ఆర్థిక మంత్రిత్వ శాఖ

2020-21 ఆర్థిక సంవత్సరంలో 7,200 కి పైగా కేసులకు సంబంధించిన 31,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇన్‌-పుట్-టాక్స్-క్రెడిట్ మోసాన్ని ఛేదించిన - సి.జి.ఎస్.టి. అధికారులు

Posted On: 03 AUG 2021 5:29PM by PIB Hyderabad

2020-21 ఆర్థిక సంవత్సరంలో వస్తువులుసేవల పన్ను (జి.ఎస్.టిపరిధిలోని ఇన్‌-పుట్-టాక్స్-క్రెడిట్ (.టి.సినిబంధనను దుర్వినియోగం చేయడం ద్వారా 31,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పన్ను మోసాన్ని వస్తువులుసేవల పన్ను అధికారులు కనుగొన్నారు సందర్భంగానకిలీ .టి.సికి సంబంధించి, 7,200 కి పైగా కేసులు నమోదు చేయడం జరిగింది.   రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో సమాచారాన్ని పొందుపరిచారు. 

పరోక్ష పన్నులుసుంకాల కేంద్ర బోర్డు (సి.బి..సికింద సి.జి.ఎస్.టిఏర్పాటు ద్వారా కనుగొనబడిన ఇన్‌-పుట్-టాక్స్-క్రెడిట్ (.టి.సిమోసాన్ని  క్రింది విధంగా మంత్రి పేర్కొన్నారు:

 

 క్రమ

సంఖ్య

కాల

వ్యవధి

కేసుల

సంఖ్య

మొత్తం విలువ

(రూపాయలు కోట్లలో)

1

2020-21

7,268

31,233.40 

 

అటువంటి మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు  విధంగా ఉన్నాయనికేంద్ర మంత్రి పేర్కొన్నారు:

*     కొత్తగా నమోదు కోసం దరఖాస్తులను పరిశీలంచే సమయంలో ఆధార్ ప్రామాణీకరణను ప్రవేశపెట్టడం

కొత్తగా నమోదు కోరుతున్న దరఖాస్తుదారుల యొక్క రద్దు చేయబడిన / ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్లను ధృవీకరించే సౌకర్యం;

శాఖాపరమైన ప్రతికూల నోటీసులో కనుగొనబడిన పన్ను చెల్లింపుదారుల నమోదును నిలిపివేయడానికి / రద్దు చేయడానికి తగిన నిబంధనలు

వ్యాపార రహస్య సమాచారం ఆధారంగా జి.ఎస్.టి.ఎన్ద్వారా పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటుసి.బి..సిద్వారా దానిపై తదుపరి చర్యలను కొనసాగించడం 

*   సి.జి.ఎస్.టిచట్టం, 2017 కు చెందిన ఫారం-జి.ఎస్.టి.ఆర్.1 మరియు ఫారం-జి.ఎస్.టి.ఆర్.3బి. (రూల్-21) మధ్య అసమతుల్యత ఉన్న చోట రిజిస్ట్రేషన్ రద్దు కోసం అదనపు ఆధారాలు ప్రవేశపెట్టడం జరిగింది;

నకిలీ డీలర్లు మరియు నకిలీ కంపెనీలు వారి జి.ఎస్.టి.ఆర్.3బిరిటర్నులను దాఖలు చేయకుండా మరియు పన్నులు చెల్లించకుండానకిలీ క్రెడిట్ను పాస్ చేయకుండా నిరోధించడానికి వీలుగా, 2 లేదా అంతకంటే ఎక్కువ జి.ఎస్.టి.ఆర్.-3.బిరిటర్నులను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారుడు ఫారం జి.ఎస్.టి.ఆర్-1లో బాహ్య సరఫరా ప్రకటనలను సమర్పించకుండా నిరోధించడానికి ఒక నిబంధన చేయబడింది.

*     50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న అన్ని బి.2.బిలావాదేవీ లకు -ఇన్వాయిస్లు తప్పనిసరి చేయబడ్డాయి. 

*     వరుసగా రెండు నెలల పాటు వారి ఆదాయ వివరాలను పొందుపరచని పన్ను చెల్లింపుదారులు-వే బిల్లులు రూపొందించకుండా పరిమితం చేయబడింది.  ఏదైనా సంస్థ మోసపూరితంగా .టి.సి.  ప్రయోజనం పొందినట్లుసంబంధిత అధికారి నమ్మడానికి తగిన కారణం ఉన్నట్లయితేసి.జి.ఎస్‌.టిచట్టం, 2017 లోని నిబంధన 86- ప్రకారం ఐటిసి క్రెడిట్‌ ని నిరోధించడం ప్రవేశపెట్టబడింది.

 

****

 


(Release ID: 1742043) Visitor Counter : 202


Read this release in: English , Marathi