడానికి ప‌లు  చర్యలు చేప‌ట్టిన‌ట్టుగా మంత్రి తెలిపారు. ఆ వివ‌రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు:

ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు, బ్యాంకులు మీడియా ద్వారా ప్రచారాన్ని నిర్వహించాయి, అవి పెద్ద సంఖ్యలో ప్రజలలో అవగాహన కల్పించడానికి మరియు పథకాల ప్రాప్యతను సులభతరం చేయడానికి కూడా వివిధ ర‌కాల ప్రయత్నాలు చేశాయి.

పీఎంఎస్‌బీవై గురించి క్ర‌మం త‌ప్ప‌కుండా వార్తాపత్రికలు, టెలివిజ‌న్‌ మరియు రేడియో ద్వారా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం జ‌రిగింది.

ఈ పథకానికి సంబంధించిన ఫారమ్‌లు, నియమాలు, తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూ) మొదలైన అన్ని సంబంధిత మెటీరియల్ / సమాచారాన్ని హోస్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్ www.jansuraksha.gov.in ఏర్పాటు చేయ‌డ‌మైన‌ది.

ఈ పథకం గురించి పోస్టర్లు మరియు బ్యానర్ల‌ను దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలు మరియు బీమా కంపెనీలలో ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించబడినాయి.
                               

****


(Release ID: 1744286)
Read this release in: English , Punjabi