ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పరిస్థితుల్లో పని చేసిన ఆరోగ్య కార్యకర్తల సేవలను గుర్తించే దిశగా చర్యలు

Posted On: 03 AUG 2021 3:23PM by PIB Hyderabad

కోవిడ్ -19 సంబంధిత విధుల్లో నిమగ్నమైన ఆరోగ్య కార్యకర్తలు అందించే సేవలను గుర్తించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. వీటిలో కొన్ని:

  • కనీసం 100 రోజుల కోవిడ్ డ్యూటీకి సైన్ అప్ చేసి, దానిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి  కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధాన మంత్రి విశిష్ట కోవిడ్ జాతీయ సేవా సమ్మాన్ ఇస్తారు. 
  • కనీసం 100 రోజుల కోవిడ్ సంబంధిత విధిని పూర్తి చేసిన ఈ ప్రత్యేక పథకం కింద ఆరోగ్య నిపుణుల కోసం, సంబంధిత పబ్లిక్ సర్వీస్ కమిషన్/ ఇతర నియామక సంస్థల ద్వారా ఆరోగ్య నిపుణుల సాధారణ ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వడాన్ని రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి. 
  • ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం విశిష్ట కోవిడ్ సేవలకు తగిన గౌరవ వేతనం ఇవ్వడాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పరిగణించవచ్చు.

కేంద్రం 2020-21 విద్యా సంవత్సరానికి సెంట్రల్ పూల్ ఎంబిబిఎస్ సీట్లకు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ కోసం మార్గదర్శకాలలో 'వార్డ్ ఆఫ్ కోవిడ్ వారియర్స్' అనే కొత్త కేటగిరి ప్రవేశపెట్టింది. 2020-21 విద్యా సంవత్సరానికి ఈ కేటగిరీకి ఐదు సెంట్రల్ పూల్ ఎంబిబిఎస్ సీట్లు రిజర్వ్ చేశారు. ఎంబిబిఎస్ సీట్లను సెంట్రల్ పూల్ ఎంబిబిఎస్ సీట్ల కోసం "కోవిడ్ వారియర్స్" వార్డుల నుండి అభ్యర్థుల కోసం కేటాయించారు, 

ఇంకా, మహమ్మారి సమయంలో మానవ వనరుల క్లిష్టతను గ్రహించి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య కార్యకర్తల శ్రేయస్సును మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంది. 

  • 16 జనవరి 2021 న కోవిడ్ -19 టీకా ప్రారంభించడంతో, ఆరోగ్య సంరక్షణ కార్మికులను మొదటి ప్రాధాన్యత సమూహంలో ఒకటిగా గుర్తించారు. కోవిడ్ సంబంధిత పనిలో నిమగ్నమైన వైద్య నిపుణులకు తగిన టీకాలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు/ యుటి పరిపాలనలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. 
  • ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ కార్మికులకు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్రమణ నివారణ మరియు నియంత్రణ పద్ధతులపై మార్గదర్శకాలను అందించింది
  • కోవిడ్ -19 నిర్వహణ కోసం వైద్య సిబ్బంది, వైద్యేతర సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్మికులతో సహా మానవ వనరుల సామర్థ్యాలను పెంపొందించడానికి, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు ఇచ్చారు. 'కోవిడ్ -19 మానవ వనరుల నిర్వహణ కోసం సూచనలు జారీ చేశారు. వనరుల సమీకరణ, వారి బాధ్యత కేటాయింపు, కోవిడ్ -19 నిర్వహణ కోసం శిక్షణ అవసరాలు దీనిలో ఉన్నాయి.  
  • ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణ, వెంటిలేషన్, లాజిస్టిక్స్ మొదలైన వాటితో సహా వైద్య మరియు వైద్యేతర సిబ్బందికి శిక్షణ వనరులు క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తున్నారు. ఇవి ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 
  • కోవిడ్ -19, సెప్టిక్ షాక్, వెంటిలేషన్ స్ట్రాటజీ, ఏరోసోల్ ఉత్పత్తి చేసే వైద్య విధానాలు, ఇన్ఫెక్షన్, నివారణ నియంత్రణ పద్ధతులు, రోగుల మానసిక సంరక్షణ మొదలైన రోగుల విషయమై ఎయిమ్స్ ద్వారా వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఆన్‌లైన్ శిక్షణ, వెబ్‌నార్‌లు నిర్వహించారు. .
  • అదనంగా https://igot.gov.in/igot ద్వారా ఐజిఓటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో శిక్షణ మాడ్యూల్స్ కూడా అందుబాటులో ఉంచారు. అవి...
  • కోవిడ్-19 ప్రాథమిక అంశాలు
    క్వారంటైన్, ఐసొలేషన్ 
    పీపీఈ ద్వారా సంక్రమణ నివారణ
    కోవిడ్-19 ఉన్న రోగుల మానసిక సంరక్షణ
    వ్యాధి సంక్రమణ నివారణ, నియంత్రణ
    ప్రయోగశాల నమూనా సేకరణ, పరీక్ష
    కోవిడ్-19 క్లినికల్ నిర్వహణ
    కోవిడ్-19 నిర్వహణ
    ఐసియు సంరక్షణ, వెంటిలేషన్ నిర్వహణ
  • రాష్ట్ర నిఘా అధికారులు, వేగవంతమైన ప్రతిస్పందన బృందాలు, నిఘా కార్యకలాపాల కోసం గుర్తించబడిన కింద స్థాయి వర్కర్స్/వాలంటీర్ల శిక్షణ ద్వారా క్రియాశీల కేసుల శోధన, ట్రాకింగ్ కోసం పెద్ద ఎత్తున నియంత్రణ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. సేవలు వినియోగించే జాతీయ సేవా పథకం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, నెహ్రూ యువక్ కేంద్ర వాలంటీర్లు, ఆయుష్ విద్యార్థులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వారిని గుర్తించారు. 
  • క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లపై మార్గదర్శకత్వం అందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎయిమ్స్, ఢిల్లీని ముఖ్య నోడల్ సంస్థగా, రాష్ట్ర స్థాయి సిఓఈలతో క్లినికల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కోఇ) చొరవ ప్రారంభించారు. ఎయిమ్స్, ఢిల్లీ క్లినికల్ మేనేజ్‌మెంట్, సంబంధిత అంశాలపై రెగ్యులర్ వెబ్‌నార్‌లను నిర్వహిస్తోంది, రాష్ట్ర సిఓఈలు తమ మెడికల్ కాలేజీలు, జిల్లా, సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రులకు మరింతగా ఈ సమాచారాన్నితీసుకెళ్తున్నారు. 

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.



(Release ID: 1742103) Visitor Counter : 190


Read this release in: English , Punjabi