ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు మరియు ప్రైవేట్ రేడియో స్టేషన్లతో "ఇంటరాక్టివ్ వర్క్‌షాప్" ను నిర్వహించిన - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
వినూత్నమైన రేడియో కార్యక్రమాల ద్వారా వ్యాక్సిన్ మరియు టీకా గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికి నిరంతర కృషి అవసరమని నొక్కి చెప్పిన - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
Posted On:
06 AUG 2021 8:23PM by PIB Hyderabad
కోవిడ్ కు తగిన ప్రవర్తన (సి.ఏ.బి) కు కట్టుబడి ఉండటం గురించి, టీకా యొక్క ప్రయోజనాలు, తప్పుడు సమాచారం, అపోహలను తొలగించడం వంటి కార్యక్రమాలతో పాటు, కోవిడ్‌కు సంబంధించిన వివిధ సమస్యల పట్ల అర్ధవంతమైన అవగాహనా కార్యక్రమాలను రూపొందించడం కోసం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఈ రోజు, యూనిసెఫ్ భాగస్వామ్యంతో, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు, ప్రైవేట్ రేడియో స్టేషన్ల ప్రతినిధులతో, "ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ సెషన్" ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోని 70 కి పైగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లు, ప్రైవేట్ రేడియో స్టేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో శ్రీ లవ్ అగర్వాల్, కీలక ప్రసంగం చేస్తూ, రేడియో స్టేషన్లు తమ శ్రోతలకు విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా, ఆరోగ్య సంరక్షణ కార్మికుల(హెచ్.సి.డబ్ల్యూ. లు) స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రసారం చేయడం ద్వారా, కోవిడ్ సముచిత ప్రవర్తనను అనుసరించడంలో సమాజ భాగస్వామ్యంలో రేడియో స్టేషన్ల సహకారాన్ని ప్రశంసించారు. ఏవైనా టీకాలు, టీకా పుకార్లను తగ్గించి, పెద్ద సంఖ్యలో టీకా అర్హత కలిగిన జనాభా టీకా ను వేయించుకోడానికి ప్రోత్సహించడంలో, ఈ రేడియో స్టేషన్లు సానుకూల పాత్ర పోషించాయని ఆయన తెలిపారు.
పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న జనాభాకు కోవిడ్ సందేశాలను అందించడంలో రేడియో స్టేషన్లు క్లిష్టమైన మాధ్యమంగా వ్యవహరిస్తున్నాయని ఆయన నొక్కి చెప్పారు. వారి కార్యక్రమాల్లో, విషయ నిపుణులను ఆహ్వానించి, టీకా సంకోచానికి సంబంధించిన అవాస్తవ సమస్యలను పరిష్కరించడానికి వినూత్నమైన మరియు ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయడం ద్వారా రేడియో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని, ఆయన అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వయోజన టీకా కార్యక్రమం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి అన్ని రంగాలలోని ఫ్రంట్-లైన్ కార్మికుల నుండి కమ్యూనిటీ లీడ్ పాజిటివ్ చొరవలను, రోల్ మోడల్ లను హైలైట్ చేయాలని ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులను కోరారు. కోవిడ్ రెండవ దశ ఇంకా ముగియలేదనీ, సమాజం కోవిడ్ సురక్షిత ప్రవర్తనను విస్మరించిన వెంటనే వైరస్ తిరిగి వచ్చే ప్రమాదం ఉందనీ, అందువల్ల, కోవిడ్ సముచిత ప్రవర్తనను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని పౌరులకు నిరంతరం గుర్తు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
కోవిడ్ సమయంలో ప్రజల మానసిక స్థితి, శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఈ సమస్యను క్రమం తప్పకుండా పరిష్కరించడం చాలా ముఖ్యమని, ఆయన సూచించారు. కోవిడ్ కి వ్యతిరేకంగా పోరాటంలో - కోవిడ్ సముచిత ప్రవర్తన యొక్క కమ్యూనిటీ యాజమాన్యం, తగిన సాక్ష్యాల ఆధారంగా సమాచారాన్ని అందించడం, కోవిడ్ మరియు టీకాల పై అపోహలను తొలగించడం వంటి, మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయని, ఆయన వివరించారు.
దేశంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితి గురించి వివరిస్తూ, ఆయన, ఐదు రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలు, చర్యలను కూడా, ఆయన, ఈ సందర్భంగా, ప్రత్యేకంగా వివరించారు.
శ్రోతలకు అవగాహన, స్ఫూర్తి నిచ్చే వినూత్నమైన రేడియో మరియు టాక్ షోల గురించి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు, తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు, యూనిసెఫ్ కు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
*****
(Release ID: 1743676)
Visitor Counter : 188