ఆయుష్
ఆయుష్ వైద్యవిధానం కింద కోవిడ్ -19 సంబంధిత మందులకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
03 AUG 2021 5:04PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, కోవిడ్ -19 నియంత్రణకు ఆయుర్వేద ,యోగా ఆధారిత జాతీయ చికిత్సా విధానానికి సంబంధించిన ప్రొటొకాల్‌ను విడుదల చేసింది.దీనిని వివిధ నిపుణుల కమిటీల అంగీకారంతో నేషనల్ టాస్క్‌ఫోర్స్ రూపొందించింది.ఆయుష్ మంత్రిత్వశాఖ వివిధ అంతర్ విభాగాల ఆయుష్ , ఆర్ అండ్ డి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసింది. ఇందులో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసిఎంఆర్), డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 9డిబిటి), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్ఐఆర్), ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్), ఆయష్ సంస్థలకు ప్రాతినిధ్యం కల్పించారు.
, వ్యాధినిరోధక అధ్యయనాలు, కోవిడ్ -19 పాజిటివ్ కేసులలో అదనపు చర్యలుగా నాలుగు ఔషధాలైన అశ్వగంధ, యష్ఠిమధు, గుడుచిప్లస్ పిప్పలి, పాలీ హెర్బల్ ఫార్ములేషన్ (ఆయుష్ -64)లపై అధ్యయనాలకు అంతర్ విభాగాల ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్‌ఫోర్సు క్లినికల్ రిసెర్చ్ ప్రొటోకాల్స్‌ను రూపొందించింది.
ఆయుష్-65, కబసుర్ కుడినీర్‌ను కోవిడ్ -19 చికిత్సకు గుర్తించారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల ఫలితాల ప్రకారం స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించని లేదా స్వల్ప కోవిడ్ లక్షణాలు, ఒక మాదిరి లక్షణాలు గల కేసులలో ప్రామాణిక చికిత్సకు అనుబంధంగా ఇది మంచి సామర్ధ్యం కలిగివున్నట్టు గుర్తించారు.
. ఆయుష్ -64 ప్రామాణీకృత చికిత్సకు అనుబంధ చికిత్సగా మంచి ఫలితం ఇచ్చిందని, క్లినికల్ రికవరీకి ఇది ఉపయోగపడిందని గుర్తించారు. ఆయుష్ -64ను నేషనల్ క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రొటోకాల్‌లో సిఫార్సు చేశారు. దీనిని కోవిడ్ -19 నియంత్రణకు ఆయుర్వేద, యోగా కింద దీనిని సిఫార్సు చేశారు. నేషనల్ టాస్క్‌ఫోర్సు వివిధ నిపుణుల కమిటీలను సంప్రదించి ఈ ప్రొటోకాల్ రూపొందించింది.అలాగే కబసుర్ కుడినీర్ అనేది ఒక సిద్ధ ఔషధం. దీనిపై కూడా క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ -19పేషెంట్లపై దీని సమర్ధత గురించి అధ్యయనం చేశారు. ఆయుష్ మంత్రిత్వశాఖ కింద, కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ (సిసిఆర్ ఎస్) సంస్థ స్వల్ప కోవిడ్ లక్షణాల చికిత్సలో ఇది ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించింది.
ఆయుష్ విధానాల కింద ఔషధాలనుంచి గరిష్ఠస్థాయిలో ప్రయోజనం పొందడానికి , ఆయుష్ -64, కబసుర కుడినీర్ ల పంపిణీకి దేశవ్యాప్త ప్రచారం చేపట్టడం జరిగింది. దీనిని ఆయుష్ మంత్రి త్వశాఖ కింద దేశవ్యాప్తంగా గల రిసెర్చ్ కౌన్సిళ్లు, జాతీయ సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
ఆయుష్ -64 ప్రస్తుత చికిత్సతోపాటు స్వల్ప, ఒక మాదిరి కోవిడ్ -19 లేదా లక్షణాలు లేని కోవిడ్ చికిత్సలో వాడేందుకు ఒక విధానంగా సూచించడానికి.ఆయుష్ 64 ఔషధం తయారు చేయడానికి అనుమతికి సంబంధించి తమ తమ పరిధులలో లైసెన్సులకు అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఆయుష్ లైసెన్సింగ్ అధికార యంత్రాంతం, డ్రగ్ కంట్రోలర్‌లు, నిపుణుల కమిటీలకు ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించింది. అయితే ఇందుకు సంబంధించి డ్రగ్స్, కాస్మొటిక్ నిబంధనలు 1945 సంబంధించిన ప్రొవిజన్లు ,నిర్దేశిత ప్రమాణాలు పాటించినవాటికి దీనిని మంజూరు చేయాలని సూచించారు.. ఇప్పటివరకు 11 రాష్ట్రాలకు సంబంధించిన 37 తయారీ యూనిట్లకు ఇసిఆర్ఎలు నేషనల్ రిసెర్చ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఆర్ డి సి ) ద్వారా ఆయుష్ -64 టెక్నాలజీని సమకూర్చారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ కోవిడ్ -19 కు సంబంధించి అనువర్తితాలు, పేటెంట్‌పై క్లెయిమ్‌లు, ప్రొప్రైటరీ (పిఅండ్ పాఇ) ఎఎస్‌యు, హెచ్ మందులు ,లైసెన్సుల తదితర అంశాలను పరిశీలించేందుకు అంతర్ విభాగాలతో కూడిన సాంకేతిక సమీక్షా కమిటీ (ఐటిఆర్‌సి)ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీలు, ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన డ్రగ్ పాలసీ సెక్షన్ రెఫర్ చేసిన వాటిని ఇది పరిశీలిస్తుంది. ఇప్పటివరకు కింది దరఖాస్తులను ఐటిఆర్‌సి, కోవిడ్ -19 క్లెయిమ్‌లకు సంబంధించి ఆమొదించింది.
ఎ) ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కు చెందిన పతంజలి రిసెర్చ్ ఫౌండేషన్ ట్రస్ట్ వారి దివ్య కొరొనిల్ టాబ్లెట్‌లను కోవిడ్ -19 నియంత్రణలో సపోర్టింగ్ చర్యగా ,నయం చేస్తుందన్న క్లెయిమ్ లేకుండా సిఫార్సు చేయబడింది.
బి) తమిళనాడుకు చెందిన మెసర్స్ అపెక్స్ లేబరెటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి క్లెవిరా టాబ్లెట్ ను స్వల్ప కోవిడ్ -19 స్థితికి సపోర్టింగ్ చర్యగా సిఫార్సు చేశారు.
సి) బెంగళూరులోని శ్రీవేద సత్వ ప్రైవేట్ లిమిటెడ్‌వారి శ్రీశ్రీతత్వ కు చెందిన కబసుర కుడినీర్‌ను కోవిడ్ -19 నిరోధం, కోవిడ్ స్వల్ప లక్షణాల విషయంలో వాడేందుకు సిఫార్సు చేయబడింది..
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితులలో ఆయుష్ 64 మందును కొనుగోలు చేయడంతోపాటు ఔషధాల కొనుగోలుకు నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్.ఎ.ఎం) నిధులను వాడుకునేందకు అనుమతించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రు 2271.551 లక్షల రూపాయలను ఆయుష్ మంత్రిత్వశాఖ ఇప్పటివరకు ఆమోదించింది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 1742102)
Visitor Counter : 174