మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ కారణంగా అనాథలైన బాలలు

Posted On: 05 AUG 2021 5:36PM by PIB Hyderabad

  కోవిడ్ వైరస్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలై ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలకు 2015వ సంవత్సరపు జువెనైల్ జస్టిస్ (బాలల సంక్షేమం, రక్షణ) చట్టంలోని నిబంధనల ప్రకారం సంరక్షణ కల్పిస్తున్నారు. ఇలాంటి పిల్లలకు సంస్థాగతమైన, సంస్థగతంకాని సంరక్షణతో పాటుగా, వారి భద్రతకోసం సేవలందించే వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని జువెనైల్ చట్టం, నిబంధలు పేర్కొంటున్నాయి. కోవిడ్.తో అనాథలైన బాలలకు సంరక్షణ కల్పించేందుకు చిన్నారుల రక్షణ సేవల పథకాన్ని (సి.పి.ఎస్.ను) కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. జువెనైల్ జస్టిస్ చట్టంలోని నిబంధనలమేరకు,.. రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాగాల భాగస్వామ్యంతో మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంటోంది. సి.పి.ఎస్. మార్గదర్శక సూత్రాలు నిర్దేశించిన ప్రకారం,.. సంస్థాగతం కాని సంరక్షణలో ఉన్న పిల్లలకు ఒక్కొక్కరికి పోషణ నిర్వహణకు నెలకు రూ. 2,000 చెల్లించేందుకు అవకాశం ఉంది. అలాగే, బాలల సంరక్షణ సంస్థల్లో సంస్థాగత రక్షణలో తలదాచుకుంటున్న పిల్లలకు తగిన భద్రత కల్పిస్తూ, ఒక్కొక్కరికి నెలకు రూ. 2,160 చొప్పున గ్రాంటుగా ఇవ్వాల్సి ఉంటుంది.

  కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన, లేదా వారిలో ఎవరైనా ఒకరిని కోల్పోయినా, చట్టపరమైన సంరక్షణ కర్తను కోల్పోయినా,  తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయినా అలాంటి  పిల్లలకు పి.ఎం. కేర్స్ చిన్నారుల పథకం కింద సంరక్షణ కల్పించాలని గౌరవ ప్రధానమంత్రి ప్రకటించారు. పి.ఎం.కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఈ పథకం కింద బాధిత చిన్నారుల విద్యాభ్యాసానికి, ఆరోగ్య సంరక్షణకు తగిన సహాయం అందుతుంది. అలాగే సదరు పిల్లలకు 18సంవత్సరాలు వచ్చే సరికి ఒక్కొక్కరికి రూ. 10లక్షలతో కార్పస్ ఫండ్ ఏర్పాటవుతుంది. అలాంటి వారికి 18 సంవత్సరాల వయస్సునుంచి తదుపరి ఐదేళ్లవరకూ ఉన్నత విద్యాభ్యాసంలో నెలసరి వ్యక్తిగత ఖర్చుల కోసం నెలసరి ఆర్థిక సహాయంగా ఈ కార్పస్ ఫండ్ ఉపయోగపడుతుంది. 23 సంవత్సరాల వయస్సు చేరిన తర్వాత కార్పస్ ఫండ్ మొత్తాన్ని వారు తమ వ్యక్తిగత వ్యయానికి, వృత్తిపరమైన ఖర్చుకు వినియోగించుకునేందుకు వీలుంటుంది. పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఈ పథకం pmcaresforchildren.in అనే ఆన్.లైన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2021వ సంవత్సరం జూలై 15వ తేదీన ఈ పోర్టల్ పరిచయం చేయబడింది. ఈ పథకం కింద సహాయానికి అర్హులైన బాధిత పిల్లలు ఎవరైనా ఉంటే,.. సదరు సమాచారాన్ని పౌరుడెవరైనా సరే ఈ పోర్టల్ ద్వారా పరిపాలనా యంత్రాగానికి తెలియజేయవచ్చు.

   కోవిడ్-19 కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పిల్లల సంరక్షణకోసం సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆయా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ విషయంలో,.. 2015వ సంవత్సకపు జువెనైల్ జస్టిస్ చట్టం నిబంధనలు, ఇతర నియమావళికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. చిన్నారుల రక్షణ సేవల పథకం (సి.పి.ఎస్.) ప్రయోజనాలను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది. తమ సంరక్షణలో ఉన్న బాలల భద్రత, పర్యవేక్షణ కోసం చిన్నారుల సంరక్షణ సంస్థలు, కేంద్రాలు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను కూడా మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చిన్నారుల, వారి సంరక్షకుల మానసిక ఆరోగ్య రక్షణకు చిన్నారుల సంరక్షణ కేంద్రాలు చేపట్టవలసిన వ్యూహాలను కూడా మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ విషయంలో ప్రధాన విధి నిర్వాహకుల పాత్రను, వారి బాధ్యతలను సూచిస్తూ ఒక మార్గదర్శక సూత్రావళిని కూడా రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేయడం పూర్తయింది.

   ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారం ప్రకారం,.. 2021 ఏప్రిల్ నుంచి 2021 మే నెల 5వ తేదీ వరకూ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల సమాచారాన్ని ఈ దిగువన ఇచ్చిన అనుబంధ పట్టికలో చూడవచ్చు.

 

   కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ 2021 ఆగస్టు 5న రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

అనుబంధం

2021 ఏప్రిల్ నుంచి 2021 మే నెల 28 వరకూ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సమాచారం. (వివిధ  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన సమాచారం ప్రకారం...)

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం

అనాథలుగా మారిన పిల్లల సంఖ్య

1

అండమాన్, నికోబార్ దీవులు

0

2

ఆంధ్రప్రదేశ్

119

3

అరుణాచల్ ప్రదేశ్

0

4

అస్సాం

3

5

బీహార్

0

6

చండీగఢ్

0

7

చత్తీస్ గఢ్

16

8

దాద్రా, నాగర్, హవేళీ- డామన్, డయ్యూ

2

9

ఢిల్లీ

1

10

గోవా

0

11

గుజరాత్

45

12

హర్యానా

0

13

హిమాచల్ ప్రదేశ్

13

14

జమ్ము కాశ్మీర్

8

15

జార్ఖండ్

11

16

కర్ణాటక

09

17

కేరళ

09

18

లఢఖ్

0

19

లక్షద్వీప్

0

20

మధ్యప్రదేశ్

73

21

మహారాష్ట్ర

83

22

మణిపూర్

1

23

మేఘాలయ

1

24

మిజోరాం

0

25

నాగాలాండ్

0

26

ఒడిశా

10

27

పుదుచ్చేరి

2

28

పుదుచ్చేరి

20

29

రాజస్థాన్

19

30

సిక్కిం

0

31

తమిళనాడు

8

32

తెలంగాణ

23

33

త్రిపుర

0

34

ఉత్తరప్రదేశ్

158

35

ఉత్తరాఖండ్

8

36

పశ్చిమ బెంగాల్

3

 

మొత్తం

645

 

 

****(Release ID: 1743218) Visitor Counter : 144


Read this release in: English , Urdu