ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జంక్ / ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ప్రతికూల ప్రభావం

Posted On: 30 JUL 2021 5:19PM by PIB Hyderabad

డయాబెటిస్, గుండె జబ్బులు & కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధికి అనేక కారణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఈ అంశాలలో ఒకటని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కొవ్వు, చక్కెర లేదా ఉప్పు అధికంగా ఉన్న ఉత్పత్తులు అధిక బరువు, ఊబకాయం లేదా కొన్ని నాన్-కమ్యూనికేషన్ వ్యాధుల (ఎన్‌సిడి) ప్రమాదాన్ని పెంచుతాయని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

జంక్ ఫుడ్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కానీ పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అంతేగాక అధిక మెటబాలిక్ అధిక బరువుకు దారితీసి ఊబకాయానికి కారణమవుతుంది. ఊబకాయం ఉన్న వ్యక్తులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇవి కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్‌కు మాత్రమే పరిమితం కాకుండా గుండెపోటు మరియు ఇతర ఎన్‌సిడిలకు కూడా కారణమవుతాయి.

"ఇండియా: నేషన్స్ స్టేట్స్ హెల్త్"-ఇండియా స్టేట్-లెవల్ డిసీజ్ బర్డెన్ ఇనిషియేటివ్ 2017 అధ్యయన నివేదిక ప్రకారం క్రానిక్ డిసీజెస్ (ఎన్‌సిడి) నిష్పత్తి భారతదేశంలో 1990 లో 30.5 % నుండి 2016 లో 55.4 % కి పెరిగింది. జీవక్రియ ప్రమాద కారకాలు / క్రానిక్ డిసీజెస్ (ఎన్‌సిడి) పెరుగుదలకు కారణమైన అధ్యయనంలో అనారోగ్యకరమైన ఆహారం కూడా ఉంది.

కొవ్వు, చక్కెర మరియు ఉప్పు వినియోగాన్ని క్రమంగా తగ్గించడం ద్వారా ఆహారంలో మార్పులు చేయమని వినియోగదారులను ప్రోత్సహించడానికి 'అజ్ సే తోడా కామ్' పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించినట్లు ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఐ) తెలియజేసింది. దీని కోసం చిన్న వీడియోల శ్రేణి (12 భాషల్లో ఉపశీర్షికలతో) సృష్టించబడింది. ఈ ప్రచారానికి ఫ్లైయర్స్, బ్యానర్లు, ఆడియో క్లిప్‌లు మరియు కొవ్వు, ఉప్పు మరియు చక్కెర వినియోగం క్రమంగా తగ్గడంపై ఉపయోగకరమైన ఇన్‌పుట్‌లతో కూడిన ‘ఈట్ రైట్ ఇండియా’ వెబ్‌సైట్‌ మద్దతు ఉంది.

ఐసిఎంఆర్-ఎన్‌ఐఎన్‌ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) తో పాటు ఎఫ్ఎస్ఎస్ఎఐ అధిక కొవ్వు, ఉప్పు, చక్కెరలు (హెచ్ఎఫ్ఎస్ఎస్) ఫుడ్ లేబుల్స్ కోసం మార్గదర్శకాలను సిఫారసు చేసింది. ఈ ఆహార పదార్థాల వినియోగం మితంగా ఉంటుంది.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా వాడకంతో పాటు ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.వీటితో పాటు క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ మరియు స్ట్రోక్ (ఎన్‌పిసిడిసిఎస్) నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం రాష్ట్రాలు చేపట్టాల్సిన అవగాహన  కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

***
 


(Release ID: 1740895) Visitor Counter : 123


Read this release in: English , Punjabi