గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
'రెరా' కింద, 30 రాష్ట్రాలు/యూటీల్లో 67 వేలకుపైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నమోదు 70,601 ఫిర్యాదులు పరిష్కరించిన రెరా అధికారులు
Posted On:
04 AUG 2021 2:40PM by PIB Hyderabad
ఈ ఏడాది జులై 23 నాటికి, 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు "రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ"ని (రెరా) ఏర్పాటు చేశాయి. వివిధ రెరా అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది జులై 23 నాటికి, 67,669 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నమోదయ్యాయి. అదే తేదీ నాటికి 52,284 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా రెరా కింద నమోదయ్యారు.
వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో రెరా చురుగ్గా ఉంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది జులై 23 వరకు, 70,601 ఫిర్యాదులను రెరా అధికారులు పరిష్కరించారు.
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1742485)
Visitor Counter : 154