వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పోషక విలువల చిరు ధాన్యాలపై రైతులకు అవాగాహన

Posted On: 03 AUG 2021 6:46PM by PIB Hyderabad

హైదరాబాద్ఆగస్ట్ 3:రాగిజొన్నబజ్రా వంటి చిరు ధాన్యాల (మిల్లెట్స్) పోషక విలువలపై ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్  సబ్ మిషన్ కిందప్రదర్శన మరియు శిక్షణ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. 

తృణధాన్యాల పంటల సాగు , పంటల రక్షణ, పంటల విధానం, నూతన/ హైబ్రిడ్ వంగడాలు పంపిణీ, పోషక విలువలు, చీడ పురుగుల నివారణ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ప్రోత్సాహకాలను అందించడం జరుగుతోంది. వ్యవసాయ పనిముట్లు/ పనిముట్లు/ వనరుల పరిరక్షణ యంత్రాలునీటి పొదుపు పరికరాలుపంటల సాగు సమయంలో శిక్షణల ద్వారా రైతుల సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం ప్రదర్శనలు / వర్క్‌షాప్‌లుసీడ్ మినికిట్‌ల పంపిణీప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పించడం జరుగుతున్నది. పోషక తృణధాన్యాల రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయడం, నైపుణ్య కేంద్రాలను నెలకొల్పడం,  తృణధాన్యాల విత్తనాల కేంద్రాలను నెలకొల్పడం లాంటి కార్యక్రమాలు కూడాజాతీయ ఆహార భద్రతా మిషన్  కింద అమలు జరుగుతున్నాయి. 

కేంద్ర పథకంగా అమలు జరుగుతున్న విస్తరణ కార్యక్రమాల పథకం కింద రైతులకు శిక్షణ, సందర్శనలు, ప్రదర్శనలు, రైతులతో చర్చలు, శాస్త్రవేత్తలతో రైతుల సమావేశాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి అవార్డ్ / ప్రగతిశీల రైతులు సభ్యులుగా వ్యవసాయ అవగాహనా శిబిరాల నిర్వహణ లాంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందుతున్నది.రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద రాష్ట్రాలు తృణధాన్యాల సాగును ప్రోత్సహించవచ్చును. ఈశాన్య ప్రాంతాల్లో మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది. 

ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నూతన చిరు ధాన్యాల వంగడాలు/ సంకరజాతి విత్తనాలను  అభివృద్ధి చేయడానికి   రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కేంద్రాల్లో పనిచేస్తున్న 45 యూనిట్లకు సహకారం అందిస్తున్నది.  

ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వకంగా ఇచ్చారు.  

***



(Release ID: 1742097) Visitor Counter : 207


Read this release in: English , Tamil